Subramanyam Dogiparthi…. NTR త్రిపాత్రాభినయం చేసిన ఏకైక సాంఘిక చిత్రం 1972 లో వచ్చిన ఈ కులగౌరవం సినిమా . తమ స్వంత బేనరయినా పేకేటి శివరాంకి దర్శకత్వం వహించే అవకాశాన్ని కలగచేసారు . మన తెలుగు సినిమాకు మాతృక 1971 లో వచ్చిన కులగౌరవ అనే కన్నడ సినిమా . దానికి కూడా పేకేటియే దర్శకుడు . కన్నడంలో రాజకుమార్ , జయంతి , భారతి నటించారు . తమిళంలో 1976 లో రీమేక్ చేసారు . దానికీ పేకేటియే దర్శకుడు . మూడు భాషల్లోనూ పేకేటియే దర్శకుడు . తమిళ సినిమాలో ముత్తురామన్ , జయంతి , జయసుధ నటించారు . జయంతి మూడు భాషల్లోనూ నటించింది .
తాత , కొడుకు , మనమడు పాత్రల్లో నటించారు NTR . తాత జమీందారు . కొడుకు సాధారణ స్త్రీని ప్రేమిస్తాడు . తండ్రి ఒప్పుకోడు . ఇంట్లోనుంచి బయటకు వెళ్ళ పెళ్లి చేసుకుంటారు . దివాన్ కొడుకు బుర్రలో అనుమానాలు రేకెత్తించి , వాళ్ళ కాపురాన్ని నాశనం చేస్తాడు . తమకు పుట్టిన బిడ్డను ఒక్కడే పెంచుతాడు . మనమడు తాతకు బుధ్ధి చెప్పి , తల్లీదండ్రులను కలుపుతాడు . ఇదీ టూకీగా కధ .
NTR , జయంతి ఉంటే నాటకీయత ఉంటుంది కదా ! ఉంది . మన తెలుగులో ప్రధాన పాత్రల్లో NTR , జయంతి , ఆరతి నటించారు . మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో చూసా . టి విలో ఎప్పుడూ రాలేదు . ఎందుకనో ! సినిమా యూట్యూబులో కూడా లేదు . కన్నడ సినిమా ఉంది .
Ads
కన్నడ సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన టి జి లింగప్పే మన తెలుగు సినిమాకు కూడా దర్శకత్వం వహించారు . హల్లో హల్లో డాక్టర్ , ఎన్ని కలలు కన్నానురా , కలగంటినని పలికావు , కులం కులం అంటావు గోత్రమేమిటంటావు , దేశమంటే నువ్వే కాదు , మాతృత్వం లోనె ఉంది ఆడజన్మ సార్ధకం , ఒహోహో బుల్లెమ్మా పొగరుబోతు బుల్లెమ్మా వంటి హిట్ సాంగ్స్ ఉన్నాయి . NTR లెవెల్లో హిట్ కాలేదు పాటలు .
Share this Article