.
నిన్న మెస్సి ప్రోగ్రామ్ ద్వారా సేకరించిన డబ్బులో…
👉 ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఖర్చులు పోగా
Ads
👉 కనీసం ₹10 లక్షలు అయినా
▪️ సిక్ విలేజ్ మైదానం
▪️ జింఖానా మైదానం
▪️ తిరుమలగిరిలోని రెండు ఫుట్‌బాల్ గ్రౌండ్లు
ఇలాంటి మైదానాల అభివృద్ధికి ఖర్చు చేస్తే ఆ ఈవెంట్‌కు నిజమైన అర్థం వస్తుంది…
🕰️ హైదరాబాద్ & ఫుట్‌బాల్ – కోల్పోయిన వారసత్వం
1990లు–2000లలో
👉 హైదరాబాద్‌లో ఫుట్‌బాల్‌కు మంచి క్రేజ్.
👉 చిన్న చిన్న టీమ్‌లు, లోకల్ టోర్నమెంట్లు సాధారణం.
తర్వాత
▪️ క్రికెట్ ప్రభావం
▪️ మౌలిక వసతుల లోపం
▪️ ప్రభుత్వ ప్రోత్సాహం తగ్గడం
👉 ఫుట్‌బాల్ వెనుకబడింది.
కానీ ⚔️ ఆర్మీ కంటోన్మెంట్ మైదానాల్లో ఇప్పటికీ ఫుట్‌బాల్, హాకీ కొనసాగుతూనే ఉన్నాయి. ఆటపై ఆసక్తి లేక కాదు… వ్యవస్థ లేదు. ప్రోత్సాహం లేదు.
🏛️ GHMC & రాష్ట్రం – స్పోర్ట్స్ విజన్ లోపం ▪️ స్పోర్ట్స్ బడ్జెట్ ఉందో లేదో స్పష్టత లేదు
▪️ దీర్ఘకాలిక స్పోర్ట్స్ పాలసీ కనిపించదు
ఒక ఈవెంట్‌తో కాదు నిరంతర క్రీడా విధానంతోనే మార్పు వస్తుంది.
🏟️ గచ్చిబౌలి మైదానం.
ఎప్పుడో 5, 6 ఏళ్ల క్రితం ఏదో గొప్పగా చెప్పారు ఈ గచ్చిబౌలి మైదానం లో కోచ్‌లు, క్రీడాకారుల కోసం రూములు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేస్తాము అని
❌ కానీ అమలు లేదు.
ఈరోజు గచ్చిబౌలి మైదానం సంగీత కచేరీలు, ఔట్‌డోర్ ఈవెంట్స్ లకు మాత్రమే పరిమితం అయ్యింది. అప్పుడపుడు ఏదో క్రీడలు.
ఒక స్పోర్ట్స్ క్యాలెండర్ పెట్టి దీన్ని పూర్తి స్థాయి లో క్రీడా వినియోగం చేయొచ్చు.
Khelo India – దేశవ్యాప్తంగా జరిగిన మార్పు
Khelo India అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ క్రీడాభివృద్ధి కార్యక్రమం.
దీని లక్ష్యం👇
⚽ చిన్న వయసు నుంచే క్రీడాకారులను గుర్తించడం
🏟️ దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక వసతులు (స్టేడియంలు, ఇండోర్ హాల్స్) నిర్మించడం
🏋️ శిక్షణ, కోచింగ్, పోషణ అందించడం
🥇 అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ తెచ్చే అథ్లెట్లను తయారు చేయడం.
Khelo India కేవలం ఈవెంట్లు కాదు —
👉 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ + టాలెంట్ + ట్రైనింగ్…
డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి..? కేంద్ర ప్రభుత్వం నుంచే…. కానీ రావాలంటే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్లాన్, ప్రతిపాదన, ఆసక్తి ఉండాలి. ఫలానా చోట కట్టుకుంటాము, ఫలానా చోట్ల ఫలానాది అభివృద్ధి చేసుకుంటాం అంటే డబ్బులి స్తారు.
🏟️ ఇలా పెరిగిన స్టేడియంలు & మౌలిక వసతులు కొన్ని ఉదాహరణలు
▪️ అరుణాచల్ ప్రదేశ్ : 30+ చిన్న ఇండోర్ స్టేడియంలు (బ్లాక్/డిస్ట్రిక్ట్ లెవల్) కట్టుకున్నారు
▪️ మణిపూర్ లో ఇండోర్ హాల్స్, రెజ్లింగ్ & బాక్సింగ్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పడ్డాయి
▪️ త్రిపురలో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియంలు, బ్యాడ్మింటన్ కోర్టులు కట్టుకున్నారు.
▪️ ఛత్తీస్‌గఢ్ లో సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్‌లు, ఫుట్‌బాల్ గ్రౌండ్లు వచ్చాయి.
🏋️ అకాడమీస్ & ట్రైనింగ్ సెంటర్లు కొన్ని ఉదాహరణలు
▪️ హర్యానా లో రెజ్లింగ్, అథ్లెటిక్స్ అకాడమీస్ వచ్చాయి. ఒలింపిక్ లో వివిధ క్రీడల్లో భారత్ తరుపున మెడలిస్టుల బేస్ ఇదే
▪️ ఒడిశా
👉 హాకీ హై-పర్ఫార్మెన్స్ సెంటర్లు
👉 జూనియర్ నుంచి నేషనల్ టీమ్ వరకు పైప్‌లైన్
▪️ మధ్యప్రదేశ్ లో షాట్‌పుట్, జావెలిన్, ఆర్చరీ అకాడమీస్
🧒 గ్రాస్‌రూట్ డెవలప్‌మెంట్
▪️ Khelo India Centres (KICs)
👉 గ్రామాలు, చిన్న పట్టణాల్లో టాలెంట్ ఐడెంటిఫికేషన్
▪️ అథ్లెట్లకు
👉 నెలకు స్కాలర్‌షిప్
👉 కోచింగ్
👉 ఎక్విప్‌మెంట్
👉 న్యూట్రిషన్ సపోర్ట్
సిటీ-లెవల్ కొన్ని ఉదాహరణలు
▪️ పాటియాలా (పంజాబ్) లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ + సపోర్టింగ్ కాంప్లెక్స్
▪️ అహ్మదాబాద్ (గుజరాత్) లో డిస్ట్రిక్ట్ & సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నెట్‌వర్క్
▪️ భువనేశ్వర్ (ఒడిశా) లో మల్టీ- స్పోర్ట్స్ క్యాపిటల్ మోడల్
❓ తెలంగాణలో ఎందుకు కాదు?
▪️ హైదరాబాద్ లాంటి నగరం ఉంది, చుట్టూ చిన్న చిన్న నగరాలున్నాయి.
▪️ యువత ఉంది
▪️ కేంద్ర నిధులు ఉన్నాయి
❌ కానీ
▪️ స్పష్టమైన ప్రతిపాదనలు లేవు
▪️ GHMC & రాష్ట్రం నుంచి ముందుచూపు లేదు
👉 ఆదిలాబాద్
👉 నిజామాబాద్
👉 వరంగల్
👉 కరీంనగర్
ఇలా ఇక్కడ
👉 ఇండోర్ స్టేడియంలు
👉 ఫుట్‌బాల్ / అథ్లెటిక్స్ అకాడమీస్
👉 జిల్లా స్పోర్ట్స్ కాంప్లెక్సులు
అన్నీ సాధ్యం — డబ్బులు కేంద్రం ఇస్తుంది. కానీ ప్రతిపాదనలు రాష్ట్రం నుండి వెళ్లాలి. కేంద్రం వచ్చి ఫలానా చోట పెట్టు అని చెప్పదు. లోకల్ mla లు, లోకల్ MP లు, క్రీడా సంస్థల ద్వారా రాష్ట్రం నుండి ప్రతిపాదనలు వెళ్ళాలి. పంపారా? ఎన్ని పంపారు? ఎన్ని తెచ్చుకున్నారు? పదే పదే కేంద్రాన్ని విమర్శించటం కాదు, రాష్ట్రం నుండి ఎన్ని ప్రతిపాదనలు వెళ్ళాయి? అమ్మ కూడా అడగనిదే అన్నం పెట్టదు. మన ఆకలి మనకు తెలియాలి
😤 మెస్సి వచ్చాడు– వెళ్లాడు అన్నదే విషయం కాదు. అతని పేరుతో వచ్చిన క్రేజును, ప్రచారాన్ని , అవకాశాన్ని మనం క్రీడల భవిష్యత్తుకు ఎలా మార్చుకోగలం అన్నదే అసలు ప్రశ్న…. — ఉపద్రష్ట పార్ధసారధి
#PardhaTalks #KheloIndia #IndianSports #SportsInfrastructure #HyderabadFootball #GrassrootSports #GHMC #Gachibowli
Share this Article