తరాలు మారేకొద్దీ పిల్లల్లో మేధోస్థాయి ఎక్కువగా కనిపిస్తోంది… ఐక్యూ లెవల్స్ కూడా చాలా ఎక్కువే… అదేసమయంలో శారీరక, మానసిక ఎదుగుదలకు సంబంధించిన సమస్యలూ ఎక్కువగా కనిపిస్తున్నాయి… కంట్రాస్ట్…
దైహిక ఎదుగుదల వేగంగా లేకపోవడం, త్వరగా లేచి నిలబడి నడవలేకపోవడం, త్వరగా మాటలు రాకపోవడం, మందబుద్ధుల్లా కనిపించడం… ఆటిజం, ఎగ్జిమా వంటి సమస్యలూ పెరుగుతున్నాయి… ఇప్పుడు ఒక్క పిల్ల లేదా పిల్లవాడిని ఈ సమస్యలన్నీ అధిగమించేలా పెంచడం పెద్ద టాస్క్…
ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… తెలుగు ఇండియన్ ఐడల్ షోలో ఈసారి ప్రముఖంగా మనల్ని ఫీలయ్యేలా చేసింది ఇదే… కేశవ్ రామ్… తను ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వాసి… ఈ షోకు సర్‌ప్రైజ్ ఫ్యాక్టర్ కోసం తన తల్లిదండ్రులను రప్పించారు… గుడ్, ఆ తల్లి చెబుతోంది… చిన్నప్పుడు ఆటిజం తన సమస్య… మాటలు సరిగ్గా వచ్చేవి కావు… వాళ్లకు అదే ఆందోళన…
Ads
ఇప్పుడదే పిల్లవాడు ఇండియన్ ఐడల్‌లో పాటలు బాగా పాడుతున్నాడు… జడ్జిల ప్రశంసలు పొందుతున్నాడు… తనే మాండొలిన్ వాయిస్తాడు… మంచి గాత్రం… స్పష్టమైన ఉచ్ఛారణ… అందుకే థమన్ అన్నాడు… ఆటిజం నుంచి ఆవ్‌సమ్… ఇప్పుడు ఆ పేరెంట్స్‌లో ఎంత ఆనందం..? ఒకప్పుడు మాటలే సరిగ్గా రాని పిల్లాడు గొంతెత్తి అలరించేలా పాడుతున్నాడూ అంటే… షోకు కొంత ఎమోషనల్ టచ్… గుడ్… సూపర్ సింగర్ షోలో (వేరే భాష) కూడా పార్టిసిపేట్ చేసినట్టున్నాడు తను గతంలో… (ప్రస్తుత కంటెస్టెంట్లలో దాదాపు అందరూ గతంలో ఏదో మ్యూజిక్ కంపిటీషన్ షోలలో పాల్గొన్నవాళ్లే…)
తను ఆల్రెడీ వివేక్ సాగర్‌కు ఓ సాంగ్ చేశాడు, థమన్-కార్తీక్ కూడా చాన్సులు ఇవ్వబోతున్నారు… అఫ్‌కోర్స్, సింగింగ్ ప్రొఫెషన్ పెద్ద రెమ్యునరేటివ్ కాదు ఇప్పుడు… తన ఇష్టం, అదే ప్యాషన్ అనుకుంటే ఆ బాటలో సాగిపోవడమే…
షోలో ప్రముఖంగా కనిపించేది థమన్ డామినేషన్… తను ఏదనుకుంటే అదే… ఎదుటోళ్ల నోళ్లు మూయిస్తాడు… పాట ఎంపిక అనే అంశం మీద గీతామాధురి నోరుమూయించాడు… దాదాపు దబాయింపు ధోరణితో…! నిజమే, గీత చెప్పినట్టు పాట ఎంపిక అనేది ప్రధానం ఇలాంటి పోటీల్లో… తన వాయిస్ టెక్స్‌చర్‌కు తగ్గట్టుగా, తన మెరిట్‌ను బలంగా ప్రదర్శించుకునే భిన్నమైన పాట అయితే పోటీలో నిలబడగలరు కంటెస్టెంట్లు… ఏదో సాదాసీదా పాట అలవోకగా పాడేసి వెళ్లిపోతే ఇక షోలో థ్రిల్ ఏముంది..? ఎలా రక్తికడుతుంది..?
సాయివల్లభ పాట ఎంపిక మరొకటి ఉంటే బాగుండేది అనేది గీతామాధురి అభిప్రాయం… దాన్నీ ఖండించి, వాదించి.., ఏ పాటయితేనేం, మిగతా వాళ్లు ఆ పాటల్ని ఎలా ఎంచుకున్నారు… పాట ఏదన్నది కాదు ముఖ్యం, ఎలా పాడారన్నదే ముఖ్యం అని ఓరకంగా వాగ్వాదానికి దిగాడు థమన్… కానీ సెలక్షన్ ఆఫ్ సాంగ్ ఆల్సో మ్యాటర్స్… డెఫినిట్‌గా…
గత ఇండియన్ ఐడల్ హిందీ షోలో… మన షణ్ముఖ ప్రియ ఎక్కువగా పాప్, ఫాస్ట్, యోడిలింగ్ తరహా పాటల్ని ఎంచుకుంటే… పవన్ దీప్ రాజన్, అరుణిత వంటి కంటెస్టెంట్లు క్లాసిక్, మెలొడీలను ఎంచుకునేవాళ్లు… నెటిజనం షణ్ముఖప్రియ మీద సాగించిన ట్రోలింగులో ఇదీ ఓ పాయింటే… ఎంచుకునే పాటల్లో వైవిధ్యాన్ని, వాటి ప్రదర్శనలో ప్రతిభను కనబరిచేవాళ్లే పోటీలో ముందుంటారు… గీతామాధురి చెప్పింది రైటే… థమన్ వాదనలో పాయింట్ లేనట్టనిపించింది…!
Share this Article