దేశంలో లెక్కకుమిక్కిలి మఠాలు… ఎవరు ఏ సంప్రదాయమో, ఏ పరంపరో ఓ పట్టాన అర్థం కాదు… అసలు ధర్మప్రచారంలో గానీ, ఆధ్యాత్మిక వ్యాప్తిలో గానీ, మతోద్ధరణ కృషిలో గానీ నయాపైసా శ్రమ, ప్రయాస కనిపించవు… పైగా అడ్డమైన రాజకీయాల బురద పూసుకోవడానికి మఠాధిపతులు ఎప్పుడూ రెడీగా ఉంటారు…
అప్పట్లో అయోధ్య మీద రాద్ధాంతం చేశారు నలుగురు శంకరాచార్యులు… ఆ పేరు పలకడానికే చాలామంది ఇష్టపడటం లేదు… అయోధ్య పునర్నిర్మాణానికి, ఆ పోరాటానికి నయాపైసా భాగస్వామ్యం లేదు వాళ్లకు… హిందూ మతాభిలాషుల ఆకాంక్షలకు సపోర్ట్ లేదు… తీరా నిర్మాణం పూర్తయ్యాక కాళ్లల్లో కట్టెలు పెట్టి, నిందించే దుర్గుణం…
అసలు వీళ్లు ఆయా మఠాలకు అధిపతులేమిటో…? వీళ్ల లక్ష్యం ఏమిటో..? మోడీ అంటే ద్వేషం, బీజేపీ పోకడల మీద వ్యతిరేకత అనేది తప్పు కాదు… కానీ పీఠాధిపతుల మార్గం వేరు, లక్ష్యం వేరు… వాటిల్లో పరిణతి లేదు, పాండిత్యం లేదు, జనాన్ని కన్విన్స్ చేసి ధర్మం వైపు అడుగులు వేయించే పరిజ్ఞానం లేదు… అందరూ విశాఖ శారదాపీఠం బాపతే అన్నట్టుగా ఉంది…
Ads
జ్యోతిర్‌మఠ్ అని ఓ పీఠం,… చాలా పీఠాల్లో ఒకటి… దానికి ఓ అధిపతి… హఠాత్తుగా తెర మీదకు వచ్చి కేదారనాథ్‌లో 228 కోట్ల బంగారం మిస్సింగ్, ఢిల్లీలో కేదారనాథ్‌ను పోలిన గుడి కట్టడం కరెక్టు కాదు అంటాడు… అరె, గుడి కడితే ప్రోత్సహించాలి గానీ మోకాలడ్డు పెడతాడు అనడం ఏమిటి…? అంతేకాదు…
ఉద్ధవ్ ఠాక్రే నిజమైన సనాతనవాది, వాడు వంచన బాధితుడు, మళ్లీ సీఎం కావాలి అంటాడు… వాళ్లింటి వెళ్తాడు, కాళ్లు మొక్కించుకుంటాడు, ఠాక్రేకు జరిగిన అవమానం తనకు చాలా బాధ కలిగించింది అంటాడు… పోనీ, తమరికి చేతనైతే మోడీకి ఆ ఉసురు తగిలేలా ఓ పెద్ద హోమం చేయలేకపోయావా..? ఆ విశాఖ జగన్ స్వరూపుడికి తాతలాగే ఉన్నాడు…
నిజానికి తను ముంబైకి వచ్చింది అంబానీ పెళ్లింటికి వచ్చి ఆశీస్సులు ఇవ్వడానికి… తను ఓ పేదవాడి ఇంటికి వెళ్తాడా, వెళ్లడు… ఆ విశాల సహృదయం ఉంటే పీఠాధిపతి ఎలా అవుతాడు..? మినిమం అంబానీ రేంజ్ అయితేనే తరలివస్తాడు… సంభావనలు ఆ రేంజులో ఉంటాయి కాబట్టి…
నీకెందుకయ్యా రాజకీయాలు..? మోడీ వ్యతిరేక భాషణలు చేసేందుకు, పోరాడేందుకు ఇండి కూటమి ఉంది… తప్పో ఒప్పో కప్పల తక్కెడ కూటమి ఉంది… వాళ్లు చూసుకుంటారు… ఏదో నోటికొచ్చింది వాగేయడం కాదు… ఎవడి పని వాడు చేయాలి..? నువ్వు కూర్చున్న పీఠం దీనికి కాదు… 228 కిలోల బంగారం ఎవరు దోచుకుపోయారు..? దేనికి..? గుడి కట్టడానికా..?
మరి కేదారనాథ్ పాలకవర్గం ఏం చేస్తోంది…? కిక్కుమనలేదేం..? అక్కడి ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి..? నువ్వు సపోర్ట్ చేస్తున్న ఇండి కూటమి అక్కడ కూడా ఉంది కదా…! పోనీ, నీ వీరశిష్యుడు ఉద్దవ్ ఠాక్రే ఆ ఆరోపణలు చేయొచ్చుగా… సుప్రీంకోర్టు దాకా వెళ్లొచ్చుగా అంత ధర్మనిరతి ఉంటే..? ఇవే, ఇవే… మఠాల మీద సగటు హిందువులో వ్యతిరేకత ప్రబలడానికి కారణం… వీళ్లు హిందూ ధర్మానికి చేసేదేమీ ఉండదు, నష్టం తప్ప… పైగా ఈ తలతిక్క వైఖరులు…
స్వామి వారి పేరు అవిముక్తేశ్వరానందులట… కేదారనాథ్‌లో కుంభకోణం చేసి, ఢిల్లీలో మరో జ్యోతిర్లింగం కడతారా అంటాడు… అది నోరే..? ఇలాంటి ఖచ్చితంగా ఇలాంటి మఠాధిపతులు హిందూ ధర్మ పరిరక్షణకు అవరోధకులు..!! మన తెలుగు రాష్ట్రాల్లోనూ చూశాం కదా… రాజకీయాలతో అంటకాగి భ్రష్టుపట్టిన మఠాధిపతుల్ని… ఈయన కూడా తక్కువేమీ కాదు… వీళ్లతో హిందూ సమాజానికి ఏమీ ఫాయిదా కూడా లేదు…
Share this Article