.
ఏపీ రాజకీయాల్లో ఓ సంచలనం… సాక్షి ఎడిటర్ ధనుంజర్ రెడ్డి ఇంటికి వెళ్లి, సోదాలు చేసి, ఏపీ పోలీసులు బెదిరించిన తీరు చూశాం… అంతకుమించి సాక్షి టీవీ డిబేటర్, మాజీ ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని అరెస్టు అంతకుమించిన సంచలనం…
నిజానికి రెంటికీ తేడా లేదు… పైగా హోదా రీత్యా సాక్షిలో కొమ్మినేని జస్ట్ ఓ డిబేటర్… కానీ తను సీనియర్, తెలుగు రాజకీయాల్లో అత్యంత ప్రముఖమైన పేరు… కానీ ధనుంజయ్ ప్రస్తుత హోదాకన్నా జస్ట్, నథింగ్…
Ads
వర్తమాన తెలుగు జర్నలిజంలో తనకున్నంత సీనియారిటీ, పరిచయాలు, బ్యాలెన్స్ ఎవరికీ లేవని చెప్పుకుంటారు… ఎప్పుడైతే జగన్ జెండా పట్టుకున్నాడో క్రమేపీ తన క్రెడిబులిటీని, పాత్రికేయ ప్రమాణాల్ని పణంగా పెట్టేశాడు… ఒకరకంగా జాలిపడాల్సిన పతనం…
నిజానికి తను పక్కా జగన్ వ్యతిరేక సామాజికవర్గ కేరక్టర్… ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ… అన్నీ ఆ బాపతు క్యాంపులే… ఎప్పుడైతే లోకేష్‌కు కోపమొచ్చిందో అప్పుడు ఎన్టీవీ నుంచి తరిమేయబడ్డాడు… కేవలం అదే సానుభూతితో సాక్షిలో కొలువొచ్చింది… జగన్‌కు అలవాటే కదా, తన సూసైడ్ కేరక్టర్లకన్నా టీడీపీ తాత్కాలిక బహిష్కృతులే ఆత్మీయులు అని…
ఇక్కడ కొన్ని అంశాలు… 1) ఆయన మీదే కాదు, ధనుంజయ్ ఇంటి సోదాలతోనే కూటమి ప్రభుత్వం ఓ హెచ్చరిక జారీ చేసింది… దొరికితే వదలం బిడ్డా అని… పైగా తమ ‘మనిషి’ అయి ఉండీ, ప్రత్యర్థి కూటమిలో ఉంటావా అనే కోపం కొమ్మినేని మీద ఉండనే ఉంది…
2) అమరావతి వేశ్యల అడ్డా, ఎయిడ్స్ కేంద్రం అని ఎవరో జర్నలిస్టు అట, వాగుతుంటే… కొమ్మినేని అడ్డుకోకపోవడం ఒక తప్పు… అసలు ఆ కేరక్టర్‌ను తన డిబేట్‌కు ఎంపిక చేయడం మరో తప్పు… ఒక ప్రాంత మహిళలందరినీ కించపరచడం ఇంకో తప్పు… పైగా ఆ వ్యక్తి వ్యాఖ్యలతో మాకేం సంబంధం లేదని చేతులు దులుపుకోవడం పెద్ద తప్పు…
3) ఎందుకంటే… ఏ పత్రికైనా సరే, ప్రతి అక్షరానికీ బాధ్యత వహించాల్సిందే… అది లీగల్, మోరల్, స్టాండర్డ్… ఇది టీవీకి కూడా… ఎవడో ఏదో అన్నాడు, నాకేం సంబంధం అంటే కుదరదు… ఇష్యూ ఫ్లేరప్ అయ్యాక కూడా సాక్షి సదరు వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు అన్నదే తప్ప… సారీ చెప్పలేదు… అది దుర్మార్గం, అనైతికం, నీచం కూడా…
4) ఊహిస్తున్నదే… సాక్షి తరఫున ఎక్కడ దొరికినా మూసేస్తారని… ఎందుకంటే, ఇది చంద్రబాబు ప్రభుత్వం కాదు, లోకేష్ ప్రభుత్వం, రెడ్ బుక్ ప్రభుత్వం… పవన్‌లు, మిగతా మంత్రులు జస్ట్, నథింగ్…
5) అసలు కొమ్మినేని అరెస్టు అనేది కూటమి ప్రభుత్వ భారీ ప్రణాళికలో జస్ట్, ఓ చిన్న పార్ట్… గత చంద్రబాబు హయాంలో బీజేపీ – జగన్ దోస్తీ వల్ల సాక్షిని మూసేయించలేకపోయారు, జగన్ బెయిల్ రద్దు చేయించలేకపోయారు… కానీ ఇప్పుడు వేరు… దిగ్రేట్ మోడీ ప్లస్ గ్రేటర్ బాబు ప్లస్ గ్రేటెస్ట్ పవన్ ఓ కూటమి… చిన్నా చితకా అరెస్టులే కాదు, ఏకంగా సాక్షిని మూసేయించి, జగన్‌ను మళ్లీ లోపలకు తోసే ప్రయత్నాలు ఊహిస్తున్నవే…
6) కొమ్మినేని అరెస్టు ఓ బృహత్ ప్రణాళికలో చిన్న పార్ట్, ఈ డిబేట్‌తో చేజేతులా చాన్స్ ఇచ్చింది సాక్షే… మాకు సంబంధం లేదని చేతులు దులుపుకోవడం కాదు, సారీ చెప్పి ఉండాల్సింది… అహం లేదా విషం అడ్డొచ్చింది… ఒక లేడీ చైర్‌పర్సన్‌గా ఉన్న ఛానెల్ అంత దుర్మార్గపు వ్యాఖ్యలకు ఎందుకు చాన్స్ ఇచ్చిందనే విమర్శ సాక్షికి, జగన్ క్యాంపుకి పెద్ద చేదు మరక… బాధ్యుడు కొమ్మినేని… ఇన్నేళ్ల జర్నలిజం ప్రమాణాలు, నైతికత ఏమయ్యాయనే ప్రశ్నకు తన దగ్గర జవాబు లేదు, జగన్ క్యాంపులో ఉండదు కూడా…
…. సరే… నేను సీనియర్ సిటిజెన్‌ను, నోటీసు ఇవ్వలేదు, మేం ఒకసారే వేశ్యలు అన్నాం, కానీ ఈనాడు, జ్యోతి వందలసార్లు అదే మాట అన్నవి, వాళ్లను కదా అరెస్టు చేయాల్సింది అనే కొమ్మినేని సమర్థన జస్ట్ అబ్సర్డ్…
చేసిన వ్యాఖ్యలకు చింత, క్షమాపణ లేవు సరికదా ఎదురుదాడి… ఎన్ని దశాబ్దాల సీనియారిటీ చివరకు ఎలా మారిపోయిందో ప్చ్, ఫాఫం… ఎస్, సీనియర్ సిటిజెన్, నోటీసుల్లేవు అనేవి కరెక్టు… బాబు ప్రభుత్వం లీగల్‌గా వెళ్లాల్సింది… నిన్న తను కఠినచర్యలు అని ట్వీటినప్పుడే అర్థమైంది… కొమ్మినేని… (ఒకప్పటి తన ఫ్రెండ్) అరెస్టు తప్పదని… సదరు కృష్ణంరాజు దొరికితే ఇంకాస్త నీచంగానే ఉండబోతున్నదట పోలీస్ ట్రీట్మెంట్..,.
అసలు ఆయన ఎవరు..? ఏ ప్రముఖ మీడియాలో పనిచేసినట్టు గుర్తులేదు, పైగా ఎడిటర్స్ గిల్డ్ అట… ఓహ్, ప్రతి రాష్ట్రానికీ ఎవరైనా పెట్టుకోవచ్చా..? నేషనల్ ఎడిటర్స్ గిల్డ్ జవాబు ఇవ్వాలి…
కొమ్మినేనిపై పెట్టిన సెక్షన్లు…
1. సెక్షన్ 79 BNS – దుష్ప్రచారం, తప్పుడు ఆరోపణలు ద్వారా ఇతరుల పరువు నష్టం కలిగించడం (Defamation) ఉదాహరణకు, మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేయడం దీనిలోకి వస్తుంది… వోకే…
2. సెక్షన్ 196(1) BNS –మత విద్వేషాలు రెచ్చగొట్టడం (Promoting enmity between groups on grounds of religion, race, caste, etc.)… ఇందులో మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఏముంది..?
3. సెక్షన్ 353(2) BNS – ప్రభుత్వ అధికారులను వారి విధుల నుంచి అడ్డుకోవడం (Assault or criminal force to deter public servant from discharge of duty)… ఇదెందుకు పెట్టినట్టు..?
4. సెక్షన్ 299 BNS – అనుమానాస్పద వధ ఉద్దేశ్యంతో పని చేయడం (Culpable homicide not amounting to murder) — ఇది తీవ్రమైన సెక్షన్. ఇందులో ఎవరైనా ప్రేరేపణతో మానసిక హింస లేదా తీవ్ర మానసిక దుస్థితికి నెట్టే ప్రకటనలు చేస్తే ఇది వర్తించవచ్చు… దీన్ని పోలీసులు కోర్టులో ఎలా సమర్థించుకుంటారో చూడాలి…
5. సెక్షన్ 356(2) BNS – స్త్రీలను బెదిరించడమూ, అసభ్యంగా మాట్లాడటం. (Outraging modesty of a woman – likely equivalent to old IPC 354)… వోకే…
6. సెక్షన్ 61(1) BNS – అక్రమ సమావేశాలు, రెచ్చగొట్టే ప్రకటనలు (Likely relating to unlawful assembly or incitement – confirmation awaited from final BNS version)… సరే…
🔹 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం (Information Technology Act, 2008):
7. సెక్షన్ 67 ITA 2008 – అశ్లీల సమాచారం పంచడం, ప్రచారం చేయడం (Publishing or transmitting obscene material in electronic form)… దీనితో మీడియా ఇంటర్వ్యూలలో అసభ్య వ్యాఖ్యలు చేస్తే ఫిర్యాదు చేయవచ్చు… వోకే…
🔹 ఎస్సీ / ఎస్టీ అట్టి వర్గాలపై దౌర్జన్యాల నివారణ చట్టం (SC/ST POA Act, 1989):
8. సెక్షన్ 3(1)(u) – ఎస్సీ/ఎస్టీ సభ్యులను వారి కులం ఆధారంగా అవమానపరిచేలా మాట్లాడడం, పరువు నష్టం కలిగించడం… ఇది కులవివక్ష వ్యాఖ్యలు చేసినప్పుడు వర్తిస్తుంది…. ఈ సెక్షన్ ఎలా సమంజసం..? బహుశా కొమ్మినేని బెయిల్ పిటిషన్‌కు ఇది అనుకూలం… ఈ ఇష్యూలో కులాల్ని కించపరచడం లేదు… కేసు బలంగా ఉండటం కోసం ఏపీ పోలీసుల ఓవరాక్షన్ కావచ్చు…
చివరగా… క్రూషియల్ ప్రశ్న.,. వైఎస్ హయాంలో మార్గదర్శి, ఆర్ఎఫ్సీ అక్రమాల పేరిట ఈనాడు ఆర్థిక మూలాల్ని పెకిలించే ప్రయత్నం జరిగింది… ఒక మీడియా సంస్థ ఏ అక్రమాలకు పాల్పడినా సరే భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట ప్రభుత్వాలు చర్యలు తీసుకోవద్దా..? ఇదీ పత్రికా స్వేచ్ఛకు విఘాతమే అనే చర్చ సాగింది చాన్నాళ్లు… మీడియాలో ఉంటే ఏ అక్రమానికైనా ఇమ్యూనిటీ వస్తుందా..? చట్టాలకు అతీతమా..?
సరే, ఇదే జగన్… ఏకంగా రామోజీరావును లిఫ్ట్ చేయాలని అనుకున్నాడు… రామోజీ జాన్‌జిగ్రీ కేసీయార్ అడ్డుకుని, ఫాఫం, కేన్సర్ పేషెంటు కదా అని జాలి చూపి వద్దన్నాడు… లేకపోతే ఇన్ని దశాబ్దాల్లో ఎవరికీ చేతకాని రామోజీ అరెస్టును చేసి చూపించేవాడు కదా జగన్…
సో, ఏపీ పాలిటిక్సులో ఇది సబబు, ఇది బేసబబు అని చెప్పడానికి ఏమీ ఉండదు… ఆ పాలిటిక్స్ పరమ నీచమైన స్థాయికి చేరుకున్నాయి… ఎస్, కొమ్మినేని అరెస్టు అనేది ఈ మొత్తం చిత్రంలో చాలా చిన్న గీత…!!
Share this Article