సినిమా ఇండస్ట్రీలోనే చాలామంది డైలాగ్స్ ప్రాముఖ్యతను తీసిపారేస్తారు… సినిమా అనేది దృశ్యమాధ్యమం, కాబట్టి సీన్లు బలంగా ప్రొజెక్ట్ కావాలంటారు… కానీ అలా కావాలంటే కేవలం నటీనటుల మొహాలు, ఉద్వేగాలు మాత్రమే కాదు… సరైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పడాలి… కథనంలో ఆ సీన్ బలంగా సెట్ కావాలి… సూటిగా, సంక్షిప్తంగా ఉండాలి, అంటే లాగ్ ఉండొద్దు… అన్నింటికీ మించి సరైన డైలాగ్స్ పడాలి…
ఇవన్నీ సీన్‌ను బాగా ఎలివేట్ చేస్తాయి… కథను మరింత బలంగా, లోతుగా కనెక్ట్ చేస్తాయి… మనం ఈరోజుకూ సీతారామయ్యగారి మనవరాలు, అతడు వంటి సినిమాల్లోని డైలాగ్స్‌ను చెప్పుకుంటుంటాం… ఆమధ్య వచ్చిన అఖండ డైలాగ్స్ కూడా బాగున్నయ్… డైలాగ్స్ నాణ్యత ఓవరాల్ గా సినిమా నాణ్యతను ఎన్‌హాన్స్ చేస్తుందనేది పక్కా…
ఈమధ్య సరదా వన్ లైనర్స్ టిల్లూ స్క్వేర్ రేంజ్ ఎంత పెంచాయో చూశాం కదా, అదీ డైలాగ్స్ ప్రాధాన్యం… సరే, అదేమో చాయ్ బిస్కట్ బాపతు ఫన్ ఫిలిమ్… కానీ హిందీలో వచ్చిన ఈ కొత్త సినిమాలోని డైలాగ్స్ మీద చాలామంది విమర్శకుల నుంచి ప్రశంసలు వినిపిస్తున్నాయి… మచ్చుకు ఒక అభినందన ఇలా…
Ads
Prasen Bellamkonda…. సంభాషణల కోసం చూడాలి. చూడండి.
స్త్రీ పాత్రలన్నీ గొప్పగా ఉండే సినిమాలు చాలా తక్కువ. లాపతా లేడీస్ ఆ తక్కువలో ఒకటి. అమీర్ ఖాన్ నిర్మాత కిరణ్ రావ్ దర్శకురాలు కనుక కొంచెమైనా బాగుండకపోదులే అని చూసా... నా అంచనాలను మించింది.
మెట్టినింటికి భర్తతో కలిసి వెళుతూ చిన్న గందరగోళం వల్ల తప్పుడు గమ్యాలు చేరిన ఇద్దరు కొత్తపెళ్ళికూతుర్ల కథ... నటులందరూ దాదాపుగా కొత్తవాళ్ళే అయినా చాలా ముదిరిన పాతవాళ్ళలాగే నమ్మించారు. వీళ్ళ మధ్యలో పోలీస్ గా రవికిషన్ విలనేమో అనిపిస్తూ హృదయాలు కొట్టేస్తాడు. ఇంతకంటే కథ స్పాయిలర్ చెయ్యలేను.
కథదేముందిలేగానీ సంభాషణలు అద్భుతం. నెక్స్ట్ లెవెల్. విప్లవ్ ఘోష్ అనుకుంటా స్త్రీ పాత్రలు పలికే ప్రతి మాట గుండె లోతుల్లోంచి పలికించాడు. స్త్రీ వాదపు రొడ్డ ప్రవచనల్లా కాక ఆమె వేదన అనుదిన నిర్వచనాల్లా వాక్యాలను చెక్కాడు.
కథ మరీ నాటకీయంగా ఉందనిపించొచ్చు. వేగం కొంచెం మెల్లిగా ఉందనిపించొచ్చు. అక్కడక్కడా లాజిక్ మిస్సయిందనిపించొచ్చు. నాకైతే ఇవేవీ అనిపించలేదు కానీ సూచన చేసేపుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కనుక ఇవన్నీ చెపుతున్నా.. ఏమనిపించినా అనిపించకపోయినా సంభాషణలు జాగ్రత్తగా వినండి. మనసు పెట్టి వినండి.
ఆడపాత్రలు మాట్లాడే ప్రతి మాట సినిమా మీద గౌరవాన్ని పెంచుతుంది. అయినా నచ్చలేదనుకోండి నన్ను తిట్టుకోండి. మీకు హిందీ రాకపోతే నేనేం చెయ్యలేను మరి. కొన్ని అవార్డులు తప్పకుండా ఖతార్ మె హై. అస్సలు మిస్సవద్దు. నెట్ ఫ్లిక్స్ లో ఉంది...
Share this Article