Bharadwaja Rangavajhala……….. అనగనగా … ఓ ప్రేమజంట … తామే ముహూర్తం పెట్టుకుని … ఏ తత్ ముహూర్తానికి వివాహమాడదలంచిరి…
ఎదురుచూచెను … ఎదురుచూచెను .. ఎదురుచూచెను …
ఆతండు రాడాయెను. చేత ఫోను ఉన్ననూ … చేయుటకు ఎందుచేతనో మనస్సు అంగీకరించలేదు… అందుచేత చేయకనే వేచి ఉండెను.. మాటలాడుటకు సైతమూ ఎవరూ లేని ఆ గదిలో ఒంటరిగా అలా ఆయొక్క కుర్చీలో కూర్చుని ఎదురుచూచుచూ మాత్రమే ఉండెను.
Ads
దాదాపు నాలుగు నుంచీ అయిదు గంటలు గడచిన మీదట సదరు ప్రియుడు … చెమటలు కక్కుచూ … పరుగులిడుతూ వచ్చెను.
వచ్చి ఆమె ఎదుట ఉన్న కుర్చీలో కూలబడెను. అతని వైపు ఆమె ప్రసన్నవదనయై చూచెను తప్ప ఎట్టి కోపప్రదర్శనయూ చేయలేదు.
అతను ఆయాసముతో బాధపడుతూ ….
ఇటుల చెప్పదొడంగెను…
అతను ః సారీ బేబీ … నేనలా చేసి ఉండకూడదు …
ఆమె ః ఏయ్ బేబీ … పర్వాలేదు
అతను ః లేదు బేబీ నేను నిన్ను చాలా బాధ పెట్టాను …
ఆమె ః అయ్యో బేబీ …. ఈ రోజు మన ఇద్దరికీ ఎంత ఇంపార్టెంటో మన ఇద్దరికీ తెల్సు. ఇంత ఇంపార్టెంట్ రోజు సమయానికి రాలేకపోయావంటే … ఇంకెంత ఇంపార్టెంట్ పన్లో నువ్వు ఉండి ఉంటావో కదా … అది నేను అర్ధం చేసుకోగలను … అందుకే నీకు నేను ఫోన్ చేయలేదు … నాకు అలాంటి ఇంపార్టెంట్ పనులు లేవు కనుక వచ్చేసి … కూర్చున్నాను. పర్వాలేదు ..
అతను ః లేదు నాదే తప్పు … నేను ఏ పరిస్తితుల్లో రాలేకపోయానో అసలు నేనేం చేస్తానో నీకు తెల్సినా అర్ధం చేసుకోగలవు అనుకుంటున్నాను …
ఆమె ః అక్కర్లేదు … అవన్నీ నేను తెల్సుకోవాలనుకోవడం లేదు … నువ్వు ఏం చేస్తున్నావో తెల్సుకోవాలని అనుకుంటున్నానంటే … నేను చనిపోతున్నానని అర్ధం …
అతను ః బేబీ ….
ఆమె ః ఎస్ బేబీ ….
…….
ఈ సన్నివేశం విక్రమ్ అను పేరుతో ప్రస్తుతం మార్కెట్టులోకి వచ్చిన చిత్రములో ఉండును. ఈ సన్నివేశములో ఆ అమ్మాయిని చూచినప్పుడు … ఆమె మాటలు వింటున్నప్పుడు అప్రయత్నముగా నా కనులు చెమర్చెను.
ఆ నటి ఎవరోగానీ … పేరు కూడా తెల్సుకోవాలనిపించలేదు … అసలా సన్నివేశము కల్పన చేసిన రచయితకూ దర్శకుడుకీ కూడా ఆమెతో పాటు దణ్ణాలు …
Share this Article