మనిషి సింహం, పులి, ఏనుగులాగా కాకుండా తొడేలులాగా ఉండాలి; ఒక్కరోజయినా, సమూహంలో, ప్రేమలో, స్నేహంలో, బంధంలో…
తొడేళ్ళు 4 నుండి 36 వరకు గుంపుగా జీవిస్తాయి. ఒంటరిగా తొడేలు అసలు ఉండలేదు, ఉండవు. ఈ భూమిపై నివసించే జంతువుల్లో, సమూహం కోసం ప్రాణం త్యాగం చేసే జంతువు, నాకు తెలిసి, ఒక్క తొడేలు మాత్రమే.
ఒకసారి ఆడ తొడేలు, మగ తొడేలుతో బంధం ఏర్పడిన తర్వాత, మగ తొడేలు మరణించినా, ఇంకే మగ తొడేలుతో సంబంధం పెట్టుకోదు. ఆడ- మగ తొడేలుల బంధం అంత బలంగా ఉంటుంది. పిల్లల సంరక్షణకు కూడా తొడేలు అత్యంత ప్రాధాన్యత ఇస్తాయి. తొడేలు పుట్టిన దగ్గర నుండి, వాటి సంతానం, కుటుంబం మొత్తం కలిసి ఒక గుంపుగా ఉంటాయి, చచ్చేదాకా కూడా ఆ బంధం ఎటూ కదలదు.
Ads
వేటాడినప్పుడు, భాగాల దగ్గర గొడవలు పడినా, అలిగినా, చంపుకునేంతవరకు గొడవలు ఉన్నా, విడిపోవు. కలిసే ఉంటాయి. కలిసి బతకటం, తొడేలుల విజయ రహస్యం.
సింహాన్ని, పులిని, చివరకు ఏనుగుని కూడా భయపెట్టగలిగేవి తొడేళ్ళు మాత్రమే. సమూహంగా ఉంటూ, సింహం, పులి, ఏనుగులను వేటాడి, చంపుతాయి తొడేళ్ళు. ఎంత శక్తివంతమైన జంతువుల మీద అయినా గెలవటానికి తొడేలుల ప్రధాన కారణం కలిసి కట్టుగా బతకడం. ఈ సమూహ భావం, సమన్వయంతో, ఇతర జంతువులను ఎదుర్కోవడంలో వాటికి సహాయపడుతుంది.
ఈ భూమిపై జీవం పుట్టాక, వానరం నుంచి మనిషి పుట్టిన తరువాత, మనిషి తర్వాత రెండవ అతి పెద్ద క్షీరదం తొడేలు. హుందాగా, తెలివిగా ఉండే ఏకైక జీవి తొడేలు. తొడేలు అరుపుల ద్వారా కమ్యూనికేట్ చేస్తాయి. ఎంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, ఒక తొడేలు పిలిస్తే, విన్న అన్ని తొడేల్లు వచ్చి సహాయం చేస్తాయి. అవి తమ కుటుంబానికి చెందిన తొడేలు అయినా, బయట తొడేలు అయినా, ప్రాణం అర్పించడానికి సిద్ధంగా ఉంటాయి.
ఈ ప్రపంచంలో విజయం సాధించిన మనుష్యులను జాగ్రత్తగా గమనిస్తే, కనిపించేది ఒకే ఒక్క లక్షణం: వాళ్ళకి ఒక బలమైన సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. అది ఏదైనా కావొచ్చు, కానీ బలమైన సపోర్ట్ లేకుండా ఈ భూమిపై ఎవ్వరూ గెలవలేదు, గెలవరు, గెలవబోరు.
విజయం సాధించాలంటే, మీ దగ్గర ఉన్న పుస్తకాలు అన్నీ తగలబెట్టండి, యూట్యూబ్ ఛానల్స్, ఛాటింగ్ యాప్ లు అన్నీ unsubscribe చేసుకోండి. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోచ్‌లు, ప్రవచన కర్తలు, పెద్దలు లేదా విజయం సాధించిన వ్యక్తులు, సినిమా డైలాగులు, సినిమా వాళ్లు లేదా ఇంకేదైనా చెప్పిన మాటలతో నిండిన మీ బుర్రలోని చెత్త అంతా ఖాళీ చేయండి.
కొంతమంది వ్యక్తులతో ఒక సమూహంలా ఏర్పడండి. ఎవరూ లేకపోతే కనీసం కుక్కలతో కలిసి బతకండి లేదా కొండాపూర్‌లో రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముకునే వ్యక్తులతోనైనా స్నేహం చేసి ఒక సమూహంలా ఏర్పడండి.
వందల, వేల, లక్షల కోట్లు సంపాదించే రాజకీయ నాయకులు, క్రికెటర్లు, సినెమా హీరోలు, వ్యాపారవేత్తలను నిశితంగా గమనిస్తే, వాళ్లు ఒంటరిగా ఉండరు, ఉండలేరు. ఎప్పుడూ కొంతమందితో కలిసి, సమూహంలా ఉంటారు. అందుకే వాళ్లు గెలుస్తారు, గెలుస్తున్నారు.
సామాన్యుడు ఓడిపోవడానికి, సంకనాకిపోవడానికి ప్రధాన కారణం ఒంటరిగా ప్రయత్నించడం మరియు బలమైన సమూహాన్ని ఏర్పరచుకోలేకపోవడం. జపనీయులు ఎక్కువకాలం బతకటానికి ఇంకా సంతోషంగా ఉండటానికి ముఖ్య కారణం, వారు ఇతరులతో కలిసి మెలసి బతకడం.
కుక్క జాతికి చెందిన తొడేలే పులులను, సింహాలను, ఏనుగులను లేదా ఏ శక్తివంతమైన జంతువులనైనా వేటాడి గెలుస్తుంది. మనిషి కూడా ఒక సమూహంతో కలిసి ఉంటే ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు అంటడు ఓ రోమన్ తత్వవేత్త …….. (జగన్నాథ్ గౌడ్)
Share this Article