అందరూ మోనాల్ ఔట్ కావాలనే కోరుకుంటారు… వోట్లు తక్కువగానే పడతాయి… కానీ బిగ్‌బాస్ ఒప్పుకోడు… ఇన్నిరోజులుగా ఆమెకు ప్రేక్షకుల నుంచి పెద్దగా మద్దతు దొరక్కపోయినా సరే, బిగ్‌బాస్ తనను కాపాడుతూనే ఉన్నాడు… ఎవరెంత గింజుకున్నా తనను బయటికి పంపించడు… తనకు బదులు ఎవరెవరినో బలి తీసుకుంటాడు… ఇది అందరికీ తెలిసిందే కదా… మరి బిగ్‌బాస్ టీంతో ఆమె ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మహిమ కావచ్చు బహుశా…
కానీ ఆమె వ్యవహార ధోరణిలో మార్పు కనిపిస్తోంది… అఖిల్‌తో ప్రేమాయణానికి కత్తెర పడింది… ఆమె విపరీతమైన నిర్వేదంలో పడిపోయింది… ఇక బిగ్‌బాస్‌కు ఆమె అవసరం తీరిపోయినట్టుంది… అందుకే ఇక ఔట్ చేస్తాడు, చేయకతప్పలేదు అనుకున్నాం కదా… ఆమెకు వచ్చే వోట్లు, ఆమె పట్ల సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందనను బట్టి అందరూ ఇదే అంచనా వేశారు… కాదు, ఆమె సూట్ కేసు సర్దుకున్నది అని కూడా సమాచారం…
Ads
కానీ అది తప్పు… తూచ్… ‘ముచ్చట’ కూడా అదే మాయలో పడి, ఆమె ఔట్ అయిపోయినట్టుగా రాసింది… కానీ నిజం ఏమిటంటే… ఈసారి కూడా బిగ్‌బాస్ మోనాల్‌ను కాపాడాడు… నిజానికి హారిక తన భుజాల మీద మోసి, ఓ స్థంభంలా నిలబడి, ఆమెను కెప్టెన్‌గా గెలిపించి, అఖిల్ తనను అకారణంగా నిందిస్తున్న సందర్భంలో, ఆమెను ఛీత్కరిస్తున్న తరుణంలో కూడా ఆమె ఓ విరాగిలా, మెచ్యూర్డ్‌గా కనిపించింది.., పోయేముందు మంచి మార్కులు కొట్టేస్తుంది సుమా అని అందరూ అనుకున్నారు…
అయితే మోనాల్ కథ ముగియలేదు… గతంలోలాగే ఆమెకు బదులుగా ఎవరెవరినో బలి తీసుకున్నట్టుగానే… ఈసారి లాస్యపై వేటు పడింది… నిజానికి లాస్య వీక్ కంటెస్టెంటు ఏమీ కాదు… ఎక్కువగా వంటింట్లో కనిపించినా సరే, ఫిజికల్ టాస్కుల్లో పెద్దగా రాణించకపోయినా సరే… ఆమె మీద ప్రేక్షకుల్లో పెద్దగా వ్యతిరేకత ఏమీ కనిపించలేదు… పైగా నోయెల్ మార్కు అభిజిత్ గ్రూపులో ప్రధాన సభ్యురాలు… ఆమె అయిదుగురు ఫైనలిస్టుల్లో ఉంటుందని కూడా అనుకున్నారు అందరూ….
అందరూ అనుకున్నట్టు చేస్తే తనను బిగ్‌బాస్ అని ఎందుకంటారు..? పంపించేశాడు… ఇదీ ట్విస్టు… లాస్యకు షాక్… నోయెల్ గ్రూపుకి షాక్… ఈసారి మోనాల్ పని అయిపోయిందని అనుకున్నవాళ్లకు షాక్… బహుశా ఈ షో చివరి రోజుల్లో అభిజిత్ వర్సెస్ అఖిల్ వర్సెస్ అవినాష్ గ్రూపుల నడుమ బలమైన స్పర్థ కోరుకున్నాడేమో బిగ్‌బాస్… ఇప్పుడిక అభిజిత్, హారిక… అఖిల్, సొహెయిల్… అవినాష్, అరియానా… గ్రూపుల నడుమ అటూఇటూ మోనాల్… ఇదీ ఈక్వేషన్…
ఇక్కడ ఓ చిన్న విషయం చెప్పుకోవాలి… అసలు మోనాల్‌కు బిగ్‌బాస్ ఎందుకింత మద్దతుగా నిలుస్తున్నాడు… తనతో కుదిరిన ఒప్పందమేనా..? లేక తను ఉంటేనే గేమ్‌లో ఇంట్రస్టు చచ్చిపోకుండా ఉంటుందని అనుకున్నాడా..? మరి లాస్య ఏం పాపం చేసింది..? ప్రేక్షకుల తీర్పు మేరకే అని ఒట్టు పెట్టుకున్న నాగార్జునను కూడా బిగ్‌బాస్ టీం చీట్ చేసిందా..? అసలు ఈ మొత్తం గేమే చీటింగా..? ఏది నిజం..?!
Share this Article