.
ఒక పార్టీ బలం తన సొంతమే కానక్కర్లేదు… ప్రత్యర్థి పార్టీ బ్లండర్స్ కూడా బలంగా మారవచ్చు… బీజేపీ, కాంగ్రెస్ ధోరణులు అవే…
ఒక రాహుల్, ఒక ఖర్గే వంటి నేతలు చాలు… బీజేపీ బలాన్ని సుస్థిరంగా ఉంచడానికి… రాహుల్ ఎలాగూ పార్టీకి పెద్ద లయబులిటీ… దీనికితోడు ఖర్గే కూడా పార్టీని పూర్తి స్థాయి హిందూ వ్యతిరేక పార్టీగా మార్చే పనిలో పడ్డట్టున్నాడు…
Ads
ఎలాగూ ఇండి కూటమి ఇచ్చుకుపోయింది… కాస్తో కూస్తో గత ఎన్నికల్లో ఆ కూటమి యాంటీ బీజేపీ వోటు చీలకుండా చూసుకుంది కాబట్టి కాసిన్ని మంచి ఫలితాలు వచ్చాయి… ఇప్పుడు మళ్లీ ప్రతిపక్ష పార్టీలు తమలో తామే తన్నుకునే సిట్యుయేషన్…
నిన్న ఓచోట ఖర్గే మాట్లాడుతూ ‘గంగలో మునిగితే దరిద్రం పోతుందా..?’ అన్నాడు… తను బీజేపీ నేతలను ఉద్దేశించి విమర్శించినా సరే, తన వ్యాఖ్యలు పూర్తిగా హిందువులకు వ్యతిరేకంగానే ఉన్నాయి, అలాగే జనంలోకి వెళ్లాయి…
జాతి మొత్తం ఒకవైపు… రాహుల్ టీమ్ మరోవైపు… అయోధ్య అయినా సరే, అది మహాకుంభమేళా అయినా సరే… ఇప్పటికి పది కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారు… మరో 30, 40 కోట్ల మంది హాజరవుతారు… అన్ని కోట్ల మంది విశ్వాసాల్ని వెక్కిరిస్తున్నాడు ఖర్గే…
పార్టీ పదే పదే హిందూ మత, ఆధ్యాత్మిక విశ్వాసాలకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తోంది… దీనికితోడు స్టాలిన్ నాస్తికుడు, తన కొడుకు సనాతన ధర్మాన్ని వైరస్ వ్యాధులతో పోల్చాడు… మమత మరీ దారుణం… ఆప్ కేజ్రీవాల్ దేశ వ్యతిరేక, హిందూ వ్యతిరేక ఖలిస్థానీ మద్దతుదారు… అఖిలేష్, తేజస్విల గురించి చెప్పనక్కర్లేదు…
సో, యాంటీ బీజేపీ పార్టీలన్నీ బీజేపీ వైపు హిందూ సంఘటనను నెట్టేస్తున్నాయి స్వయంగా… సరే, దరిద్రం పోతుందా అనే ప్రశ్న దగ్గరకు వద్దాం… స్వతంత్రం వచ్చాక ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెసే కదా… మరి దేశంలోని దరిద్రం ఎందుకు తగ్గలేదు..? ఎవరు బాధ్యులు..? ఐనా భక్తికీ, దరిద్రానికీ సంబంధం ఏమిటి..? కావాలని హిందూ మత విశ్వాసాల్ని వెటకారం చేస్తూ అపహాస్యం చేస్తూ అవమానిస్తూ చేసే వ్యాఖ్యలే కదా…
సరే, మరొక ప్రధానమైన విషయమూ చెప్పుకుందాం… పైన ఫోటోల మాటేమిటి మరి..? ఎన్నికలు రాగానే రాహుల్ మెడలో జంధ్యం ప్రత్యక్షం, తన గోత్రం చెబుతాడు, గుళ్లు తిరుగుతాడు… అది భక్తితోనా..? కాదు… తను ప్రాక్టీసింగ్ క్రిస్టియన్, ఎన్నికల్లో లబ్ధి కోసం, హిందూ వోట్ల కోసం ప్రయాసలు, ఎత్తుగడలు, హిందువుల చెవుల్లో పూలు…
ప్రియాంక కూడా అంతే కదా… ఆమె యూపీ ఎన్నికల ముందు గంగాస్నానాలు చేయలేదా..? బొట్టు, చేతికి రుద్రాక్షలు, స్నానాలు, పూజలు… ఏం ఖర్గే సాబ్… నీ భాషలోనే చెప్పాలంటే ఈ వేషాలతో దరిద్రం పోతుందా..?
బీజేపీ నేతలు తమ వ్యక్తిగత ఆధ్మాత్మిక విశ్వాసాలతో త్రివేణీ సంగమంలో మునుగుతారు, దాంతో కాంగ్రెస్‌కు వచ్చిన నొప్పి ఏమిటి..? ఇప్పుడు బీజేపీకి వచ్చే ఎన్నికల ఫాయిదా ఏమిటి…?
ఈ ప్రశ్నలు బీజేపీ ఏదో గొప్పగా ఉద్దరిస్తుందని చెప్పడం కోసం కాదు, మీకు ద్వంద్వ ప్రమాణాలు దేనికి అని..! బీజేపీకి వేసిన ప్రశ్నను రాహుల్, ప్రియాంకలకు కూడా వేయగలవా అని అడగడానికి..! మేం హిందూ మతానికి వ్యతిరేకం అని స్పష్టంగా, మరింత గట్టిగా, ఓ సిద్ధాంతంగా చెప్పొచ్చు కదా, అందరికీ క్లారిటీ వస్తుంది..!!
.
చివరాఖరిగా… శామ్ పిట్రోడా అని ఓ ఎడ్డి మొహం కనిపిస్తుంటుంది కాంగ్రెస్ అంతర్జాతీయ విభాగం హెడ్ అట… తరచూ పిచ్చి వ్యాఖ్యలతో చిరాకెత్తిస్తుంటాడు కదా… మళ్లీ తాజాగా ఏవేవో కూశాడు… ఒకవైపు అక్రమ వలసదారుల్ని మిలిటరీ విమానాల్లో ఆయా దేశాలకు పంపిస్తున్నాడు కదా ట్రంపు… అక్కడే బతికే పిట్రోడా మాత్రం ఇండియాలోకి అక్రమంగా వచ్చే వలసదారుల్ని మాత్రం ఇండియా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవద్దట…
ఏదో కాస్త ఇబ్బంది ఉంటుంది, పర్లేదు, అందరినీ అడ్జస్ట్ చేసుకోవాలి మనం అంటున్నాడు… అంటే రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు లక్షల్లో వస్తున్నా అందరికీ వెంటనే రేషన్ కార్డులు, ఓటరు కార్డులు ఇచ్చి, పక్కా ఇళ్లు మంజూరు చేయాలా పిట్రోడా… అది చాలా..?
Share this Article