Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రేక్షకుడు కో‘బలి’… మతిలేని హింస… మాటకు ముందూవెనకా బూతు…!!

February 6, 2025 by M S R

.

Ashok Pothraj  ……. “కోబలి” (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ తెలుగు)

ఈ టైటిల్ గతంలో అంటే 2017లో త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓకే చేసి పోస్టర్ రిలీజ్ చేసారు. అప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ అయింది. తర్వాత ఎందుకో ఆ సినిమా ఆగిపోయింది. ఇక్కడ ఒక విశేషమైన విషయం చెబుతాను.

Ads

23/24 ఆంధ్రా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ తెగ సూటిపోటి మాటలతో రాజకీయంగా ఎక్కువగా ప్రసంగాలు చేసిన యాంకర్ శ్యామల గారే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పోషించారు. విధి విచిత్రంగా ఆయనకు ఖరారైన సినిమా టైటిల్ తోనే తాను హీరోయిన్ గా చేయడం మ్యాజిక్ అన్నమాట.

ఓటీటీ స్పేస్ ను కేవలం రక్తపాతం, బండ బూతులు మరియు విపరీత ధోరణి శృంగారానికి కేరాఫ్ అడ్రస్ గా చూస్తుంటారు కొందరు. అయితే రొమాంటిక్ సన్నివేశాలు, బూతుల కోసం జనాలు ఓటీటీ సిరీస్ లు లేదా సినిమాలు చూడడం లేదనే విషయాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. లేకపోతే “కోబలి” లాంటి సిరీస్ లు వచ్చినట్లు కూడా తెలియకుండా పోతాయి.

ఒక కుటుంబం మీద మరొక కుటుంబ సభ్యుల దాడి పైశాచికంగా ఉంటుంది. సాగదీత అనేకం ఉంది.
8 ఎపిసోడ్స్ స్కిప్ చేస్తూనే ఉండాలి. రాయలసీమ యాస, తెలంగాణ యాస కలిసిన మిక్స్డ్ మిక్చర్ పొట్లం.
ఏ యాస ఎవరు అలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాదు. నాకైతే అప్పట్లో ఈటీవిలో నేరాలుఘోరాలు అనే ప్రోగ్రామ్ లో జరిగిన సన్నివేశాలను సీన్ re construction ని జూనియర్ నటులతో చేపించి చూపేవారు కదా..?
అలా ఉంది సేమ్ టు సేమ్ ఈ సీరీస్. ఇదీ దర్శకుడి లోపం.

అదృష్టం కొద్దీ.. ఈ సిరీస్ లో అసభ్యక్రమైన శృంగార సన్నివేశాలు లేవు కానీ..! బోలెడన్ని బూతులు, తలలు నరు@క్కోవడాలు, పీ*కలు కోయడాలు గట్టిగా ఉండడంతో ఈ సిరీస్ ను ఫ్యామిలీతో ఇంట్లో చూడలేరు, ఇకపోతే.. ఆసక్తికరమైన అంశాలేవీ లేకపోవడంతో రెగ్యులర్ వ్యూయర్స్ కు ఈ సిరీస్ ఫినిష్ చేయబుద్ధి కాదు.

మరి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ వరుసగా ఇలాంటి కంటెంట్ లేని సిరీస్ లతో తమ బడ్జెట్ ను ఎందుకు వృధా చేసుకుంటుందో ఏమో వాళ్లకే తెలియాలి. కొన్ని సంవత్సరాల పాటు కృష్ణానగర్ వీధుల్లో తిరుగుతూ ఇంకా తమకు అవకాశం వస్తుందని మంచి మంచి సబ్జక్టులతో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ఎంతో మంది యువకులు వారి గోడు ఇలాంటి వారికి కనిపించలేదేమో..?

ఈ డైరెక్టర్స్ తమకు వచ్చిన ఓటిటీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి సినిమాలు సమాజానికి ఉపయోగపడేవి కాదు. కాబట్టే ప్రస్తుత ట్రెండ్ సబ్జెక్టు ఆలోచించి సెలక్షన్ చేసుకోవలసి ఉంది. ముఖ్యంగా మా తెలంగాణ యాసను ఇట్లాంటి కంటెంట్లకు వాడకండీ. మరీ దుర్మార్గమైన పదాలను వాడారు.

నా యాస ఇప్పుడిప్పుడే సినిమాలలో పసిగుడ్డులాగా పురుడుపోసుకుంటోంది. దయచేసి దాన్ని సక్కగ పలకండి. దర్శకనిర్మాతలు ఏ ప్రాంతం వారైనా సరే తెలంగాణ భాషను సరిగ్గా వాడుకోండ్రి. ఇదేమీ నార్త్ కాదు.

మీర్జాపూర్, రానానాయుడు లాంటి కంటెంటూ లేదూ… అవీ బూతులతోనే హిట్ అయ్యాయోమో అనుకున్నారా కాదు కథలో దమ్ముంది. ఇలా అస్తమానం ఎవన్నైనా ఏసేయాలా అనీ కత్తి తీయడం. మాటకు ముందో బూతు వెనకో బూతు. అబ్బే నచ్చలేదు. నా రేటింగ్ 1.5/5… #Kobali #DisneyPlusHotstar

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రమ్యకృష్ణ నిజమే చెప్పింది…. మళ్లీ లైంగిక దోపిడీ వార్తల్లోకి వచ్చింది…
  • ఆ అద్భుత ఆధ్యాత్మిక యాత్ర మళ్లీ ఆరంభం అవుతోంది..!
  • తెలియదు… నంబాల మరణంతో నా మనస్సు ఎందుకు చివుక్కుమంది..!
  • డ్రాగన్ రాజు కావచ్చు…. కానీ జామపండు రారాజు… ఆరోగ్య చక్రవర్తి…
  • వై నాట్..? జూనియర్ ఎన్టీఆర్ భిన్న పాత్రల్ని ఎందుకు చేయకూడదు…?!
  • ‘ఇంకేదో కావాలనే’ మోజు, ఆకర్షణల ముందు పాతివ్రత్యాలు బలాదూర్…
  • ఒక తమిళ కణ్ణదాసన్…. ఒక తెలుగు వేటూరి… వేరే పోల్చలేను సారీ…
  • ఇడ్లీ నూడుల్స్ కాదు… అసలు ఇడ్లీ రకమే కాదు…. పక్కా ఇడియప్పం…
  • ఎక్కడిదో ఈ దుఃఖ మేఘం, ఆగకుండా వెక్కి వెక్కి కురుస్తోంది… కానీ..?
  • పెద్ద కోళ్లఫారాలు… వాటి కింద ఓ భారీ సొరంగం… ఇంకా లోపలికెళ్తే…?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions