.
లక్కీ భాస్కర్… సినిమా కథ కాబట్టి హీరోకు అనుకూలంగా రాసుకున్నారు. ఏ స్థాయిలో అంటే సినిమా మొత్తం మాట్లాడని హీరో తండ్రి కొడుకు సమస్యల్లో ఉన్నాడని అర్ధం చేసుకొని తొలిసారి నోరు విప్పుతాడు. ఆర్ధిక శాఖలో ఫ్రెండ్ & RBI గవర్నర్ Ex Girl Friend ఉన్న తండ్రులు నిజ జీవితంలో ఏ భాస్కర్కు తండ్రిగా దొరకరు..
హర్షద్ మెహతాను వాడుకొని BR (Bank receipt) & Stocks rigging కథ రాసుకున్నారు కానీ దాని వలన బలైనోళ్ల గురించి కథలో రాసుకోలేదు.
Ads
హర్షద్ మెహతా దెబ్బకు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు దాదాపు పదేళ్లపాటు దేశంలో ఎక్కడో ఒక చోట ఆత్మహత్య చేసుకున్నారు. చంద్రబాబునాయుడు చిన్నాయన ఒకతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
లక్కీ భాస్కర్ సినిమాలో చూపినట్లు బ్యాంక్ దివాళా తీస్తే వచ్చే నష్టం GM & AGM లకు కాదు .. పొదుపు దారులకు.. అవసరాల కోసం డిపాజిట్ చేసిన ఖాతాదారులు బలైపోతారు..
లక్కీ భాస్కర్ పని చేసిన మగధ బ్యాంక్ నిజజీవితంలో లేదు కానీ మన దగ్గర చార్మినార్ బ్యాంక్ , కృషి బ్యాంక్ వాసవి బ్యాంక్ .. చాలానే దెబ్బతిన్నాయి.
చార్మినార్ బ్యాంక్ చైర్మన్ Syed Alamdar Hussain Sajjad ఆత్మహత్య చేసుకున్నాడు. దాని దెబ్బ వాసవి బ్యాంక్ (మహేశ్ బ్యాంక్ మీద కూడా పడిందనుకుంటా, కచ్చితంగా తెలియదు) మీద పడింది.
మార్కెట్లో మంచి పేరున్న కొసరాజు వెంకటేశ్వర రావు కృషి బ్యాంక్ పెట్టి మంచి డిపాజిట్స్ సేకరించారు. కానీ బ్యాంక్ లోన్ల విషయంలో బ్యాలెన్స్ చేసుకోలేకపోవడంతో బ్యాంక్ దివాళా తీసింది. కృషి బ్యాంక్ చైర్మన్ కొసరాజు వెంకటేశ్వర రావు కూడా లక్కీ భాస్కర్ మాదిరే విదేశాలకు పారిపోయాడు.
కానీ బ్యాంకాక్ లో అరెస్ట్ చేశారు, చాలా కాలం జైల్లోనే గడిపారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఆమధ్య అంటే 2012 ప్రాంతంలో దేశం విడిచిపోవాలని తనను కొందరు బెదిరిస్తున్నారని మీడియాతో చెప్పారు.
ఈ ఆర్టికల్ చదవండి మహారాష్ట్ర బ్యాంకుల్లో జరిగిన కుంభకోణాలు తెలుస్తాయి.
https://www.indiatoday.in/…/20020610-cooperative-banks…
లక్కీ భాస్కర్ సినిమా రిలీజ్ తరువాత 1992- 2002 మధ్య జరిగిన బ్యాంక్ కుంభకోణాల గురించి లోతైన ఆర్టికల్ వస్తుందేమోనని చూసాను మెయిన్ స్ట్రీమ్ మీడియాకు వాటి పట్ల ఆసక్తి లేనట్లుంది..
ఒకటే గుర్తుపెట్టుకోవాలి లక్కీ భాస్కర్ లు నిజ జీవితంలో ఉండరు. సినిమా కథల్లో అంటే సుఖాంతం అయ్యే సినిమా కథల్లోనే ఉంటారు.. హర్షద్ మెహతా షార్ట్ కట్ వెతుకోకుండా ఎక్కువ కాలం కష్టపడి ఉంటే Warren Buffett అయ్యేవారు “The intelligent investor” లాంటి పుస్తకాన్ని రాసేవారు ..
సత్యం కుంభకోణం అంటే ఏంటో ఎంతమందికి తెలుసు? ………. (— శివ రాచర్ల )
Share this Article