పార్ధసారధి పోట్లూరి …. మధ్య ప్రాచ్యం మంట. పార్ట్4… హమాస్ ని నిర్వీర్యం చేసినా హెజెబోల్లా సిద్ధంగా ఉంది.. ఇరాన్! వెంటనే లేబనాన్, సిరియాల మీద వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్!
ఏదో పెద్దదే ప్లాన్ చేస్తున్నారా? చూడబోతే అవుననే సమాధానం వస్తున్నది! UAE- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్! UAE తన ఎయిర్ బేస్ లని ఖాళీ చేసింది. అంటే US ఎయిర్ ఫోర్స్ కి కావాల్సినంత స్థలం కోసం తన ఎక్విప్మెంట్ ని తీసేసి ఖాళీ చేసింది. సో! ఇరాన్ మీద దాడి చేయడానికి అమెరికా, ఇజ్రాయెల్ లు నిర్ణయించుకున్నట్లు గా స్పష్టమయిన సంకేతాలు కనిపిస్తున్నాయి!
మరో వైపు UAE రేవులని కూడా ఖాళీ చేస్తున్నది. అంటే క్రూడ్ ఆయిల్ నింపుకున్న టాంకర్స్ ని వెంటనే అక్కడి నుండి పంపించేస్తున్నది UAE… అమెరికన్ నౌకా దళం UAE గుండా ఇరాన్ మీద దాడి చేయడానికి వీలుగా తన రేవులని సిద్ధం చేస్తున్నది UAE!
Ads
మరోవైపు ఇరాన్ హార్మోజ్ స్ట్రెయిట్ (హార్మోజ్ జలసంధి) దగ్గర సీ మైన్స్ ని మరియు ట్రాప్స్ (చైనా ఏర్పాటు చేసినట్లు) ని ఏర్పాటు చేసింది అమెరికన్ నౌకా దళం తమ వైపు రాకుండా అడ్డుకోవడానికి. అఫ్కోర్స్ ఇజ్రాయెల్ దగ్గర వీటికి విరుగుడు మందు ఉంది.
హమాస్ కి చైనా ఆయుధాలు సరఫరా చేసినట్లు తెలుస్తున్నది.అయితే పూర్తి స్థాయిలో ఆధారాల కోసం ఎదురుచూస్తున్నది ఇజ్రాయెల్. ప్రస్తుతం గాజాలో ప్రతి ఇంటినీ సెర్చ్ చేస్తున్నది ఇజ్రాయెల్ ఆర్మీ. ఈ సోదాలలో చైనా పాత్ర ఉందా లేదా అని బయట పడవచ్చు.
పర్షియన్ గల్ఫ్ లో యుద్ధం మొదలవబోతున్నది అన్నమాట! ఇది ఇప్పటికిప్పుడు మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీయకపోవచ్చు కానీ దానికి కావాల్సిన పునాది రాయి పడబోతున్నది. నేను రష్యా గురుంచి వరసగా కధనాలు ఎందుకు వ్రాస్తున్నాను అంటే ఇప్పటి వరకూ రష్యాని రెండవ సైనిక శక్తిగా చూపిస్తున్నది మీడియా కానీ వాస్తవం వేరుగా ఉంది అని తెలియడానికి!
ఇప్పుడు రష్యా ఇరాన్ కి అండగా నిలబడి సైనిక సహాయం చేస్తుందా? చేయలేదు! ఉక్రేయిన్ తో సుదీర్ఘ యుద్ధం వలన రష్యా బలహీనపడ్డది. రష్యా కాకుండా చైనా చేస్తుందా? చైనా తన వ్యాపారాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో చూసుకుంటుంది. రష్యాలాగా ఇరాన్ ఎంత నష్టపోతే చైనా అంత లాభపడుతుంది. మరి భారత్ పరిస్థితి ఏమిటి? తరువాతి భాగంలో తెలుసుకుందాము!… Cont.. part 5.
Share this Article