సూపర్ స్టార్ కృష్ణ గురించి అవీ ఇవీ సెర్చుతుంటే… అనేకచోట్ల కనిపించింది… కృష్ణ ఒక సినిమా ఎన్నిరోజులు నడుస్తుందో తొలి షో చూసి చెప్పేసేవాడు… పర్‌ఫెక్ట్ అంచనా… నిజమే, చివరకు తన సినిమాల మీద కూడా అంచనాల్ని, జోస్యాల్ని చెప్పి.., అవి నిజమైన సందర్భాలు బోలెడు… కానీ సినిమాల జయాపజయాల గురించి కాదు, ఓ నటుడి కెరీర్ మీద కూడా తన దృక్కోణం, తన అంచనా వేరేగా ఉండేది…
ఉదాహరణకు… మహేశ్ బాబు… ఫస్ట్ లీడ్ రోల్ రాజకుమారుడు… రాఘవేంద్రరావు దర్శకుడు, ప్రీతిజింతా హీరోయిన్… మహేశ్‌కన్నా కాస్త ముదురు అనిపిస్తుంది… వైజయంతి వాళ్ల సినిమా… మంచి లాంచింగే… కానీ సూపర్ హిట్టేమీ కాదు… తరువాత యువరాజు సినిమా… అందులో సిమ్రాన్, సాక్షి శివానంద్ హీరోయిన్లు… ఆ కాంబినేషన్ సరిగ్గా కుదరలేదు… మహేశేమో మరీ లేత… వాళ్లు ముదుర్లుగా కనిపించారు… కథ ఓ గందరగోళం… వెరసి ఫ్లాప్… ఆ తరువాత సినిమా పేరు వంశీ…
అందులో నమత్ర శిరోద్కర్ హీరోయిన్… అప్పటి నుంచే ఇద్దరి నడుమ కెమిస్ట్రీ, డేటింగ్ ఎట్సెట్రా మొదలైనట్టున్నాయి… సరైన జోడీయే కానీ, సినిమా ఫ్లాప్… ఇది పద్మాలయా వాళ్ల సొంత సినిమా… అప్పుడు సినిమా సర్కిళ్లలో ఓ చర్చ… కృష్ణ పెద్ద కొడుకు రమేశ్ బాబులాగే మహేశ్ బాబు కూడా ఇండస్ట్రీకి నచ్చలేదా..?
Ads
కృష్ణ ఈ విమర్శల్ని కొట్టిపారేశాడు… తను చూసే కోణం వేరు… ఎస్, రమేశ్ బాబుకు ఎన్ని బద్దలు కట్టినా సరే, తను హీరోగా నిలబడలేకపోయాడు అనేది వేరే సంగతి.,. కానీ మహేశ్ బాబు విషయంలో ఓ మాటన్నాడు,.. ‘‘చూడాల్సింది ఒక హీరోను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారా లేదా అని మాత్రమే… సినిమాలు హిట్లు వస్తాయి, ఫ్లాపులు వస్తాయి… మంచి పాత్ర ఒక్కటి పడితే చాలు, ఇక ఎవరూ ఆపలేరు… మహేశ్ బాబును ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు…
రాజకుమారుడు, వంశీ సక్సెస్ కాకపోవడానికి కారణాలు వేరు, మహేశ్‌ను ప్రేక్షకులు అంగీకరించకపోవడం కాదు…’’ అన్నాడు కృష్ణ… నిజంగానే తరువాత కృష్ణ వంశీ దర్శకత్వంలో మురారి సినిమా… ఈ సినిమాతో మహేశ్ నిలబడ్డాడు… కాకపోతే తరువాత మళ్లీ నాని, బాబీ, నిజం వంటి సినిమాల్ని అంగీకరించి తప్పు చేశాడంటారు… ఒక్కడు, అతడు, పోకిరి సినిమాలతో మహేశ్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు… కొన్ని సినిమాలు ఫ్లాప్, కొన్ని హిట్… కారణాలు బోలెడు, కానీ మహేశ్ ఇమేజీ మాత్రం పెరుగుతూనే పోయింది…
2014 నుంచి 2017 స్పైడర్ వరకు మళ్లీ గ్రహణకాలం… తరువాత మళ్లీ హిట్లు… కృష్ణ తన జీవితకాలంలో 350 వరకూ సినిమాలు తీశాడు… కానీ మహేశ్ అలా కాదు… మెటిక్యులస్… వ్యాపారం, కుటుంబం, నటన… అన్నింటికీ మధ్య బ్యాలెన్స్… 23 ఏళ్లలో కేవలం 27 సినిమాలు మాత్రమే… ఇదంతా సరే, రమేశ్ బాబును ప్రేక్షకులు పెద్దగా యాక్సెప్ట్ చేయలేదని తెలిసీ కృష్ణ ఎందుకు తనను హీరోగా నిలబెట్టాలని విపరీతంగా తాపత్రయపడ్డాడు..? అంచనా లేక కాదు, తండ్రిగా ఓ ఆరాటం…!!
Share this Article