Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పర్లేదు… లక్కీ భాస్కర్ విజయానికి మంచి డైలాగులూ కారణమే…

December 13, 2024 by M S R

.

డైలాగ్స్ మాత్రమే సినిమాను సక్సెస్ చేయలేవు… కానీ పదునైన డైలాగ్స్ సినిమాలోని సీన్స్‌ను బలంగా ఎలివేట్ చేయగలవు… కొన్నిసార్లు బలహీనమైన సీన్లను కూడా… (అఫ్‌కోర్స్, ఆప్ట్ బీజీఎం కూడా ఇదే పనిచేస్తుంది…)

లక్కీభాస్కర్… సంక్లిష్టమైన కథ… వీలైనంతవరకూ సగటు ప్రేక్షకుడికి అర్థం చేయించే ప్రయాస దర్శకుడు అట్లూరి వెంకీదే… స్వతహాగా రచయిత తను… ఐతే కథ- స్క్రిప్ట్ వరకూ వోకే… డైలాగ్స్ తనే రాశాడా, ఎవరితోనైనా రాయించుకున్నాడా తెలియదు…

Ads

కానీ డైలాగ్స్ బాగున్నయ్… కొన్ని వాట్సప్ ద్వారా ఎవరో పంపించారు… పది మందీ చదవాలని… అవే ఇవి… డైలాగ్స్ రచయితకు, క్రోడీకరించిన పోస్టు రచయితకు ధన్యవాదాలు…



డైలాగ్ 1
కలలు కనడానికి భయపడే వాళ్లకు కలల్ని ఎలా నిజం చేసుకోవాలో చూపించాడు హర్షద్ మెహ్రా

డైలాగ్ 2
ఈ సముద్రంలో ఉన్న ప్రశాంతత జనాల్లో ఉండదు. అందుకే పరుగెడుతూనే ఉంటారు.. కారణం డబ్బు.

డైలాగ్ 3
బార్డర్ లైన్ దరిద్రంలో బతుకుతున్నా.. నేనే కావాలని నన్ను చేసుకుంది.. నా భార్య సుమతి.

డైలాగ్ 4
థ్యాంక్యూ సార్.. నమ్మినందుకు.. థ్యాంక్యూ సార్, నిలబెట్టుకున్నందుకు..

డైలాగ్ 5
కాలిగోటి దగ్గర నుంచి తల వరకు, ఏం కావాలంటే అది కొనుక్కో.. అంత సంపాదించాను. అది కూడా తీసివ్వు. కౌంటర్ ఖాళీ అవ్వాలి కదా.

డైలాగ్ 6
దిస్ ఈజ్ ఇండియా.. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి.. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు ఒంటిపై కనపడాలి.

డైలాగ్ 7
ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు జరగలేదు. ఆ మాత్రం దానికి రోజంతా బాధపడాలా?

డైలాగ్ 8
మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్..
కష్టం వస్తే.. ఖర్చులన్నీ తగ్గించుకుని రూపాయి రూపాయి దాచుకుంటాం..
అదే పంతం వస్తే.. ఒక్క రూపాయి కూడా మిగలకుండా ఖర్చు పెట్టేస్తాం సార్.

డైలాగ్ 9
అవమానించిన వాడితోనే సలాం కొట్టించుకున్నాను..

డైలాగ్ 10
నెను వెళ్లింది నగలు కొనడానికి మాత్రమే కాదు సార్.. వాడి అహంకారాన్ని కూడా కొనడానికి.

డైలాగ్ 11
డబ్బుంటేనే మర్యాద.. ప్రేమ.

డైలాగ్ 12
ఇలాంటప్పుడే అనిపిస్తుంది.. ఫ్యామిలీ కోసం ఎంత రిస్క్ చేసినా.. తప్పు లేదని.

డైలాగ్ 13
సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇచ్చే కిక్కు కన్నా డబ్బు ఇచ్చే కిక్కే ఎక్కువ..

డైలాగ్ 14
మాటల్లో ఇంత అహంకారం..
అహంకారం కాదు.. ధైర్యం

డైలాగ్ 15
చేతల్లో బలుపు..
బలుపు కాదు.. బలం

డైలాగ్ 16
ఇంత చెడ్డవాడిలా మారిపోతావ్ అనుకోలేదు
ఐయామ్ నాట్ బ్యాడ్.. ఐయామ్ జస్ట్ రిచ్

డైలాగ్ 17
జూదంలో నువ్వు ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు..
ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం.

డైలాగ్ 18
వాడు కామన్ మ్యాన్..
అన్ని ప్రాబ్లమ్స్ తీర్చేసుకుని ప్రశాంతంగా పడుకోగలడు.

డైలాగ్ 19
వెల్‌కమ్ టు బొంబాయి.. ది మనీ కేపిటల్ ఆఫ్ ఇండియా

డైలాగ్ 20
దేవుడు రెడ్ సిగ్నల్ వేశాడు అంటే.. అన్నీ ఆపేయమని అర్థం..



ఇవన్నీ గొప్ప డైలాగ్స్ అని కాదు… ఆయా సందర్భాల్లో ఆ సీన్లకు సరైన మాటలు… సినిమా అనేది ప్రధానంగా దృశ్యమాధ్యమం గొప్ప దర్శకుడు తక్కువ మాటలతో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడు అనేది సరైన అభిప్రాయమే కానీ… అంత క్రియేటివ్ వర్క్ మన సినిమాల్లో జరుగుతోందా అసలు..?!

మాటలు అనగానే మనం మొదట గుర్తుతెచ్చుకునేది త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను… గతంలో చాలామంది ఉండేవాళ్లు… గణేష్ పాత్రో, జంధ్యాల, దాసరి ఎట్సెట్రా… మొన్నమొన్నటిదాకా బుర్రా సాయిమాధవ్ పేరు బాగానే వినిపించేది… (గౌతమీపుత్ర శాతకర్ణి)… (అఖండ..?) సంగీతం, ఎడిటింగ్, దర్శకుడు, కొరియోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్ అందరినీ ప్రస్తావిస్తుంటారు గానీ వేదికలపై, సినిమా సంబంధ వార్తలు, రివ్యూల్లో డైలాగ్ రైటర్‌ను ఎవరూ పట్టించుకోరు, అదొక ట్రాజెడీ…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
  • అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…
  • అత్యంత అసాధారణ కరెంటు బిల్లు… నమ్మడమే కష్టం సుమీ….
  • సొంత ‘బతుకమ్మ’ పేర్చుకుని… తన ఆట తాను ఆడుకోవడమేనా..?
  • ఫక్తు అక్కినేని మార్క్ వన్ ప్లస్ టూ రొటీన్ సినిమా ప్రేమ కథ..!!
  • ఆ సిరివెన్నెల పాటలు… రాసిన అర్థాలు వేరు- వాడుకున్న తీరు వేరు…
  • శరణార్థుల ఆశాసూచిక – భారత రాజ్యాంగంలోని కుబేరుని కళాచిత్రం…
  • కశ్మీర్‌లో యూఎన్ ధర్మసత్రం షట్‌డౌన్… శెభాష్ జైశంకర్… ఇదీ టెంపర్‌మెంట్..!!
  • నరాల్ని సుతారంగా గిచ్చే పాటగత్తె… సరిజోడుగా ఆయన అల్లరల్లరి….
  • అసలే సుగర్… మామిడి పండు చూస్తే టెంప్టింగ్… మరెలా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions