అందరికీ తెలిసిందే కదా… కేసీయార్ మంచి కథకుడు అని..! తను రాజకీయాల్లోకి వచ్చాడు గానీ సినిమాలకు గనుక కంట్రిబ్యూట్ చేసే పక్షంలో కల్కి రేంజ్ కథలు అందించగలడు… రాజమౌళి తండ్రి వీరకథకుడు విజయేంద్రప్రసాద్ కూడా ఎందుకూ కొరగాడు…
ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసుకున్న కొత్తపలుకులోని అంశాలు చదువుతుంటే అలాగే అనిపిస్తుంది… ఈమధ్య ఎమ్మెల్యేలతో మీటింగులు పెట్టుకుని, కాంగ్రెస్‌లోకి వెళ్లకండి, వెళ్లకండి అని కేసీయార్ చెబుతున్న వార్తలు చదువుతున్నాం కదా… మస్తు సీక్రెట్స్ మాట్లాడుకున్నం అని మల్లారెడ్డి కూడా అన్నాడు కదా… ఆ సీక్రెట్లు ఏమిటో, ఎమ్మెల్యేలకు ఏం కథలు చెబుతున్నాడో ఆంధ్రజ్యోతి చెప్పుకొచ్చింది…
‘‘ఒకటీరెండు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, రేవంత్ ప్రభుత్వం కూలిపోతుంది… నల్గొండ, ఖమ్మం, వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనతో టచ్‌లో ఉన్నారు… బీజేపీ ఢిల్లీ ముఖ్యనేతతో మాట్లాడుతున్నాం… కాంగ్రెస్‌లో చేరిన మనవాళ్లను అనర్హులిగా ప్రకటింపజేస్తాం… ఇంకేముంది..? రేవంత్ ఖేల్ ఖతం, దుకాణ్ బంద్…’’ అని చెబుతూ… రేవంత్ అంటే పడని భట్టి విక్రమార్క, ఉత్తమకుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి తదితరులు రేవంత్‌పై చేస్తున్న వ్యాఖ్యల ఆడియోలు కూడా వినిపించి, నన్ను నమ్మండి అని నమ్మబలికాడట…
Ads
ఒకటి మాత్రం నిజం… కాంగ్రెస్‌లో అందరికీ సీఎం కావాలనే ఆశలుంటయ్… ప్రయత్నాలూ ఉంటయ్… ఉత్తముడు, కోమటిరెడ్డి, విక్రమార్కుడే కాదు పొంగులేటి కూడా వీలైతే రేవంత్ వ్యతిరేక చక్రం తిప్పే ప్రయత్నం చేయవచ్చు కూడా… కాంగ్రెస్‌లో ఈ రాజకీయాలు కొత్తేమీ కాదు, అవన్నీ తట్టుకుంటేనే ఏ లీడరైనా నిలబడతాడు… లేదంటే దిగిపోతాడు… కానీ కేసీయార్ కథే కాస్త ఆసక్తికరం…
తెలంగాణలో కాంగ్రెస్ బలపడకుండా చూడటానికి, ఢిల్లీ లెక్కలు- సమీకరణాల కోణంలో ఒకప్పుడు బీజేపీ కేసీయార్‌ను ఎంటర్‌టెయిన్ చేసి ఉండవచ్చుగాక… కానీ తరువాత ఎక్కడ బెడిసికొట్టిందో గానీ కేసీయార్ అంటే ఏమిటో అర్థమైంది బీజేపీ హైకమాండ్‌కు… కేసీయార్ నానా తిట్లూ తిట్టాడు మోడీని… బీజేపీ ముఖ్యనేతల అరెస్టుకూ ప్రయత్నించాడు, కేసులు పెట్టాడు, గాయిగాయి చేశాడు, ఏదో ఓ షో క్రియేట్ చేసి, ఆ వీడియోలు ఇవీ అంటూ దేశమంతా పంచిపెట్టాడు, బీజేపీ కళ్లు తెరుచుకుంది, కవిత లోపలకు వెళ్లిపోయింది… ఇప్పట్లో రాదు… అదీ రియాలిటీ…
బీఆర్ఎస్ ఎంత ఖాళీ అయితే తను ఎదగడానికి అంత చాన్స్ ఉంటుందనే పొలిటికల్ థియరీ ఒకటి బీజేపీకి అర్థమైంది… కేసీయార్ ఏమాత్రం నమ్మబుల్ కేరక్టర్ కాదని మరోసారి తేల్చుకుంది… కాంగ్రెస్ నుంచి ఎవరో షిండేను పైకి లేపి, కేసీయార్‌ను మళ్లీ గద్దె మీద కూర్చోబెట్టి మళ్లీ చేతులు, మూతులు కాల్చుకునే తిక్క సాహసం బీజేపీ ఇకపై చేయదు… ఇదీ సగటు రాజకీయ విశ్లేషకుల అంచనా…
ఐనాసరే, ఏదో జరగబోతోంది అని ఎందుకు చెబుతున్నట్టు..? ఏమీ లేదు… ఎవరూ పార్టీని విడిచిపెట్టి పోకుండా ఓ ప్రచారం… కానీ ఎమ్మెల్యేలు ఏమైనా సెకండ్ క్లాస్ పిల్లలా..? వాళ్లకు తెలియదా కేసీయార్ చెప్పే అబద్ధాలు, అతిశయోక్తులు… తెలంగాణ సమాజం కూడా నమ్మినన్ని రోజులు నమ్మింది, నిజం అర్థమైంది, తన భాషలోనే చెప్పాలంటే మొన్నటి ఎన్నికల్లో చీరి చింతకు కట్టింది… బీఆర్ఎస్‌లోనే ఉంటే రాబోయే రోజుల్లో ఏ ఫాయిదా లేదని ఎమ్మెల్యేలకూ అర్థమయ్యాకే తనకు గుడ్‌బై చెబుతున్నారు…
నిజంగానే రేప్పొద్దున… కాంగ్రెస్ పార్టీలో అంతఃకలహాలు పెచ్చుమీరి… రేవంత్‌ను దించాల్సిందే అనే ప్రయత్నాలు బలపడితే.., సక్సెసయ్యే పరిస్థితే వస్తే… బీజేపీ రంగంలోకి గనుక దిగితే… రేవంత్, హరీష్‌రావులను నమ్ముతుంది తప్ప కేసీయార్‌ను కాదు… రేవంత్, హరీష్‌లను నమ్మి ఏం చేస్తుంది..? అదీ సీక్రెటే… కేసీయార్‌కే తెలుసా రాజకీయాలు..? తెలంగాణ పక్కనే కదా మహారాష్ట్ర ఉన్నది… అర్థమైంది కదా..!
అబ్బే, అదేమీ లేదు, కేసీయార్‌కన్నా మోడీని బూతులు తిట్టిన చంద్రబాబును మళ్లీ కౌగిలించుకోలేదా..? కేసీయార్‌ను కూడా హత్తుకుని నెత్తికి ఎక్కించుకుంటారు అంటారా..? అది వేరు… ఏపీలో జగన్ ఇక పనికిరాడు, ప్రజాక్షేత్రంలో వట్టిపోయాడు అని తెలిశాకే, చంద్రబాబును తమ క్యాంపులోకి రానిచ్చారు… అది ఢిల్లీలో గద్దె కాపాాడుకోవడానికీ పనికొస్తోంది ఇప్పుడు… కానీ తెలంగాణలో..? సొంతంగా ఎదగాలని కదా బీజేపీ ప్లాన్… ఆ సమీకరణంలో మళ్లీ బీఆర్ఎస్‌కు ఎందుకు ఊపిరి పోస్తుంది..!!
Share this Article