కృష్ణ చివరి చూపు కోసం వేలాది మంది అభిమానులు పోటెత్తారు… పోలీసులు ఓ దశలో లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది… తను సినిమాలు మానేసి ఏళ్లు గడుస్తున్నా సరే, వయస్సు 80లోకి వచ్చినా సరే… తెలుగు ప్రేక్షకుల్లో కృష్ణ అంటే పిచ్చి ప్రేమ… టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా నివాళి అర్పించారు… ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి… సగర్వంగా వెళ్లిపోయాడు…
ఇదంతా సరే, పొరుగు ఇండస్ట్రీల నుంచి ఎవరైనా వచ్చారేమో అని చూస్తే ఒక్కరూ కనిపించలేదు… మద్రాసులోనే కృష్ణ వల్ల బాగుపడిన వాళ్లు ఎందరో… వాళ్లూ లేరు, స్టార్స్ లేరు… అంతెందుకు..? కృష్ణ లేకపోతే హిందీ హీరో జితేంద్ర లేడు… తన కెరీర్ లేదు… తనైనా కనిపిస్తాడేమో అని చూస్తే ఇక్కడా నిరాశే… ఏదో సోషల్ పోస్టు పెట్టేసి, నివాళి అర్పించేశాడు… ఎస్, తన వయస్సు కూడా ఎనభయ్యేళ్లు… ఐనా రావడం కష్టమేమీ కాదు…
1970, 1980 ప్రాంతాల్లో నెలకు 25 రోజులూ జితేంద్ర హైదరాబాదులోనే ఉండేవాడు… కృష్ణ తనతో బోలెడు రీమేక్స్ చేశాడు… ఇంకే హీరోను ఎంటర్‌టెయిన్ చేయలేదు… జస్ట్, జితేంద్ర ఓన్లీ… జితేంద్ర స్వయంగా చెప్పుకున్నాడు… ‘‘తెలుగు నుంచి బోలెడన్ని రీమేక్స్… కృష్ణ, ఆయన సోదరుడు హనుమంతరావు నిర్మాతలు… పద్మాలయా స్టూడియో నుంచి హిందీ సినిమా అంటే నేనే హీరో… అంతగా వారిలో కలిసిపోయాను… టక్కర్ (దేవుడు చేసిన మనుషులు), హిమ్మత్‌వాలా (ఊరికి మొనగాడు), జస్టిస్ చౌదరి, మవాలి (చుట్టాలున్నారు జాగ్రత్త), హోషియార్ (కిరాయి రౌడీలు), పాతాళభైరవి, ఖైదీ, కామ్‌యాబ్ (శక్తి)… ఇలా ఒకటా రెండా..? దాదాపు 15 రీమేకులు..’’
Ads
కృష్ణతో 1960 కాలం నుంచే బంధం ఉంది… తన బ్లాక్ బస్టర్ గూఢచారి 116 రీమేక్ కోసం కృష్ణను, బాబీని (విజయనిర్మల) తొలిసారి కలిశాను… నా కెరీర్‌కు అదే బలమైన పునాది… అప్పటిదాకా బాలీవుడ్‌లో నేనేమిటో నాకే తెలియదు… అప్పుడు గూఢచారి 116 సినిమాను ఫర్జ్ పేరిట తీద్దామని కృష్ణ ప్లాన్… హిందీలో ఎవరిని అడిగినా అంగీకరించలేదు… అందుకని నాకు దక్కింది… ఎవడో ఒకడు, ఎవడైతే ఏంటిలే అనుకుని నాతో మొదలు పెట్టారు…
అప్పట్లో చాలా టైట్ బడ్జెట్‌తో ఆ సినిమా షెడ్యూళ్లు పూర్తిచేశారు… జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేకుండా ఉంది… కృష్ణ నాకు తెలిసి ఆరోగ్యవంతుడే… కానీ దురదృష్టం…’’ ఇలా రాసుకుంటూ పోయాడు… సింఘాసన్ సినిమా కోసం భారీ ఖర్చుకు భయపడకుండా రాధ, జయప్రద, మందాకిని, బప్పీలహరి… తెలుగులో తొలి 70 ఎంఎం మూవీ… భారీ సెట్లు… జితేంద్రకు ఊహించని అవకాశం… కానీ ముంబై నుంచి మాత్రం కదలడానికి, నివాళి అర్పించడానికి మాత్రం మనసు రాలేదు… లోకం తీరు అంతే…!!
Share this Article