Maha … Devuda..!! ఒక మిత్రుడు ఏదేదో సంబంధం లేని విషయాలు మాట్లాడుతుంటే … ఎదురు వాదించకుండా ఇంటికి వచ్చి, ముందు రోజున వచ్చిన మహా టీవీ డిబేట్ 10 నిమిషాలు విన్నా …. మిత్రుడిపై ఆ మహా టీవీ డిబేట్ ఎఫెక్ట్ ఉన్నట్టుగా అప్పుడు అర్ధమయింది …
డిబేట్ ఇలా సాగింది… !!
మహా వంశీ : అతిథి గారూ … గుడ్ ఈవెనింగ్ ….
Ads
…… రోజూలాగానే మన బాబు గారి కోసం నేను ఈ వార్తల వంట వండాను, మీరు ఏ వంట వండారు …. !!
అతిథి : వంశీ గారు, గుడ్ ఈవెనింగ్ … మీరు వండిన వంటలకు కొన్ని ఘుమ ఘుమలు వేసి … తిరగమోత పెడతాను … !
వంశీ : ఈ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయినందువల్ల రాష్ట్రం చీకట్లోకి వెళ్లి పోయింది … ఇసుక వ్యాపారం చేయడం వల్ల తాజా కూరగాయలు పండడం లేదు . ఇప్పుడు ప్రజలు తాము అవగాహన లేకుండా బాబు గారిని ఓడించామే అని బాధ పడుతున్నారు, మీరేమంటారు అతిథి గారూ…
అతిథి : అవును వంశీ గారూ, ప్రజలు పిచ్చివాళ్ళు , పశ్చాత్తాపంతో చాలా బాధపడుతున్నారు …
వంశీ : ఇక ఈ మోడీ నియంతృత్వం వల్ల కూడా నిత్యావసర సరుకులతో పాటు ఆకు కూరలూ, కొత్తి మీర, పుదీనా ఎంతో ధరలకు వెళ్ళిపోయాయి… ప్రజలు తాము వండిన వంటలో పోపు వేసుకోకుండా తింటున్నారు . అనారోగ్యం పాలు అవుతున్నారు …
అతిథి: అవును వంశీ గారూ, ప్రజలు కూరలు వండుకోలేక చాలా బాధపడుతున్నారు…
వంశీ : ఈ అమిత్ షా , జగన్ తో చర్చలు జరపడం ఏమిటి , టీడీపీ పొత్తులో భాగంగా జనసేన 4, బీజేపీ 4 సీట్లు అడగడం తప్పుకదా … ! బీజేపీకి ఏం బలం ఉందని … .
… అతిథి : అవును వంశీ గారూ, బాబు గారి రెక్కల కష్టం… వీరికి ధార పోయాల్చి వచ్చేటట్టుంది… ఈ విధంగా కేంద్రంలో అధికారం కోసం చూస్తున్నారు…
ఇది మిత్రుడు Gopi R Chillakuru వాల్ మీద కనిపించిన పోస్టు… సరే, ఆ మహాటీవీ పోకడ గురించి ఐడియా ఉన్నదే… కానీ ప్రొగ్రెసివ్ థింకింగ్ ఉన్న అజిత కూడా ఈ ‘సూపర్ సుప్రీమ్ బంపర్ ప్రైమ్ టైమ్’ యెల్లో డిబేట్‌లో కనిపించడం ఆశ్చర్యమేసింది..!!
Share this Article