Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ హిమాలయ పల్లెలో వెలుగులు నింపిన సోషల్ మీడియా పోస్టు..!

November 23, 2024 by M S R

.
ఆ ఊరికి.. అతనే థామస్ అల్వా ఎడిసన్!

ఆ ఊరి చీకట్లలో వెలుగులు నింపిన సోలార్ వెలుగు.. ఆ టీచర్!

ఉపాధ్యాయుడంటే.. కేవలం బళ్లో పాఠాలు చెప్పేవాడే కాదని… అంతకుమించి సమాజాన్నీ చైతన్యవంతం చేసేవాడని నిరూపించాడు. సమాజానికేది అవసరమో దాన్ని గుర్తించి.. వారి బతుకుల్లోని అంధకారాన్ని పారద్రోలి వెలుగులు నింపాడు.

Ads

అది భారత సరిహద్దు ప్రాంతం. మయన్మార్ బార్డర్ లోని నాగాలాండ్ లోని షిన్యూ అనే ఓ మారుమూల గ్రామం. ప్రతీ ఏడూ దేశానికి దీపావళి ఎలాగో.. వారికి ఫిబ్రవరి పదహారో తేదీనే ప్రతీఏటా దీపావళి. అలా ఆ ఊరిలో దీపాలు వెలిగించి దీపావళికి కారకుడైనవాడు జాన్ ఖంగ్న్యూ.

షిన్యూ అనే గ్రామం … మోన్ జిల్లా కేంద్రం నుంచి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేని ఈ గ్రామానికి 12 గంటలపాటు ప్రయాణం చేస్తేనేగానీ చేరుకోలేని పరిస్థితి. ఆరు గంటలు ప్రయాణం చేస్తేనేగానీ.. దగ్గరలో ఉన్న టోబు అనే మరో పట్టణానికి కనెక్ట్ కాలేరు ఇక్కడి కొన్యాక్ నాగా కమ్యూనిటీకి చెందిన 60 కుటుంబాల జనం.

సాయంసంధ్య వేళ దాటిందంటే చాలు చిమ్మచీకట్లనుభవిస్తున్న ఈ గ్రామాన్ని 2002లో అధికారికంగా పంచాయతీగా గుర్తించినా… రాత్రివేళ ఎలక్ట్రికల్ లైట్స్ కు మాత్రం నోచుకోలేదు. దీంతో ఊరి జనం తమ కాలకృత్యాల వంటివన్నీ కూడా… వెలుగున్నంతలోనే ముగించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇదంతా అటవీప్రాంతం. మోబైల్ సిగ్నల్సుండవు. సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకోరాదు.

ఇక్కడో చర్చ్, ఓ ప్రాథమిక పాఠశాల, ఓ అతిథి గృహం, ఓ కమ్యూనిటీ హాల్ ఇవి మాత్రమే కనిపిస్తాయి. పిల్లలు ఈ ఊళ్లో చదువుకోలేక.. హాస్టళ్లలో ఉంటూ బయట పట్టణాల్లో చదువుకోవాల్సిన పరిస్థితి. అయితే ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసే జాన్ ఖంగ్న్యూ సోషల్ మీడియా పోస్ట్‌ ఈ ఊరికి వెలుగులు పంచింది.

33 ఏళ్ల జాన్ ఖంగ్న్యూ ఆరేళ్ల క్రితం షిన్యూ ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయుడిగా బదిలీపై రావడం.. ఈ గ్రామం చీకట్లను పారద్రోలడానికి కారణమైంది. ఒక్కోసారి షిన్యూకు సమీపంలోని టబు అనే పట్టణం నుంచి వాహనాల్లో రావడానికే 6 గంటలు పడితే.. కాలిబాటన చేరుకోవాలంటే.. జాన్ ఖంగ్న్యూకు 12 గంటల సమయం పట్టేదట.

తన ఫోన్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి కూడా వీల్లేకుండా ఉండేది. అప్పుడు జాన్ .. ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ గ్రామాన్ని చూసి జస్ట్ నిర్ఘాంతపోయాడు.. అసలు వీళ్లిలా ఎలా బతుకుతున్నారా అన్న మథనం ఆయనలో మొదలైంది.

షిన్యూ జనం ఈతిబాధలను తన బాధలుగా ఫీలయ్యాడు. వెంటనే.. సోషల్ మీడియానెంచుకున్నాడు. కరెంట్ లేకపోవడం, మోబైల్ నెట్ వర్క్ లేకపోవడం, విద్యా, వైద్యం దుస్థితి, రోడ్లు సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలన్నీ ఏకరువు పెడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.

ఆ పోస్ట్ ను జాన్ ఫేస్ బుక్ స్నేహితుడు చూసి దాన్ని షేర్ చేశాడు. అది కాస్తా.. 2019లో గ్లోబల్ హిమాలయన్ ఎక్స్‌పెడిషన్ (GHE) కంటబడింది. ఈ సంస్థ.. దేశంలోని మారుమూల గ్రామాలను విద్యుదీకరించడానికి మైక్రో సోలార్ గ్రిడ్‌లను ఏర్పాటు చేయడంలో ప్రసిద్ధి చెందింది.

GHE సూచనల ప్రకారం.. జాన్ తానే స్వయంగా షిన్యు గ్రామంలోని విద్యుత్ అవసరాలపై సర్వే నిర్వహించాడు. మొత్తం 23 లక్షల ఖర్చుతో.. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ప్రాజెక్ట్‌ను అమలు చేయడానికి GHE ముందుకొచ్చింది. మోన్ జిల్లా యంత్రాంగంతో GHE ప్రతినిధుల బృందం సంప్రదించింది. ఎంతోకాలం నుంచి యత్నిస్తున్నా తమ మీంచి కాని పనికి అధికారులూ సరేనన్నారు.

ఇంకేం.. గ్లోబల్ హిమాలయన్ ఎక్స్ పెడిషన్ సభ్యులు, ఇంజనీర్‌లు, జిల్లా అధికారిక బృందం 10 మంది సోలార్ ప్యానెల్స్‌తో 16 గంటల పాటు ప్రయాణించి… షిన్యూ చేరుకున్నారు. ఎక్కడిక్కడ సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయడంతో ఇప్పుడు ప్రతీ ఇంట్లో వెలుగులు నిండటంతో పాటే.. పాఠశాల, చర్చ్, కమ్యూనిటీ హాల్ ఇలా అన్నిచోట్లా లైట్లు వెలిగాయి.

ఇప్పుడిక్కడ ప్రతి ఇంట్లో 170 వాట్ల సోలార్ ప్యానెల్, బ్యాటరీ, రెండు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, రెండు ట్యూబ్ లైట్లు, మూడు ఎల్ఈడీ బల్బులున్నాయి. 11 సోలార్ వీధి దీపాలనూ ఏర్పాటు చేశారు. ప్రతీనెలా వందరూపాయల చొప్పన నిర్వహణ కోసం ప్రతీ ఇంటినుంచి వసూల్ చేస్తుండటంతో పాటు.. వీటి నిర్వహణ బాధ్యతలను చూసేందుకు గ్రామానికే చెందిన కొందరు యువకులకు ప్రత్యేక శిక్షణనిచ్చారు.

ఒక ఉపాధ్యాయుడి చొరవ… వైరలైన ఓ సోషల్ మీడియా పోస్ట్… ఏళ్ల తరబడీ అంధకారంలో మగ్గిన ఓ గ్రామ దుస్థితిని ఎలా మార్చాయి… సంకల్పసిద్ధి ఉంటే అధికారిక వ్యవస్థలు చేయలేని పనులను ఇండిడ్యువల్స్ కూడా ఎలా సాధించవచ్చో చెప్పే స్ఫూర్తి కథనమిది. శభాష్ జాన్ ఖంగ్న్యూ!!    ( రమణ కొంటికర్ల )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • KTR వింత విమర్శలు… పోలవరం నాణ్యతతో తెలంగాణ పార్టీలకు ఏం పని..?!
  • ఇన్‌సెన్సిబుల్, ఇన్‌సెన్సిటివ్ స్కిట్… ఇందులో విజ్ఞానం ఏముందిర భయ్..?!
  • ట్రంప్ – పుతిన్ భేటీ… తక్షణ ప్రయోజనం ఇండియాకే… ఎలాగంటే..?
  • ట్రంప్- పుతిన్ భేటీ ఉక్రెయిన్ శాంతికై కాదు… అసలు చర్చ ఆర్కిటిక్..!!
  • బారా ఖూన్ మాఫ్..! ఎవరు చేసిన పాపాన వాళ్లే పోతారు… అంతే ఇక..!!
  • చప్పట్లు, శాలువాలు, దండలు, అవార్డులు దక్కాల్సింది రాధికకు కూడా..!!
  • మోహన్‌లాల్ ఖాళీ చేసిన కుర్చీలో… తొలిసారిగా ఓ ఫైర్ బ్రాండ్..!!
  • తోపు హీరోలైనా సరే జనం తిరస్కృతి… పాన్ ఇండియా ఫెయిల్యూర్లు..!
  • మూడు ముళ్లు, ఏడడుగులకు ముందే… విడాకుల రాతకోతలు ..!!
  • రేవంత్‌రెడ్డిపై కాదు… అందెశ్రీ వ్యాఖ్యలు తన గురువు శ్రీరామ్ గురించి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions