.
నిజం… రేవంత్ రెడ్డికి వరుణుడి కరుణ పుష్కలంగా ఉంది… అది పవర్ జనరేషన్, ఇరిగేషన్, అగ్రికల్చర్ వంటి అన్ని రంగాలపై సానుకూల ఫలితాల్ని చూపిస్తోంది… వరుణ దేవుడి దయ పుణ్యమాని… పాత కేసీయార్ పాలన నిర్వకాల ప్రభావం అంతగా రాష్ట్రంపై పడటం లేదు… ఎలా అంటే… వివరాల్లోకి వెళ్లాలి…
- ముందుగా వర్షపాతం లెక్కలు చూద్దాం… ఈ వానాకాలం ఇప్పటివరకు (22.10.2025) సాధారణ వర్షపాతం 814.7 మి.మీ కాగా… ఇప్పటివరకు వాస్తవంగా కురిసింది 1056.2 మి.మీ… అంటే 30 శాతం అదనం… దాదాపు సగం జిల్లాల్లో ఎక్సెస్ రెయిన్ ఫాల్ నమోదైంది… 4 జిల్లాల్లో లార్జ్ ఎక్సెస్, అంటే అతివృష్టి… బిలో నార్మల్ ఒక్క జిల్లా కూడా లేదు… ఇప్పుడూ అల్పపీడనం, ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి…
పవర్ జనరేషన్ విషయానికి వద్దాం… ప్రాజెక్టుల్లోకి పుష్కలంగా నీళ్లు రావడంతో… హైడల్ జనరేషన్ భారీగా జరుగుతోంది… ఈ సీజన్‌లో ఇప్పటికే 5 వేల మిలియన్ యూనిట్ల పవర్ జనరేట్ చేశారు… ప్రాజెక్టుల్లో ఫుల్లు నీళ్లున్నందున 2022-23 నాటి 6831 మి.యూ రికార్డును సులభంగా దాటేసే అవకాశముంది… గోదావరిపై జస్ట్ 70 మెగావాట్లే అయినా కృష్ణా ప్రాజెక్టుల కింద మనకు 2371 మె.వా పవర్ జనరేషన్ కెపాసిటీ ఉంది, అది బాగా ఆదుకుంటోంది… (గత ఏడాది ఇదేకాలంలో జరిగిన హైడల్ జనరేషన్‌తో పోలిస్తే ఈసారి దాాదాపు రెట్టింపు)…
Ads
మరోవైపు పవర్ ఎక్స్‌ఛేంజీల్లో చాలా చీప్ పవర్ దొరుకుతోంది… ఓసారి మరీ రెండు పైసలకు యూనిట్ ధర కూడా రికార్డయిన వార్తలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం… ఇటు మన జెన్‌కో, మరోవైపు పవర్ ఎక్స్‌ఛేంజ్, ఇంకోవైపు ప్రైవేటు సోలార్, రెన్యువబుల్ ఎనర్జీ ఎట్సెట్రా పుష్కలంగా వస్తోంది… (కీలకమైన పంప్డ్ స్టోరేజీ పవర్ మీద ఎందుకో మరి రేవంత్ ప్రభుత్వానికి ధ్యాస లేదు…)
దీనివల్ల ఏమవుతోంది..? కేసీయార్ హయాంలో అడ్డగోలు ధరలకు జరిగిన ప్రైవేటు పవర్ కొనుగోళ్లకు పూర్తి భిన్నమైన వాతావరణం ఉంది ఇప్పుడు… పాత ప్రభుత్వ కొనుగోళ్ల కమీషన్ల యవ్వారంపై జుడిషియల్ కమిషన్ ఏం తేల్చిందో తెలియదు, చాలా వృథా ఖర్చులు… అంతకుమించి బీహెచ్‌ఈఎల్ తుక్కుగా పరిగణించిన ప్లాంట్ల సామగ్రిని తీసుకొచ్చి భద్రాద్రి థర్మల్ ప్లాంట్లు కట్టాడు కేసీయార్… దేశమంతా ఆ కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని మనం నెత్తిన పెట్టుకున్నాం…
- దాని యూనిట్ పవర్ ధర 7 రూపాయల దాకా… నడిపిస్తే జనంపై భారం… (దేశంలో ఇతర చోట్ల అలాంటి ప్లాంట్లను కూల్చేస్తుంటే, మనం కొత్తగా కట్టుకున్నాం…) ఇప్పుడు చౌక కరెంటు దొరుకుతుండటంతో, జలవిద్యుత్తు కూడా ధారాళంగా వస్తుండటంతో… ఏడు థర్మల్ యూనిట్లను తాత్కాలికంగా షట్ డౌన్ చేశారు, ఐనా సరే, జనంపై ఫిక్స్‌డ్ ఛార్జీల భారం తప్పదు… ప్రస్తుతానికి కోతల బెడద లేదు…
ఇరిగేషన్ విషయానికి వస్తే… కేసీయార్ కట్టిన మూడు బరాజులు పనికొస్తలేవు, పంపు హౌజులు పనికొస్తలేవు… ఐనా కేసీయార్ పీరియడ్‌లో కూడా నీటిని పైకి ఎత్తిపోసి, గేట్ల నుంచి వదిలేశారు… అదో ప్రపంచ స్థాయి వైఫల్యం… పైగా బుంగలు, ఇసుకమేటలు, పిల్లర్ల పగుళ్లు సరేసరి… ఐనా సరే, గోదావరి, కృష్ణా చిన్న, పెద్ద ప్రాజెక్టులన్నీ పొంగి పొర్లుతున్నాయి…
- ఎల్లంపల్లి బేస్డ్ నెట్‌వర్క్‌లో పుష్కలంగా నీటి ప్రవాహం… సో, వరుణదేవుడి కరుణ పుణ్యమాని కాళేశ్వరం పనికిరాకపోయినా ఫరక్ పడటం లేదు… వ్యవసాయం విషయానికి వస్తే… వానాకాలం సాధారణ పంటల విస్తీర్ణంతో పోలిస్తే ఈసారి పెరిగింది… పంట ఉత్పత్తులూ పెరిగాయి… 148.3 లక్షల టన్నుల రికార్డు స్థాయి ధాన్యం వస్తోంది ఈ ఖరీఫ్‌లో… ఇదీ రేవంత్ రెడ్డిపై కురిసిన వానదేవుడి వరం..!!
Share this Article