Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నో… ఆ కోర్టు స్టే ఎత్తేసినా సరే… వరాహరూపం ఒరిజినల్ పాట పెట్టలేరు…

November 25, 2022 by M S R

కాంతార కేసులో ఓ ట్విస్టు… వరాహరూపం పాట కేసు తెలుసు కదా… అది మా ప్రైవేటు ఆల్బం నుంచి కాపీ చేశారని మలయాళ మ్యూజిక్ కంపెనీ థైకుడం బ్రిడ్జి కాంతార నిర్మాతలపై కేసు వేసింది… అది ఆ పాట వాడకుండా స్టే విధించింది… కాంతార నిర్మాతలు హైకోర్టుకు వెళ్లినా సరే మొన్ననే కదా హైకోర్టు కొట్టేసింది… దాంతో విధిలేక మరో ప్రత్యామ్నాయ ట్యూన్‌లో అదే కంటెంటును ఓటీటీ వెర్షన్‌లో పెట్టారు… ఒరిజినల్ తొలగించారు… సదరు థైకుడం బ్రిడ్జి కంపెనీ ‘న్యాాయం గెలిచింది’ అని ట్వీట్లు పెట్టి పండుగ చేసుకుంది…

నిజంగానే వరాహరూపం ఒరిజినల్ సాంగ్ సింక్ అయినట్టుగా కొత్త సాంగ్ ఆ క్లైమాక్స్‌కు సూట్ కాలేదు… ఫలితంగా ఈ సినిమాకు ప్రాణంగా ఉన్న క్లైమాక్స్ వీక్ అయిపోయింది… ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి అన్నట్టుగా ఈ నిర్మాతలు అదే స్టే విధించిన కొజిక్కోడ్ డిస్ట్రిక్స్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు… కోర్టు ఆ స్టే ఎత్తేసి, మీ పాటను ఎలాగైనా వాడుకోవచ్చునని అనుమతించింది…

వావ్… గుడ్ న్యూస్… ఇంకేముంది..? ఒరిజినల్ సాంగ్‌ను ఓటీటీ వెర్షన్‌కు పెట్టేస్తే బాగుంటుంది కదా అనుకుంటున్నారా..? లేదు… ఇప్పుడే ఆ పని చేయలేరు కాంతార నిర్మాతలు… దానికి ఇంకో ట్విస్టు ఉంది…

kantara

ఒరిజినల్‌గా ఈ పాటను రాసిన శశిరాజ్ కవూర్ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెడుతూ… కొజిక్కోడ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ తీర్పు ప్రస్తావించి… మొన్న థైకుడం బ్రిడ్జి కంపెనీ చెప్పినట్టే… ‘న్యాయం గెలిచింది’ అని నినదించాడు… జై తుళునాడు అని కూడా రాశాడు… మలయాళ కంపెనీ మీద గెలుపు సాధించారు సరే, జై కన్నడ అనో రాయకుండా ఈ జై తుళునాడు ఏమిటి..?

అయితే ఇప్పటికిప్పుడు మళ్లీ ఒరిజినల్ వరాహరూపం పాటను ఓటీటీ వెర్షన్‌లో కలపలేరు… ఎందుకంటే ఇదే కేసు పాలక్కాడ్ కోర్టులో కూడా ఉంది… ఆ కోర్టు కూడా సేమ్ స్టే విధించి ఉంది… ఆ కోర్టు కూడా స్టే ఎత్తేస్తే తప్ప వరాహరూపం కాంతార క్లైమాక్స్‌లో చేరలేదు… కానీ సిమిలర్ కేసు కాబట్టి ఆ కోర్టు కూడా స్టేను ఎత్తేసే అవకాశం అయితే ఉంది… అప్పుడు గానీ ఈ పాట సంకెళ్లు తెంచుకోదు, విముక్తి దొరకదు… దిగువ కోర్టు ఎందుకు స్టే ఇచ్చింది, ఎందుకు ఎత్తేసింది, హైకోర్టు ఎందుకు కేసు టేకప్ చేయలేదు అనే వివరాల జోలికి వెళ్లడం లేదు ఇక్కడ…!

నిజానికి ఈ నవరసం- వరాహరూపం కేసులో సమగ్ర విచారణ జరిగితే బాగుండు… అసలు కేసులో మెరిట్ లేదు… నిజానికి ఎవరు ఏ పాటను తీసుకున్నా, కర్నాటక శాస్త్రీయ సంగీతాన్ని బేస్‌గా తీసుకోవాలి అనుకుంటే 72 మేళకర్త రాగాలు/ జనకరాగాలు/ సంపూర్ణరాగాల నుంచే తీసుకోవాలి… అవే కదా మన దక్షిణ సంగీతానికి పేరెంట్స్… నవరసం, వరాహరూపం రెండు పాటలకూ అదే బేస్… కాకపోతే ఉపయోగించిన వాయిద్యం, అక్కడక్కడా ట్యూన్ సేమ్… కానీ అది కథాకళి, ఇది భూత కోళ… ఆ కంటెంటు వేరు… ఈ సందర్భం వేరు… మేళకర్త రాగాలపై ఎవరికి ఓనర్ షిప్ ఉంది…?! అవి ప్రజల ఆస్తి…!!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • ఓహ్… అదానీని ముంచిన హిండెన్ బర్గ్ రిపోర్టుల అసలు కథ ఇదా..?
  • పాపులారిటీ సర్వేలో తెలుగు సీఎంలు పూర్ ప్లేస్… అసలు జాడే లేని కేసీయార్…
  • దటీజ్ అమితాబ్..! ఈరోజుకూ తిరుగులేని నంబర్‌వన్ స్టార్… సర్వే చెప్పిందిదే…!
  • సివంగి..! కల్లోలిత జమ్ము కాశ్మీర్‌లో పోలీస్ ఆఫీసర్… ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్…!
  • గుహుడు గుర్తున్నాడా రాముడికి..? మంథర పాత్ర ఎందుకు కీలకం..? (పార్ట్-3)
  • వన్ నేషన్..! ఆరుగురు జాతీయ అవార్డు గ్రహీతలతో ఒక పాన్ ఇండియా సినిమా…!
  • కాంతార, విక్రమ్, దృశ్యం… ఈ మూడూ ఒకే మలయాళ సినిమాలో కలిస్తే…
  • చిరంజీవికన్నా కల్యాణరామ్‌కు ఎక్కువ మార్కులు… ఎక్కడ..? ఎలా..? ఎప్పుడు..?
  • అడుసు తొక్కుతున్న అదితి… అనుభవంతోగానీ తత్వం బోధపడదు…
  • జమున ముక్కు మీద నీడ… ఆమెది సునిశిత పరిశీలన… అందుకే ‘నిలబడింది’…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions