Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హీరోహీరోయిన్లకేనా డబుల్ ఫోజ్… మామూలు పాత్రలకూ ఉంటయ్… ఇలా…

April 22, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……. చిరంజీవి జైత్రయాత్రలో మరో మెట్టు 1983 జూలైలో వచ్చిన ఈ హిట్ సినిమా మగ మహారాజు . ఫేమిలీ ఓరియెంటెడ్ , ఎమోషనల్ సినిమాలలో కూడా బాగా నటించగలనని చిరంజీవి రుజువు చేసుకున్న మరో సినిమా .

మధ్య తరగతి కుటుంబాలలో బాధ్యత ఫీలయ్యే వాళ్ళ కష్టాలు , బేవార్సుగా క్రిమినల్సుగా ప్రవర్తించే కూతుళ్ళు , కొడుకులు , అల్లుళ్ళు , మా తాతలు నేతులు తాగారు అని డాంబికాలకు వేలాడే ముసలోళ్ళు , వెరశి ఈ మగ మహారాజు , కాదు మహా త్యాగరాజు , సినిమా .

Ads

ఈ సినిమాకు కధను నేసిన ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ గారిని అభినందించాలి . కాకినాడ వాస్తవ్యులయిన ఈ రచయితకు ఇదే మొదటి సినిమా . బాగా నేసారు . అందుకు తగ్గట్లుగానే డైలాగులను వ్రాసారు కాశీ విశ్వనాధ్ . ఆయన నటుడు కూడా .

అన్ని పాటల్నీ వేటూరే వ్రాసారు . అన్నీ హిట్టే . ఈ సినిమాలో ఓ విశేషం ఉంది . జయమాలిని , రావు గోపాలరావు , నూతన్ ప్రసాద్ ముగ్గురి డబుల్ ఫోజ్ ఉంటుంది . నటన పరంగా చెప్పుకోవాలంటే చిరంజీవి తర్వాత అన్నపూర్ణనే చెప్పుకోవాలి . 1980s అంతా ఆమె నటించిన తల్లి పాత్రలే . ఆమె భర్తగా , మధ్య తరగతి నిస్సహాయ కుటుంబ పెద్దగా కన్నడ నటుడు ఉదయకుమార్ చాలా బాగా నటించారు .

మన ఇంటావంటా ఉందా అంటూ ముసలి రాగాలు తీసే విసనకర్రమ్మగా నిర్మలమ్మ నటన గురించి చెప్పేది ఏముంది !? వెడమ చేత్తో చేసేస్తుంది సూర్యకాంతంలాగా . అలాగే నటించింది . బేవార్సున్నర బేవార్సుగా బాలాజీ బాగా నటించాడు . ఇలాంటి కొడుకులు కూతుళ్ళూ ఉంటారా అని అనిపిస్తుంది .

అంత కన్నా బేవార్సులు , క్రిమినల్సూ తయారయ్యారు ఇప్పుడు . దుష్ట కుమార్తెగా కె విజయ , ఆమె గారి మొగుడు గారిగా నూతన్ ప్రసాద్ , చిరంజీవికి చెల్లెళ్ళుగా తులసి , రోహిణిలు నటించారు .

హీరోయినుగా సుహాసిని . మంచి పాత్ర . గొప్పగా నటించే అవకాశం ఉన్న పాత్ర కాదు . హీరో గారికి తోడుగా వెన్నంటి ఉండే చక్కటి స్నేహితురాలు కం ప్రేమికురాలు పాత్ర . ఆమె తల్లిదండ్రులుగా రావు గోపాలరావు , పి ఆర్ వరలక్ష్మిలు నటించారు . ఇంకో రావు గోపాలరావు పాత్రే సినిమాకు ముఖ్యం . ఓ మరుగుజ్జు కొడుకును వేసుకుని హడావుడి చేసే పాత్ర . బాగా నటించాడు .

ఈ సినిమాలో ప్రేక్షకులు మరచిపోలేని పాత్ర ఒకటి ఉంది . అనూరాధ పోషించింది . మంచంలో ఉన్న భర్తను కాపాడుకునేందుకు పక్కింట్లో చొంగ కార్చుకుంటున్న బేవార్సు గాడేదో వెలగబడతాడని ఆశపడి మానభంగం చేయబడే పాత్ర . ప్రేక్షకులు మరచిపోలేని పాత్ర . ఫొటో ఫ్రేంలోనే ఉండి హావభావాలను ప్రదర్శిస్తారు అల్లు రామలింగయ్య . ఇతర పాత్రల్లో రాళ్ళపల్లి , గోకిన రామారావు , బౌనా , ప్రభృతులు నటించారు .

కృష్ణ- చక్రల సంగీత దర్శకత్వంలో పాటలన్నీ చాలా బాగుంటాయి . ఇక్కడ పోస్టర్లో చక్రవర్తి పేరుంది . కరెక్ట్ కాదు . మొదటగా చెప్పాల్సింది చిరంజీవి సైకిల్ పోటీలో పాట . నీ దారి పూల దారి పాట . నాకయితే శభాష్ రాముడు లోని యన్టీఆర్ జయమ్ము నిశ్చయమ్మురా పాటే గుర్తుకొస్తుంది . రెండవది జయమాలిని పాట మా అమ్మ చింతామణి . తల్లీకూతుళ్ళుగా జయమాలిని ఇరగతీసింది .

చాలా శ్రావ్యమైన పాట సీతే రాముడి కట్నం ఆ సీతకు రాముడు దైవం పాట . పెళ్ళిచూపుల్లో తులసి పాడే పాట . పొరపాటున కూడా మిస్ కాకండి ఈ పాట వీడియోని . నెలలు నిండె అంటూ సాగే మరో పాట కూడా సంసారపక్షంగా బాగుంటుంది .

మాగంటి రవీంద్రనాధ్ చౌదరి నిర్మించిన ఈ సినిమాకు దర్శకుడు విజయ బాపినీడు . చక్కటి కుటుంబ కధాచిత్రం . తరచూ ఏదో ఒక చానల్లో వస్తుంటుంది . ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడండి . చిరంజీవి అభిమానులు ఎన్ని సార్లయినా చూడొచ్చు . జయమాలిని అభిమానులు కూడానండోయ్ . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…
  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions