Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్చ్… గంతులు వేసే డ్యూయెట్లు లేని సీరియస్ లాయర్ విశ్వనాథుడు…

October 17, 2024 by M S R

S D లాల్- NTR కాంబినేషన్లో వచ్చిన విజయవంతమైన రీమేక్సులో ఒకటి 1978 లో వచ్చిన ఈ లాయర్ విశ్వనాథ్ . నిజాయితీకి మారుపేరుగా న్యాయసేవ చేస్తున్న లాయర్ gangster గా మారి , దోషుల్ని పోలీసులకు పట్టించే కధానాయకుడి పాత్ర లాయర్ విశ్వనాథ్ . లాయరుగా NTR చాలా హుందాగా , బేలన్సుడిగా నటించారు .

నాకు బాగా నచ్చిన పాత్ర , నటన . Gangster అయిన తర్వాత కూడా ఆయనకు గంతులు వేసే డ్యూయెట్లు లేకపోవడం విశేషం . చాలా సీరియస్ కేరెక్టర్ . NTR తో సమానంగా పేరు వచ్చిన పాత్ర కచేరీ కొండయ్యది . NTR కు ధీటుగా , లాయర్ విశ్వనాథ్ భక్తుడిగా ఈ పాత్రలో సత్యనారాయణ రామ భక్త హనుమానుగా అద్భుతంగా నటించారు . NTR- సత్యనారాయణ కాంబినేషన్ నిప్పులాంటి మనిషి సినిమాలో కాంబినేషన్ లాగా చాలా బాగుంటుంది .

హిందీలో సూపర్ హిట్టయిన విశ్వనాథ్ సినిమాకు రీమేక్ మన లాయర్ విశ్వనాథ్ సినిమా . హిందీలో శతృఘ్న సిన్హా , రీనారాయ్ , ప్రాణ్ , ప్రేమనాధ్ , ఇఫ్తెకర్ ప్రధాన పాత్రల్లో నటించారు . ప్రాణ్ పాత్రను సత్యనారాయణ వేసారు . ప్రాణ్ కన్నా బాగా నటించారేమో ! ఆ వరుస రీమేక్సులో హిందీలో ప్రాణ్ వేసిన పాత్రలను అన్నీ ఆల్మోస్ట్ సత్యనారాయణే వేసారు . తెలుగు ప్రాణ్ !

Ads

భారీ తారాగణమే ఉంది . జయసుధ , కవిత , పండరీబాయి , పుష్పకుమారి , శరత్ బాబు , ప్రభాకరరెడ్డి , అల్లు రామలింగయ్య , సాక్షి రంగారావు , రమణమూర్తి , సిలోన్ మనోహర్ , ధూళిపాళ , రాజనాల , రామదాసు , రామ్మోహన్ , రంగనాధ్ , ముక్కామల , కె వి చలం , మాడా , తదితరులు నటించారు . Once in a blue moon అనే సిలోన్ మనోహర్ పాత్రను ప్రేక్షకులు మరచిపోరు . హార్డ్ కోర్ క్రిమినల్ గా బాగా నటించారు .

గొల్లపూడి మారుతీరావు డైలాగులు బాగా పేలుతాయి . ముఖ్యంగా కోర్టు సీనుల్లో బాగుంటాయి . సత్యం సంగీత దర్శకత్వంలో పాటలు బాగుంటాయి . ముఖ్యంగా సత్యనారాయణ పాత్ర పాడే రాముడెప్పుడూ రాముడే పాట చాలా బాగుంటుంది . సి నారాయణరెడ్డి సాహిత్యం , సత్యనారాయణ నటన , పాటతో పాటు డాన్స్ చిత్రీకరణ అన్నీ బాగుంటాయి .

కలకాలం ఉండవులే కన్నీళ్ళు పాట కూడా చాలా బాగుంటుంది . మిగిలిన పాటలు కూడా థియేటర్లో శ్రావ్యంగా బాగుంటాయి . పాటల్లో జయసుధ బాగా నటించింది . ఆమెకు తొలిరోజుల్లో గ్లామర్ పాత్రల్లో పేరు తెచ్చిన సినిమాల్లో ఒకటి ఇది .

NTR డ్రెస్సుల్ని ఆకర్షణీయంగా కుట్టిన విజయవాడ యాక్స్ టైలర్సుని అభినందించాలి . కాకపోతే నావే బాగా కుట్టలేదు . గుంటూరు నుండి విజయవాడకు వెళ్ళి మరీ బట్టలు ఇచ్చా NTR బట్టలు స్టైలిష్ గా కుడుతున్నారు కదా అని . తర్వాత అర్ధమయింది నేను NTR కాదు కదా అని !

తమిళంలో కూడా రీమేక్ అయింది . తమిళంలో రజనీకాంత్ , రాధ హీరోహీరోయిన్లుగా నటించారు . సినిమా యూట్యూబులో ఉంది . NTR , సత్యనారాయణ అభిమానులు చూడవచ్చు . ఇదే టైటిలుతో ఈమధ్య కాలంలో ఆలీ ఓ సినిమా నటించారు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు … (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సింగిల్ కాలమ్ దాటని కథ… నో, నో… పోస్టుకు ఎక్కువ- కథకు తక్కువ…
  • ‘సింహస్వప్నం’… పేరుకు జగపతిబాబు హీరో… కృష్ణంరాజుదే హవా…
  • చేదు వాస్తవం- నిష్ఠుర నిజం… కేసీయార్ పాలన తీరుతోనే ‘సింగరేణి చీకట్లు’…
  • ట్రంపు ఎంత గోకుతున్నా మోడీ ఎందుకు మౌనంగా ఉన్నాడంటే..?
  • ఒక అచ్యుతానందన్… ఒక శిబూ సోరెన్… పద్మాల్లో మోదీ మార్క్ పరిణతి..!
  • దర్శకుడు మారుతికి కొత్త తలనొప్పి… ఫ్యాన్స్ నుంచి కొత్త నిరసన…
  • ప్రియుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు… ఇదీ అలాంటి స్టోరీయే…
  • 120 రోజులు సముద్ర గర్భంలో… సెయిలర్ కాదు, ఏరోస్పేస్ ఇంజనీర్…
  • అత్యంత సంక్లిష్టత..! విదేశీ నిపుణులనూ ఆశ్చర్యపరుస్తున్న పోలవరం..!!
  • నిర్మూలన..! కనుమరుగు కానున్న హిస్టారికల్ పాంబన్ రైల్వే బ్రిడ్జి..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions