Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లోకేష్‌కు రాధాకృష్ణ సర్టిఫికెట్… తమరిక తప్పుకోవాలి బాబు గారూ…

June 1, 2025 by M S R

.

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏమంటున్నాడు..? లోకేష్ సూపర్ అంటున్నాడు… గతంలో అందరూ పప్పు అన్నారు, మాట్లాడలేకపోయేవాడు, భాషతో ప్రాబ్లం, బెరుకు… తన పుట్టుకనూ వెక్కిరించారు… కానీ ఇప్పుడు..?

రాటు దేలాడు… భాష బాగుపడింది, ప్రసంగాల్లో జోష్ పెరిగింది… నిర్ణయాల్లో వేగం కనిపిస్తోంది… అవమానాల్ని భరించాడు, తన టార్గెట్ దిశలో కష్టపడ్డాడు… ఇప్పుడిక తనకు తిరుగు లేదు… తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లగలడు…

Ads

ఇన్నేళ్ల సీనియర్ చంద్రబాబుకు పెద్దగా మాట్లాడరాదు, నిర్ణయాల్లో దూకుడు చేతకాదు, సో, లోకేష్ ఇప్పుడు చంద్రబాబుకన్నా బెటర్… సో, అర్జెంటుగా తన వారసత్వాన్ని ప్రకటించేసి, లోకేష్‌కు పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఇచ్చేస్తే… వయస్సు మళ్లిన చంద్రబాబుకూ బెటర్, పార్టీ శ్రేణులకూ క్లారిటీ ఉంటుంది, తనకు స్వేచ్ఛ దొరుకుతుంది…

బాధ్యతపెరుగుతుంది, ఆల్ ది బెస్ట్, అడ్వాన్స్ కంగ్రాట్స్ దాకా వెళ్లిపోయాడు రాధాకృష్ణ… సరే, సర్టిఫికెట్టు ఇచ్చేశాడు, ఇంకెప్పుడు వారసత్వ ప్రకటన అని చంద్రబాబును అడిగేశాడు… ఇవ్వకతప్పదని తేల్చేసి అడ్వాన్సుగా కంగ్రాట్స్ కూడా చెప్పేశాడు… ఏదో ఆయన అభిమానం, మనకు తెలిసిందే కదా…

పనిలోపనిగా తన తాజా కొత్త పలుకు వ్యాసంలో… కేటీయార్‌ను లాక్కొచ్చాడు… ఏపీలో లోకేష్ సరేగానీ, తెలంగాణలో కేసీయార్ తన వారసుడిగా కేటీయార్‌ను దాదాపు బాధ్యతలు అప్పగించినా సరే, కేటీయార్ కార్యకర్తలతో మమేకం కాలేకపోయాడని తేల్చిపారేశాడు… నిజమో, అబద్ధమో వదిలేస్తే… పోలిక సరికాదు, రెండూ వేర్వేరు వ్యవస్థలు… చంద్రబాబు కేసీయార్ కాడు, కేసీయార్ చంద్రబాబు అసలే కాడు…

లోకేష్‌ను బాగా పైకి లేపీ లేపీ, ఇక ఈయనే మీ లీడర్ అని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని సంసిద్ధం చేస్తున్నారు… ఏమాటకామాట… నిజంగానే లోకేష్ అనేక విషయాల్లో అధికారిక, అనధికారిక అంశాల్లో తనే దాదాపు డీఫ్యాక్టో సీఎం ఇప్పుడు, తను గతంలోని లోకేష్ కానేకాదు… లోకేష్‌కు తెలియకుండా తెలుగుదేశంలో ఇప్పుడు ఇటు పుల్ల అటు కదలదు… పక్కా…

ఐతే వెంటనే లోకేష్ నా వారసుడు, నేను సైడ్ అయిపోతాను, తనే చూసుకుంటాడు అని చంద్రబాబు చెప్పేస్తాడా..? నెవ్వర్, అది తన తత్వమే కాదు… తన ఆయురారోగ్యాలు బాగున్నంతకాలం పార్టీ, ప్రభుత్వం తనవే… ఎవరినీ వేలు పెట్టనివ్వడు…

పైగా తన నీడనే తను నమ్మడు… ప్రతిదీ తనకు తెలిసి, తను చెప్పినట్టే నడవాలి… లోకేష్ అయినా సరే, ఇంకెవరైనా సరే… సో, రాధాకృష్ణ చెప్పాడు, ఇక లోకేష్‌కు కిరీటం పెట్టేస్తాను అన్నట్టగా ఉండదు… తనకంటూ కొన్ని లెక్కలుంటాయి…

మోడీ ఢిల్లీకి లోకేష్‌ను పిలిచి, దేవాంశ్‌ను ముద్దు చేసి, ఇక నీదే రాజ్యం, నాదీ మద్దతు అని చెప్పినంత మాత్రాన చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకోడు… తనకు పవన్ కల్యాణ్‌తో పొత్తు, బీజేపీతో పొత్తు, ఇష్యూస్ ఉంటయ్.., తను గ్రేట్ ముదురు కాబట్టి అందరినీ మేనేజ్ చేసుకుంటూ కథ నడిపించగలడు… అప్పుడు లోకేష్‌లో ఆ మెచ్యూరిటీ ఎక్స్‌పెక్ట్ చేయలేం…

సో, ఎవరెంత ప్రయత్నించినా… ఏకంగా మహానాడులో వర్కింగ్ ప్రెసిడెంటుగా ప్రకటించేసి, నువ్వు కాస్త తగ్గాలి సార్ అని కేడర్ ప్రతిపాదనలు ప్రస్తావించినా సరే, చంద్రబాబు త్వరపడడు… త్వరపడితే తను చంద్రబాబే అనిపించుకోడు… సో, లోకేష్ వెయిట్ చేయాల్సిందే ఇంకా…!!

అంతటి రాధాకృష్ణ చెప్పినా సరే, చంద్రబాబు చేయడా అనడక్కండి, పార్టీలో చాలామంది రాధాకృష్ణలు ఉన్నారు… ఆ సర్టిఫికెట్లను వెంటనే చంద్రబాబు పరిగణనలోకి తీసుకోడు.,., మార్కులు వేయాల్సింది తను, పాస్ చేయాల్సింది తను…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions