కేసీయార్ తన ఫామ్ హౌజులో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలతో భేటీలు వేస్తున్నాడు… అరె, భయ్, జెర పార్టీని విడిచిపెట్టి పోకున్రి భయ్… మళ్లీ మనమే అధికారంలోకి వస్తం, మనం మళ్లీ ఉజ్వలంగా వెలిగిపోతం, మీ తోడు, నన్ను నమ్మున్రి అని చెబుతున్నాడు… సరే, కష్టకాలంలో పార్టీని, కేడర్‌ను కాపాడుకోవడానికి తప్పదు, తప్పులేదు…
ఐతే… రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని ఇంకా తొక్కేకొద్దీ… ఏమవుతుంది..? బీఆర్ఎస్ నిజంగానే బలహీనపడుతుంది… దానికి ప్రధాన బలమైన తెలంగాణ సెంటిమెంట్ ఇప్పుడు దానికి పనికిరాదు… పైగా పాలన వైఫల్యాలు పదే పదే వెక్కిరిస్తూ ఉంటాయి, బాస్ విపరీతమైన అహం పార్టీని కాపాడటానికి ప్రధాన అడ్డంకిగా మారుతుంది…
నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు… ఎమ్మెల్యేల ఫిరాయింపుల్ని ఏవేవో నీతిసూత్రాలతో బీఆర్ఎస్ ఖండిస్తున్నా, ఆ మాటలకు విలువ లేదు… కేసీయార్ చేర్చుకున్న స్థాయిలో ఏ రాష్ట్రంలోనూ ఎవరూ ప్రతిపక్ష పార్టీల నుంచి చేర్చుకోలేదేమో… ఇప్పుడు నీచం, దారుణం అనే మాటలను ఏం ప్రయోగించినా సరే, అవి ముందుగా తగిలేది తనకే…
Ads
అయితే బీఆర్ఎస్ బలహీనపడేకొద్దీ బీజేపీ ఎంతోకొంత బలపడుతుందీ అని రాజకీయ విశ్లేషకుల అంచనా… తెలంగాణ బీజేపీలో ఎన్ని వేర్వేరు కుంపట్లు రగులుతున్నా సరే… ఆ పార్టీ ఇప్పటికే బలపడింది, లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దీటుగా సీట్లు కొట్టింది… సరే, కేసీయార్ ఊహించినట్టే జీరో… ఇంకా నష్టాలు తప్పవు… కొన్ని కర్మలు అనుభవించాల్సిందే…
ఇలాగే బీఆర్ఎస్‌ను తొక్కేకొద్దీ రేవంత్ బలపడతాడు, కాంగ్రెస్ పాత వైభవాన్ని పొందుతుంది, కానీ తన ప్రత్యర్థిగా బీజేపీ ఉండబోతోంది… ఇక్కడ చెప్పుకోవాల్సింది మరొకటి ఉంది… నిన్న కేసీయార్ కొందరు ఎమ్మెల్యేలు, నాయకులతో భేటీ వేశాడు… మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, లక్ష్మారెడ్డి, సుధీర్‌రెడ్డి… వీళ్లంతా బీఆర్ఎస్‌కు మొండిచేయి చూపించేసి, కాంగ్రెస్ వైపు జంపుతారనే ప్రచారం ఉన్నవాళ్లే…
వీళ్లకుతోడుగా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారు ఆ భేటీలో… కాంగ్రెస్ అనగానే రెడ్ల ప్రభుత్వం, రెడ్ల పార్టీ, వీళ్లంతా ఇక వెళ్లిపోతారని కేసీయార్ ఫిక్సయిపోయి, చివరి ప్రయత్నంగా సంప్రదింపుల కోసం పిలిచాడా..? మస్తు సీక్రెట్స్ మాట్లాడుకున్నాం అంటున్నాడు మల్లారెడ్డి… ఏమిటా సీక్రెట్స్..?
ఇదంతా చదువుతుంటే పాత సంగతి ఒకటి గుర్తొచ్చింది… ఇదే కేసీయార్ ప్రోద్బలంతో వీ6 చానెల్‌లో ఓ డిబేట్ ప్రసారం జరిగింది… (అప్పట్లో వీ6 వేరు, ఇప్పుడంటే కాంగ్రెస్ చానెల్)… ఆ డిబేట్‌లో పాల్గొన్న మేధోసంపన్నులు అసలు రెడ్ల జనాభా ఎంత..? వాళ్ల ప్రాతినిధ్యం ఎంత..? మరీ ఇంత పెత్తనాలు అవసరమా…? అని సీరియస్ డిస్కషన్… అక్కడికి వెలమల జనాభా రెడ్లకన్నా ఎక్కువ ఉన్నట్టు..!! సరే, స్పాన్సర్డ్ డిబేట్ కాబట్టి, ఆ మేధో సంపన్నులు ఆ కోణంలోనే ‘లైన్ దాటకుండా’ చర్చించారు…
ఇప్పుడు అదే కేసీయార్ రెడ్లను పార్టీని వీడిపోకండర్రా, అందరమూ నష్టపోతాం అని దాదాపు బతిమిలాడుకునే స్టేజ్ కనిపిస్తోంది… కాలమహిమ కేసీయార్… దీన్నే డెస్టినీ అంటారు… సరే, రేప్పొద్దున మళ్లీ నీ పార్టీ ఝుమ్మని ఎదగవచ్చు, రాజకీయాల్లో ఏదైనా సహజం… కానీ ఒకసారి ‘ఓవరాక్షన్’ చేశాక, దాన్ని సమర్థించుకోవడం, ఆ నష్టాల్ని పూడ్చుకోవడం ఎంత కష్టమో గమనించావా..?! ఐనా, మన వెలమరత్న ఎర్రబెల్లి కూడా బీఆర్ఎస్‌లో ఉండే విషయంలో డైలమాలో పడ్డాడు అంటే, రెడ్లు అలా ఆలోచించడంలో తప్పేముంది..?!
Share this Article