ఇందాక టీవీ వార్తల్లో అమెరికాలో ట్రంప్ మీద దుండగుడి కాల్పుల సంఘటన చూసినప్పుడు నాకు మళ్ళీ కర్తవ్యం విజయశాంతి గుర్తొచ్చింది
అదెలా అంటే ,
.
అమెరికా పెన్సిల్వేనియా లో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేదిక మీద మహోద్రేకంగా ప్రసంగిస్తున్నారు . ప్రపంచంలోనే మెరికల్లాంటి మేటి సెక్యూరిటీ వింగ్ అమెరికాలో ఉందని ఇప్పటిదాకా పేరు కదా , సరే, ఆ పేరు సంగతి అలా ఉంచితే ,
ఓ దుండగుడు ట్రంప్ ను యేసెయ్యాలని ప్లాన్ చేసుకున్నాడు . అతడు సినిమాలో మహేష్ బాబు ఎత్తైన బిల్డింగ్ పైనెక్కి స్టాండుకి గొట్టాలు తగిలించుకుని, బైనాక్యులర్స్ తో దూరంగా డయాస్ మీద ఎన్నికల సభలో మాట్లాడుతున్న షాయాజీ షిండేని యేసెయ్యలని ఎలా ట్రై చేశాడో , అలాగే ఆ దుండగుడు కొంచెం ఎత్తైన ప్లేస్ చూసుకుని, స్టాండు మోపు చేసుకుని, రైఫిల్ బారెల్ ఫిక్స్ (సేమీ ఆటోమేటిక్ గన్) చేసుకుని ట్రంప్ కేసి ఢాం అని బుల్లెట్ పేల్చాడు
ట్రంప్ అదృష్టం
వాడి దురదృష్టం
ట్రంప్ తలకి గురిపెట్టిన బుల్లెట్ చెవికి తగిలి వెనుక ఉన్న ఇంకోడి గుండెల్లో దిగి ఢాం అన్నాడు . తెలుగు సినిమాల్లో పోలీసుల మాదిరి లేటుగా స్పందించిన ట్రంప్ సెక్యూరిటీ ఢాం ఢాం అని వాడ్ని కాల్చిపారేశారు .
Ads
సరే, వాడ్ని ముందే పసిగటంలో సెక్యూరిటీ వైఫల్యం గురించి అమెరికా చూసుకుంటుంది కానీ ఈ ఎపిసోడ్ లో నన్ను ఆకర్షించింది ఏంటంటే , చెవికి బుల్లెట్ రాసుకుంటూ వెళ్ళగానే ట్రంప్ గభాల్న డయాస్ కిందకి నక్కాడు . చుట్టూ ఉన్న సెక్యూరిటీ అలర్ట్ అయి ట్రంప్ ను కవర్ చేశారు .
మెరికల్లాంటి కమెండోలు స్టెన్ గన్లు వేసుకుని ముందుకురికారు . అందరూ అలర్ట్ . అందరిలోనూ టెన్షన్ . ఇవన్నీ కాదు నన్ను ఆకర్షించింది .
ట్రంప్ మీద కాల్పులు జరగ్గానే ఎక్కడి నుంచో ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ గభాల్న ముందుకురికి ట్రంప్ ను కవర్ చేస్తూ మెరుపులా ముందుకురికింది. అప్పటికే ఆమె ప్యాంట్ బెల్టుకున్న రివాల్వర్ స్పష్టంగా కనిపించింది .
అప్పుడు అర్థమైంది నాకు. ఆమె మామూలు పోలిస్ ఆఫీసర్ కాదు , ట్రెయిన్డ్ కమెండో అని … నిజంగా హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీలింగ్.
ట్రంప్ చుట్టూ మేల్ కమెండోస్ , ఆవిడొక్కతే ఫీమేల్ కమెండో …
ఎంత గట్స్
ట్రంప్ శరీరానికి తన శరీరాన్ని అడ్డు వేస్తూ దాదాపు ఈడ్చుకెళ్ళినంత వేగంగా గుంజుకెళ్లి బుల్లెట్ ప్రూఫ్ కారులో ఎక్కించి, స్పాట్ నుంచి సేఫ్టీ ప్లేస్ కి షిఫ్ట్ చేసింది, ఆ లేడీ కమెండోని చూసినప్పుడు మన కర్తవ్యం విజయ శాంతి గుర్తొచ్చింది.
ఆడది అబల కాదు సబల అని నిరూపించిన ఆ అమెరికన్ లేడీ కమెండో కి సెల్యూట్. కొసమెరుపు : ట్రంప్ కేరక్టర్ నాకు పూర్తిగా తెలీదు కానీ మనిషిని చూడగానే కమెడియన్ గుర్తుకొస్తాడు, హావభావాలు అలా ఉంటాయ్ మరి…
కానీ ఈ ఎపిసోడ్ లో మాత్రం నాకు ట్రంప్ ఒక వీరుడిలా అనిపించాడు. బుల్లెట్ చెవికి తాకి రక్తం కారుతున్నా ఏ మాత్రం భయపడకుండా.. భయపడుతున్న జనం వంక చూస్తూ పిడికిలి బిగించి’ ఫైట్ ఫైట్ ‘అని గర్జించటం ఏదైతే ఉందో ఎక్సలెంట్, అది కదా నాయకత్వ లక్షణం……….. By పరేష్ తుర్లపాటి
అది యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్… మాజీ అధ్యక్షుల్ని, అధ్యక్షుల్ని కాపాడే ప్రభుత్వ విభాగం… ఆ కమెండోల శిక్షణ కఠినంగా ఉంటుంది… సీఐఏ, ఎఫ్బీఐ వంటి సంస్థలు చెప్పినా పట్టించుకోదు ఈ సంస్థ… తమకు అప్పగించిన వీవీఐపీ సెక్యూరిటీయే వాళ్లకు ప్రధానం… దానికోసం ప్రాణాలకూ తెగిస్తారు…
పర్యటనలు, సమావేశాలకు ముందురోజే మొత్తం నిఘా వేసి, జల్లెడ పట్టి, క్లియరెన్స్ ఇవ్వాల్సిందే… మన ఎస్పీజీ తరహాలో… గన్స్ ఉన్న హెలికాప్టర్లతో నిఘా… చుట్టుపక్కల రహస్యంగా మొహరించే స్నైపర్స్… చాలా పకడ్బందీ వ్యవస్థ అది… ఐనా సరే, ట్రంపుకి కొద్దిదూరంలో ఓ బిల్డింగ్ పైన గన్‌తో ఆ ఆగంతకుడు కాల్పులు జరగడం అనే సందేహాలకు తావిస్తోంది…
అన్నట్టు ప్రస్తుతం 7800 మంది ఉన్న ఈ సర్వీస్ లీడ్ చేస్తున్నది మహిళే … పేరు కింబర్లీ … డైనమిక్ లేడీ… (ముచ్చట)
Share this Article