విజయనగరం జిల్లా… బొబ్బిలి… ఏపీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్… అక్కడ ఓ ఉపాధ్యాయుడికి తరచూ తెలుగులో సెలవు చీటి రాయడం అలవాటు… అనగా లీవ్ లెటర్… హఠాత్తుగా ఈయనకు ఓ చిన్న సమస్య వచ్చింది ఈవిషయంలో… మళ్లీ లీవ్ పెట్టాలి… ఎలా రాయాలో అర్థం కావడం లేదు… ఆయన రాధాకృష్ణ అనే ఇంకో పీజీ టీచర్ దగ్గరకు వెళ్లి… గురూ, కాస్త లీవ్ లెటర్ రాసిపెట్టండి అనడిగాడు…
అదేమిటండీ, మీరు అంత అలవోకగా రాసేస్తారు, నన్ను అడగడం ఏమిటి అంటాడు ఆయన… ఈయన కారణం చెప్పాడు… బిడ్డ రజస్వల అయ్యింది… అంటే పెద్దమనిషైంది… అప్పట్లో చిన్న ఫంక్షన్ కూడా చేసేవాళ్లు… అదుగో ఆ ఫంక్షన్ కోసం ఈయన ఊరికి వెళ్లాలి, కాబట్టి సెలవు కావాలి, దానికి తెలుగులో గాకుండా ఇంగ్లిషులో సెలవు పత్రం రాసివ్వాలి… దాన్ని ఎబ్బెట్టుగా లేకుండా ఎలా రాయాలో ఈయనకు అర్థం కావడం లేదు… సరే, రాధాకృష్ణ టీచర్ అసలైన కారణాన్నే కాస్త పెద్ద మనుషుల భాషలో రాసి ఇచ్చాడు… ఈయన తనకు కావల్సిన తేదీలు వేసుకుని, కింద సంతకం పెట్టి ప్రిన్సిపాల్‌కు ఇచ్చాడు… అక్కడికి కథ సుఖాంతం…
ఈయన చాలా కాజువల్‌గా కారణాలు ఎవడు చదువుతారండీ… ఎవరి అవసరం గురించి ఎవరిక్కావాలి… తేదీలు చూస్తారు, ఎస్ ఆర్ నో చెబుతారు, అంతేకదా… అందుకని అదే ఫార్మాట్‌లో అలాగే రాసేస్తున్నాను అన్నాడీయన… సదరు ప్రిన్సిపాల్‌కు నోటమాట రాలేదు… స్కూళ్లల్లో పిల్లలు కూడా ఒకేతరహా కారణం ఒకరిని చూసి మరొకరు రాసేస్తుంటారు తెలుసు కదా… అదండీ సంగతి… (ఈ రాధాకృష్ణ ఎవరో కాదు… సీనియర్ జర్నలిస్టు A. Saye Sekhar తండ్రి గారు… సో, తను ఫేస్‌బుక్‌లో ఇంగ్లిషులో రాసుకున్న పోస్టుకు నా తెలిసీ తెలియని తెలుగు అనువాదం…)
Ads
ఇది రాస్తుంటే మరొకటి గుర్తొచ్చింది… హైదరాబాదులోనే ఓ పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ… చాలామంది ఉద్యోగులు నిర్దేశిత టైమ్‌కన్నా ముందే ఆఫీసు నుంచి వెళ్లిపోతున్నారు… దాంతో హెచ్ఆర్ వాళ్లు కాస్త భయం, పద్దతి ఉండేందుకు ఓ రిజిష్టర్ పెట్టేసి, ఎవరెవరు ఏ కారణాలతో ఏ టైమ్‌కు ఆఫీసు నుంచి వెళ్లిపోతున్నారో రాయమన్నారు… వారం రోజుల తరువాత హెచ్ఆర్‌లో ఉండే ఓ పెద్దాయన ఆ కారణాలను పరిశీలిస్తూ షాక్ తిన్నాడు… ఓ మహిళ పాపం బహిష్టు నొప్పితో ఎర్లీగా ఆఫీసు నుంచి వెళ్లిపోతున్నట్టు కారణం ఉన్నదున్నట్టు రాసింది… ఇక ఆ దిగువన ప్రతి ఒక్కరూ ఐడీ నంబర్, పేరు రాయడం… కారణం దగ్గర డూ, డూ , సేమ్, సేమ్ అని రాసేసి గొర్రెదాటు సంతకాలు పెట్టేశారు… మగబహిష్టులు కూడా… అదండీ సంగతి…!!
Share this Article