Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సాక్షి ఖాతాలోకి మరో క్రెడిట్… INS అధ్యక్షుడిగా KRP Reddy…

September 23, 2022 by M S R

సాక్షి దినపత్రిక ఖాతాలోకి మరో క్రెడిట్ వచ్చిచేరింది… నిజంగా విశేషమే… సాక్షి డెయిలీలో ప్రస్తుతం అడ్వర్టయిజింగ్, మార్కెటింగ్ డైరెక్టర్‌గా ఉన్న కె.రాజప్రసాదరెడ్డి… అలియాస్ కేఆర్పీ రెడ్డి ఐఎన్ఎస్ (ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ) కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు… ప్రిస్టేజియస్ పోస్ట్… ఇది ఎందుకు విశేషం అంటే..? ఐఎన్ఎస్ 1939లో ఏర్పడింది… అంటే 83 సంవత్సరాల క్రితం… తెలుగు పత్రికల తరఫున ఇంతకుముందు ఎవరూ దీని అధ్యక్ష పదవిని పొందలేదు… ఇది తొలిసారి…

అన్ని భాషల్లో కలిపి 1,10,851 పేపర్లున్నయ్ ఇండియాలో… వాటన్నింటికీ ఒకరకంగా ఇది అపెక్స్ బాడీ… ప్రింట్ మీడియాకు రకరకాల కొత్త సవాళ్లు ఎదురవుతున్న ఈ రోజుల్లో ఈ సంస్థ అధ్యక్ష బాధ్యతలు కూడా ఓ సవాలే… పత్రికలకు ఈ సంస్థ తీసుకునే నిర్ణయాలు కీలకమైనవి… కరోనా ప్రభావం, ప్రింటింగ్ కాస్ట్, మ్యాన్ పవర్, ట్రాన్స్‌పోర్ట్ కష్టాలు, ఎడిటోరియల్ స్టాండర్డ్స్, సర్క్యులేషన్ పతనాలు, యాడ్ రెవిన్యూలో కొత్త వాటాదారులు, డిజిటల్ పోటీ వంటి చాలా ఇష్యూస్ ఇప్పుడు ప్రింట్ మీడియాకు సవాళ్లు విసురుతున్న సంగతి తెలిసిందే కదా…

krp

గతంలో డెక్కన్ క్రానికల్ నుంచి వెంకట్రామారెడ్డి మాత్రమే ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా పనిచేశాడు… అదీ ఇంగ్లిష్ పేపర్… తెలుగు పత్రికల తరఫున కేఆర్పీ తొలిసారి ఎంపిక… తన కెరీర్ అంత ఈజీగా ఏమీ సాగలేదు… కష్టపడి నిర్మించుకున్న కెరీర్… ఈనాడులో మొదలైన కెరీర్ ఆయనది… ఈనాడు నుంచి బయటపడిన తరువాత ఉదయం… ఆంధ్రజ్యోతి పాత యాజమాన్యంలోనే కాదు, రాధాకృష్ణ యాజమాన్యంలో కూడా కేఆర్పీ మార్కెటింగ్ విభాగంలో కీలకం… కొన్నాళ్లు గార్డియన్, శివరంజని పత్రికల్లో కూడా చేశాడు…

వార్త పుట్టుక తరువాత మధ్యలో అందులో చేరాడు… సాక్షి ఆరంభం నుంచీ మార్కెటింగ్ చీఫ్ తనే… సుదీర్ఘ అనుభవం రీత్యా సాక్షి డెయిలీ కమర్షియల్‌గా కాస్త నిలదొక్కుకోవడానికి ఒకరకంగా కేఆర్పీ పాత్ర కీలకం… ప్రస్తుతం హైదరాబాద్ మార్కెటింగ్ సర్కిల్స్‌లో పలు ఆర్గనైజేషన్లలో పనిచేస్తున్న సీనియర్లు అందరూ కేఆర్పీ శిష్యులే… తక్కువ మాట్లాడతాడు… ఎక్కువ రిజల్ట్ చూపిస్తాడు… ‘ముచ్చట’ తరఫున అభినందనలు…!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • పాపులారిటీ సర్వేలో తెలుగు సీఎంలు పూర్ ప్లేస్… అసలు జాడే లేని కేసీయార్…
  • దటీజ్ అమితాబ్..! ఈరోజుకూ తిరుగులేని నంబర్‌వన్ స్టార్… సర్వే చెప్పిందిదే…!
  • సివంగి..! కల్లోలిత జమ్ము కాశ్మీర్‌లో పోలీస్ ఆఫీసర్… ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్…!
  • గుహుడు గుర్తున్నాడా రాముడికి..? మంథర పాత్ర ఎందుకు కీలకం..? (పార్ట్-3)
  • వన్ నేషన్..! ఆరుగురు జాతీయ అవార్డు గ్రహీతలతో ఒక పాన్ ఇండియా సినిమా…!
  • కాంతార, విక్రమ్, దృశ్యం… ఈ మూడూ ఒకే మలయాళ సినిమాలో కలిస్తే…
  • చిరంజీవికన్నా కల్యాణరామ్‌కు ఎక్కువ మార్కులు… ఎక్కడ..? ఎలా..? ఎప్పుడు..?
  • అడుసు తొక్కుతున్న అదితి… అనుభవంతోగానీ తత్వం బోధపడదు…
  • జమున ముక్కు మీద నీడ… ఆమెది సునిశిత పరిశీలన… అందుకే ‘నిలబడింది’…
  • ములాయం పద్మవిభూషణ్‌పై… వాట్సప్ యూనివర్శిటీ తప్పుగెంతులు…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions