Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హిందువులకు మరో చారిత్రిక స్థలం దక్కింది… లక్క ఇల్లు కట్టిన 100 బీఘాలు…

February 6, 2024 by M S R

సనాతనులకి మరో విజయం దక్కింది! విషయము మహాభారత కాలం నాటిది! ఉత్తర ప్రదేశ్ లోని భాగపట్ జిల్లాలోని బర్నావ పట్టణంలో ఉన్న 100 బీఘాల భూమి హక్కులు సనాతనులకి చెందినవి అం  అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది! ఇంతకీ ఆ 100 బీఘాల భూమి విశిష్టత ఏమిటీ?
పాండవుల లక్క గృహం ఉన్న ప్రదేశం అది!
వనవాసం చేస్తున్న పాండవులు ఇక్కడి లక్క గృహంలో ఉన్నారు. దానిని దుర్యోధనుడు తగుల బెట్టడం, శ్రీ కృష్ణుని సలహా మేరకు భీముడు లక్క గృహం నుండి సొరంగం తవ్వడం, లక్క ఇంటిని దుర్యోధనుడు తగుల బెట్టిన తరువాత సొరంగం ద్వారా బయటపడడం మనం చదువుకున్నాం కదా! ఆ లక్క ఇల్లు, సొరంగం ఉన్న ప్రదేశమే భాగ్ పట్ జిల్లాలో ఉన్న బర్నావా అనే ప్రదేశం!
ఈ ప్రదేశం హక్కులు సనాతనులవి అంటూ 53 ఏళ్ల క్రితం స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు అక్కడి సనాతనులు. ముస్లింలు అది బద్రుద్దిన్ షా సమాధి కాబట్టి అది తమదే అని వాదించారు కానీ కోర్టు మహాభారత కాలం నాటి పాండవుల లక్క ఇల్లు, సొరంగం ఉన్న ప్రదేశమే అని తీర్పు ఇచ్చింది! ఇంకా వివరాల్లోకి వెళ్లాలంటే…

pandava

ఈ కేసు 1970 నుంచీ కొనసాగుతోంది… 1970లో బర్నావా నివాసి ముకీమ్ ఖాన్ మీరట్‌లోని సర్దానా కోర్టులో వక్ఫ్ బోర్డు అధికారి హోదాలో కేసు వేశాడు… ఐతే ఇది లక్షగృహ ఆనవాళ్లు అనీ, హిందువులకే చెందాలని లక్షగృహ (లక్క ఇల్లు) గురుకుల స్థాపకుడు కృష్ణదత్ మహారాజ్ ఈ కేసులో చేరాడు… లక్షగృహ దిబ్బపైనే షేక్ బద్రుద్దీన్ సమాధి, పెద్ద శ్మశానవాటిక ఉన్నాయని తన వాదన… కానీ ఈ స్థలంపై వక్ఫ్ బోర్డుకు హక్కులు ఉన్నాయనీ, కానీ హిందువులు ఆ శ్మశానవాటికను ధ్వంసం చేసి, హిందువుల పుణ్యక్షేత్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ముకీమ్ ఖాన్ ఆరోపణ…

ముకీమ్ ఖాన్ లేడు ఇప్పుడు… కృష్ణదత్ కూడా లేడు… ఇద్దరూ మరణించారు… కానీ వాళ్లిద్దరి తరఫున కేసు కొనసాగుతూనే ఉంది… హిందువుల వాదన ఏమిటంటే..? పాండవుల లక్క ఇల్లు ఇక్కడే ఉండేదనీ, దాన్ని తగులబెట్టి వాళ్లను హతమార్చే కుట్ర నుంచి ఒక సొరంగం ద్వారా పాండవులు తప్పించుకున్నారనీ, చాలా తవ్వకాల్లో ఆధారాలు కూడా దొరికాయని హిందూ పక్షం వాదన… అవన్నీ వేల ఏళ్ల నాటివి, హిందూ నాగరికత ఆనవాళ్లు అనేది ఆ వాదన సారాంశం…

Ads

pandava

ఆర్కియాలజికల్ సర్వే 1952లో తవ్వకాలు జరిపితే 4500 ఏళ్ల నాటి కుండలు లభ్యమయ్యాయని చెబుతారు… మహాభారత కాలం కూడా అదేనని హిందువులు నమ్ముతారు… ఈ గుట్ట కింద ఓ గుహ కూడా ఉంది… 2018లో అక్కడ తవ్వకాలు జరిపితే మానవ అస్థిపంజరాలు, ఇతర మానవ అవశేషాలు బయటపడ్డాయి… ఓ భారీ ప్యాలెస్ గోడలు, నివాసాలు కూడా బయటపడ్డాయనే వార్తలు కూడా వచ్చాయి…

న్యూస్ సోర్స్ :: https://navbharattimes.indiatimes.com/state/uttar-pradesh/baghpat/baghpat-lakshagriha-majar-case-hidu-side-got-owner-right-in-land-dispute-know-here-detail/articleshow/107426427.cms

మీకు లక్క ఇల్లు కథ తెలుసు కదా… దుర్యోధనుడు అధికారం తనకే దక్కాలనీ, పాండవులు బతికి ఉన్నంతకాలం తనకు ముప్పేనని భావించి, పాండవులను కాల్చి చంపాలని ప్రణాళిక వేస్తాడు… తన మంత్రి చేత ఓ లక్క ఇల్లు నిర్మిస్తాడు… లక్క, మైనం, నెయ్యి, నూనె కలిసి నిర్మిస్తారు దాన్ని… వారణావతంలో నిర్మించిన ఈ ఇంట్లో పాండవులు నివసిస్తుంటారు… ఓ రాత్రి ఆ ఇంటిని తగులబెట్టిస్తాడు దుర్యోధనుడు… అయితే కురురాజ్యం ప్రధాని విదురుడు ఈ సమాచారాన్ని ముందే కుంతికి అందించడంతో, ఓ సొరంగం తవ్వించి పెడుతుంది ఆమె… ఆ మంటల నుంచి తప్పించుకుంటారు… ఇదీ కథ… (పార్థసారథి పోట్లూరి)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సూసైడ్ ఫ్రూటింగ్! నేరేడుపళ్లు విరగకాస్తే సీరియస్ ఎల్‌నినో‌ ఖాయం!?
  • I Stand with Srinidhi Viplava Sri … ఎందుకంటే..?
  • సింగ్ గీతం – బోలెడు బ్లండర్స్, అది ఎక్కడెక్కడ దెబ్బతిన్నదంటే..?
  • కాళ్లల్లో కట్టెలు – ఆత్మరక్షణలో కిషన్‌రెడ్డి – తేలిపోయిన పేలవ వివరణ
  • BRS + Janasena + BJP … తెలంగాణ ద్వేషి పవన్ గోకుతూనే ఉన్నాడు…
  • అంతటి సిల్క్ సయ్యా అనడిగితే… నై అనే బావమరిది ఎవడుంటాడు..?
  • అనుకున్నదే – రక్తికట్టని ‘సింగ్ గీతం’ – మరీ దయనీయం వసూళ్లు
  • A Global Traveller — మోడీ టూర్ల సెంచరీ — 78 దేశాల పర్యటనలు
  • రాజకీయ కలకలం – ఠాక్రేకు మరో భంగపాటు? – జార్ఖండ్‌లో మరో ఘట్టం
  • BJD — పట్నాయక్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం — వారసుల్లేరు, నాయకుల్లేరు

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions