Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గులాబీ సెల్ఫ్ గోల్స్… KTR Vs Harish..? కేసీయార్ గైర్హాజరీ ఎఫెక్ట్..!!

March 18, 2026 by M S R

 

.

మరీ అతి అనుకోవాలా… ఏందంటే..? అయిపోయింది బీఆర్ఎస్‌లో చీలిక… హరీష్ రావు వేరే దుకాణం పెట్టబోతున్నాడు… కేటీయార్‌తో ఇక వేగలేనని తెగదెంపులకు రెడీ అయిపోయాడు… అందుకే అసెంబ్లీలో కేటీయార్ వాకౌట్ అని ప్రకటించినా సరే, హరీష్ అండ్ గ్యాంగ్ అక్కడే కూర్చుని, ఎహెఫో అన్నట్టు వ్యవహరించారు…. ఇవీ వార్తలు…

Ads

దొరికిందిరా చాన్స్ అనుకుని కాంగ్రెస్ బ్యాచ్ గాయిగత్తర చేస్తోంది దీన్ని… సరే, వివరాల్లోకి వెళ్దాం… ప్రతిపక్షం అంటే నిర్మాణాత్మకంగా ఉండాలి గానీ ప్రతి విషయంలోనూ బురద జల్లే బాపతుగా ఉండొద్దు అనే సోయి బీఆర్ఎస్‌‌కు ఎప్పుడూ లేదు.,. ఏదో ఇష్యూలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ వాకౌట్ అన్నాడు కేటీయార్…

తనెవరు..? పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంటే తప్ప బీఆర్ఎస్ఎల్పీ లీడర్ కాదు, సభలో ప్రతిపక్షనేత లేడు, రాడు, తను జనానికి దూరమై… ఆ ఫామ్ హౌజులోనే అంతులేని వైరాగ్యంలో, జనం మీద అలకతో… రాజకీయ నైతిక సూత్రాలన్నింటినీ వదిలేసి బతుకుతున్నాడు పాపం…

దాని ప్రభావం ఎలా ఉంటుందీ అంటే… కేటీయార్ బీఆర్ఎస్ఎల్పీ లీడర్ కాదు, వాకౌట్ అనగానే అందరూ వెళ్లిపోవాలనీ కాదు… ఒక ఇష్యూ మీద అప్పటికప్పుడు ప్రకటించే నిరసన అది… కొందరు బయటికి వెళ్లి మళ్లీ లోపలకు వచ్చి కూర్చుంటారు, తరువాత అసెంబ్లీ బిజినెస్ కోసం…

చాలాసార్లు అపోజిషన్ లీడర్లు వాకౌట్ల నుంచి, మార్షల్స్ ఎత్తివేతల నుంచి ప్రొటెక్టివ్‌గా ఉంటారు… కానీ ఇక్కడ అసలు లీడర్ లేడు, డైరెక్షన్ లేడు, అసలు ఎవరు లీడర్ అనే క్లారిటీ లేదు… అవును, లీడర్ అంటే కేటీయారా..? హరీష్ రావా..?

ఈ ప్రశ్న, ఈ సందిగ్ధం ఎందుకొచ్చిందీ అంటే… ఏదో అంశంపై కేటీయార్ వాకౌట్ అన్నాక కూడా హరీష్, మరో ఇద్దరు ఎహెఫో అన్నట్టుగా అక్కడే కూర్చున్నారు… బయటికి పోలేదు… అంటే కేటీయార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టే కదా… మద్దతు, లీడర్ ఆదేశాన్ని మన్నించడం అంటే, కనీసం బయటికి పోయి మళ్లీ సభలోకి వచ్చి ఉండాల్సింది… అంటే, తన మామకు, కేటీయార్‌కు, బీఆర్ఎస్ కేడర్‌కు, అల్టిమేటుగా బీజేపీకి ఏవైనా సంకేతాలు పంపిస్తున్నాడా..? ఇదుగో ఈ ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది…

  • ఇప్పుడు కేటీఆర్ నిర్ణయాన్ని ధిక్కరించి సభలో కూర్చోవడం ద్వారా, “పార్టీ అంటే కేవలం ఒకరి కనుసన్నల్లో నడిచేది కాదు” అని హరీష్ రావు పరోక్షంగా కేటీయార్‌ను, పార్టీని, అధినేతను హెచ్చరించినట్టు కనిపిస్తోంది.

సో, ఎక్కడో భారీ తేడా కొడుతోంది అన్నమాట… సరే, హరీష్ రావు  బీజేపీ టచ్‌లోకి వెళ్లిపోయాడు, అందుకే కేటీయార్ నాయకత్వాన్ని ధిక్కరిస్తూ వ్యవహరిస్తున్నాడు అని స్వీపింగ్ కామెంట్ చేయలేం గానీ… ఇక ఈ పింక్ దుకాణంలో ఎన్నాళ్లు ఉన్నా సరే, అయితే నంబర్ టూ, మరీ తేడా4 వస్తే నథింగ్ అనే క్లారిటీ హరీష్ రావుకు వస్తున్నట్టు కనిపిస్తోంది…

సో, కేటీయార్ అంటే పార్టీలో 100 శాతం యాక్సెప్టెన్సీ లేదన్నమాటేనా..? ఇదీ కీలక ప్రశ్న… దీర్ఘ సుషుప్తావస్థలో ఉన్న అసలు లీడర్ మాట్లాడడు, బయటికి రాడు, తనకు ఈ లోకం, ఈ తెలంగాణ సమాజమే అక్కర్లేదు, మళ్లీ గెలిపిస్తే కాళేశ్వరాలతో మరింతగా దండుకోవడానికి వస్తాడు… జనం అక్కర్లేని జననేత, బాపు, జాతిపిత, జనపిత, మహాజనపిత…

సార్, హరీష్ రావు సాబ్… నువ్వు గ్రేటన్నా… ఆత్మ గౌరవంతో, ఆత్మాభిమానంతో, ఇలాగే తలెత్తుకుని నిలబడు… ఎంటైర్ తెలంగాణ సమాజం హర్షిస్తుంది..!!



బీఆర్ఎస్‌లో చీలిక ?

అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ వాకౌట్ చేస్తుంది అని కేటీఆర్ చెప్పినంక కూడా సభలోనే కూర్చున్న హరీష్, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

కూర్చోవడమే కాకుండా చర్చలో కూడా పాల్గొనడం విశేషం

మూడు ముక్కల్లో ఒక ముక్క పోయింది.. రెండో ముక్క చీలడానికి రెడీగా ఉందన్నమాట!! pic.twitter.com/l7PRsUPYjo

— Telangana Galam (@TelanganaGalam_) March 18, 2026

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎరుపు లోలాకు కులికెను కులికెను… ఆమె గుర్తుందా మీకు..?!
  • ఆ పాట చరణాల సొగసు చూడతరమా…? వేటూరి మేథోమథనం కథ..!!
  • మళ్లీ ఇజ్జత్ తీసుకున్న పాకిస్థాన్… ఈసారి ఏకంగా దాని ప్రధాని వంతు…
  • నోటి తుత్తర ఎంత ప్రమాదకరమో చెప్పే సినిమా… మధురానగరిలో…
  • దేవనపల్లి కవిత..! టీఆర్ఎస్ కాదు… తెలంగాణ జాగృతి పార్టీయే..!!
  • అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడినట్టు…!!
  • ఇరాన్ యుద్ధనీతిని అస్సలు అంచనా వేయలేని ట్రంప్ వైఫల్యం…
  • ఇదే డెస్టినీ అంటే..! కేసీయార్ సార్, ఓసారి ఇది తాపీగా చదవగలరు…!!
  • అమెరికా, ఇజ్రాయిల్ తప్పులో కాలేశాయి..? మొస్సాద్‌కు మొదటిసారి షాక్..!!
  • సర్కారు సకాల స్పందన… రిటైర్డ్ ఉద్యోగులందరికీ భారీ ఊరట

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions