కోదండరాంను రేవంత్ కావాలనే బకరా చేశాడనే పిచ్చి విమర్శ ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది… తప్పు… హైకోర్టులో ఉన్న కేసు తీర్పు ఎలా వస్తుందో రేవంత్ ప్రభుత్వ ముఖ్యులకు ఆల్రెడీ ఓ ఐడియా ఉంది… గవర్నర్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే ఆమె కేబినెట్ నిర్ణయాలను తప్పకుండా ఆమోదిస్తుందనే నమ్మకం, అనుభవమూ ఉన్నాయి…
సో, కోదండరాంతోపాటు జర్నలిస్టు అమెర్ అలీ ఖాన్‌లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలనే నిర్ణయం తీసుకుని గవర్నర్‌కు పంపించింది ప్రభుత్వం… ఆమె వెంటనే ఆమోదముద్ర వేసింది… కానీ హైకోర్టు తీర్పు వచ్చింది ఇప్పుడే… స్థూలంగా చూస్తే హైకోర్టు తీర్పు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిన దాసోజు శ్రవన్, కుర్ర సత్యనారాయణలకు అనుకూలంగా వచ్చినట్టే… కానీ వాళ్లకు అల్టిమేట్‌గా దక్కేదేమీ ఉండకపోవచ్చు… ఎందుకంటే..?
హైకోర్టు ఏమన్నది..? వాళ్ల అర్హతలకు సంబంధించిన వివరాలు కావాలంటే కేబినెట్ నుంచి తెప్పించుకుని, వారి నియామకం అంశాన్ని పునఃపరిశీలించాలని చెప్పింది… అది జరగాలి కాబట్టి కోదండరాం, అమెద్ అలీఖాన్‌ల నియామకం జీవోను కొట్టేసింది… కానీ హైకోర్టు గవర్నర్ విచక్షణాధికార పరిధిలోకి ఎంటర్ కాలేదు… సో, ఇప్పుడు ఏం జరుగుతుంది..?
Ads
ఒక ప్రొసీజర్ మళ్లీ స్టార్టవుతుంది… ఆమె కేబినెట్ నుంచి వివరాలు అడుగుతుంది… ఆ పాత కేబినెట్ ఎలాగూ మారిపోయింది కాబట్టి, కోదండరాం, అమెర్ అలీఖాన్ నియామకాన్ని ఈ ప్రభుత్వమే నిర్ణయించింది కాబట్టి వాళ్ల వివరాలు గవర్నర్‌కు పంపిస్తుంది… (పాత కేబినెట్ ఉన్నప్పుడే ఈ తీర్పు వచ్చి ఉంటే కథ వేరే ఉండేది…) గవర్నర్ ఈ ప్రభుత్వం తన పట్ల కనబరిచే వ్యవహారశైలి పట్ల సంతృప్తిగానే ఉంది గనుక కోదండరాం, అమెర్ అలీ ఖాన్ నియామకం మీద ఆమోదముద్ర పడుతుంది…
ఎస్, హైకోర్టు చెప్పినట్టు గవర్నర్ ఆయా ఎమ్మెల్సీ అభ్యర్థుల అర్హతలపై గనుక సందేహాలుంటే కేబినెట్ అభిప్రాయాలు తెప్పించుకోవాలి… ఇప్పుడు జరగబోయేదీ అదే… నిజానికి గవర్నర్ కోటాలో నియామకం అంటే వివిధ రంగాల్లో సర్వీస్ చేస్తున్నవారై ఉండాలి గానీ, పొలిటిషియన్స్ నిషిద్ధమని ఏమీ లేదు… సాధారణంగా ఇలాంటివి ప్రభుత్వం రాజకీయంగానే నిర్ణయం తీసుకుని ఫైల్ గవర్నర్‌కు పంపిస్తుంది… గవర్నర్ కూడా వోకే అనేస్తారు… కానీ ఇక్కడ సిట్యుయేషన్ వేరు…
గవర్నర్ అంతకుముందే ఒకరి నియామకాన్ని ఆపేసింది… (కౌశిక్ రెడ్డి..?) ఆమెను బీఆర్ఎస్ ప్రభుత్వం నానారకాలుగా అవమానించింది… ఆ కోపం సహజంగానే ఆమెలో ఉంది… పైగా ఈ ఎమ్మెల్సీలు గవర్నర్ కోటా… అందుకని ఆమె తన విచక్షణాధికారాన్ని ప్రయోగించి ఆపేసింది… ఇక్కడ దాసోజు శ్రవణ్ ఖచ్చితంగా అర్హుడే, కోదండరాం కూడా అంతే… ఎటొచ్చీ ఆమె తన విచక్షణను కేసీయార్ తన పట్ల చూపిస్తున్న అమర్యాదకర ప్రవర్తన మీద వాడింది…
హైకోర్టు కూడా గవర్నర్ విచక్షణాధికారాల్లోకి ఎంటర్ కాలేదు… లేకపోతే గవర్నర్ తన విచక్షణాధికారాల మీద క్లారిటీ కోరేది… అప్పుడిక ఈ కేసు మరింత విస్తృతమయ్యేది… అమిత్ షాకు, మోడీకి చెప్పకుండా గవర్నర్ ఈ ఇద్దరు ఎమ్మెల్సీల నియామకాన్ని తొక్కిపెట్టలేదు… వాళ్లకు అన్నీ తెలుసు… సో, ఏతావాతా అర్థమవుతున్నది ఏమిటంటే… 99.9 శాతం కోదండరాం, అమెద్ అలీ ఖాన్ గవర్నర్ కోటాలో నియమితులు కాబోతున్నారు..! ఏమో, మంత్రివర్గ విస్తరణలో కోదండరాంకు ఓ పోర్ట్‌ఫోలియో దక్కినా ఆశ్చర్యం లేదు..!!
Share this Article