.
మామూలుగా రకరకాల వైరస్లు ఎయిర్ బార్న్… నోటి తుంపర్లు, గాలి ద్వారా సోకుతాయి… కానీ మొన్నటి కరోనా, ఇప్పటి హెచ్ఎంపీవీ మాత్రం టీవీ బార్న్… అనగా మీడియా బార్న్… అనగా మీడియా ద్వారా వ్యాపించి, సొసైటీ మొత్తాన్ని వణికించి, ఆ దెబ్బకు ఇమ్యూనిటీ తగ్గించేసి, ఆక్రమించేసి… ఫార్మాసురులకు కొత్త కోరలు తొడుగుతుంది…
…. సోషల్ మీడియాలో చూసిన ఓ చెణుకు… నిజానికి సీరియస్ పరిశీలనే… బాగా రాశాడు ఎవరో గానీ… కరోనా కాలంలో చరిత్ర మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఫార్మాసురులు సొసైటీని దోచుకున్నారు… రాస్తూ పోతే లక్ష మహా భారతాలు… వాళ్లకే వత్తాసు పలికే దిక్కుమాలిన ప్రభుత్వ ఫార్మా విధానం…
Ads
రకరకాలుగా వేవ్స్ పేరిట కూడా కరోనా గిరాకీ సడలకుండా చూసుకున్నారు… మన మోకాళ్లలో బుర్రలు కూడా వాడని మీడియా పెట్రోల్ పోసింది… ఇప్పుడు హెచ్ఎంపీవీ పేరిట మళ్లీ కాచుక్కూర్చుంది మీడియా, ఫార్మా…
లేకపోతే గుజరాత్, తమిళనాడు, కర్నాటక… ఎక్కడెక్కడో స్టేట్స్… తాజా కేసులన్నీ ఏ అంతర్జాతీయ ప్రయాణాలతో లింక్ లేవు… మరెలా వ్యాపించింది వైరస్..? నిజానికి 2001 నుంచీ ఉన్న వైరసే… ఇప్పటికిప్పుడు ఇంకా పరీక్షలు చేస్తుంటే కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది… అది చూపించి ఇక ఫార్మా భూతాలు జడలు విప్పుతాయి… అసలు ఓ సమర్థ విధానం అంటూ లేని మోడీ ప్రభుత్వం ఉందిగా, వీళ్లకు భలే చాన్స్…
అసలే కరోనా దెబ్బకు ఏ కొత్త వైరస్ పేరు విన్నా సమాజం వణికిపోతోంది… అందులోనూ దుర్మార్గపు చైనాలో పుట్టిన వైరస్ అనేసరికి మరింత భయం… ఈ నేపథ్యంలో… సోషల్ మీడియాలో వాసిరెడ్డి అమర్నాథ్ వాల్ మీద ఓ ఇంట్రస్టింగ్ ఆర్టికల్ కనిపించింది… చదవండి…
తల- తోక ….
బాహుబలి – 1 … బాహుబలి -2
కెజిఫ్ – 1 … కెజిఫ్ -2
పుష్ప -1 … పుష్ప -2
ఇప్పుడు సీక్వెల్ సినిమాలు సాధారణమయిపోయాయి .
వైరస్ కు కూడా సీక్వెల్స్ ఉంటాయి .
కరోనా – 1 ..
కరోనా -2 ..
ఈ రెండు … పాండెమిక్ దశలు
అటుపై కరోనా – ౩ అంటే ఓమిక్రాన్ వచ్చింది
మనం లెక్క వేసుకోలేదు కానీ… ఇప్పటికి కరోనా 4 , 5 , 6 వచ్చి పోయి ఉంటాయి . ఇది ఎండెమిక్ దశ
రెండు దాటితే.. పాండెమిక్ … ఎండెమిక్ అయిపోతుంది .
పాండెమిక్ కు… ఎండెమిక్ కు తేడా తెలుసుకోవడం అవసరం .
వైరస్ తొలిసారిగా పుట్టినప్పుడు { కరోనా విషయంలో పుట్టించినప్పుడు అని వాడాలి } అది పాండెమిక్ అయ్యే అవకాశముంది .
గాలి ద్వారా వ్యాపించేది.. అంటే శ్వాసకోస సంక్రమణ . సహజంగానే వేగంగా విస్తరిస్తుంది .
వైరస్ ను చంపే మందు ఇప్పటి వరకు రాలేదు .
భవిషత్తులో రావడం అంత ఈజీ కాదు .
వైరస్ వేగంగా సంతానోత్పత్తి చేయకుండా… ఇతర కణాలకు చొరబడకుండా చేసే మందులు మాత్రం వచ్చాయి .
కాబట్టి అది వందేళ్ల నాటి స్పానిష్ ఫ్లూ కావొచ్చు . మొన్నటి కరోనా కావొచ్చు .
వైరస్ ను చంపింది మనుషుల శరీరంలోని ఇమ్మ్యూనిటి వ్యవస్థే .
అదే సోలో హీరో .
వ్యక్తి ఇమ్మ్యూనిటి… బాహుబలిలా బలీయంగా ఉంటే… కనీసం మాదిరిగా ఉంటే.. వైరస్ చచ్చి ఊరుకుంటుంది. ఇమ్మ్యూనిటి బలహీనంగా ఉన్న వారు పండెమిక్ దశలో మరణిస్తారు .
పండెమిక్ దశలో వైరస్ ఇంచు మించు జనాభా మొత్తానికి సోకుతుంది . { ముఖ్యంగా గాలి ద్వారా వ్యాపించే కరోనా లాంటివి } కనీసం ఎనభై శాతానికి సోకినప్పుడు హెర్డ్ ఇమ్మ్యూనిటి వస్తుంది .
వైరస్ సోకినప్పుడు… ఇమ్మ్యూనిటి కనీసం ఒక స్థాయిలో ఉన్నవారు బతుకుతారు అని చెప్పుకొన్నాము కదా .
వీరి ఇమ్మ్యూనిటి వైరస్ తో పోరాడి విజయం సాధించింది .
ఇమ్మ్యూనిటీకి సెల్ఫీ పిచ్చి . అదే మానవాళిని కాపాడేది .
మనకైతే సెల్ఫీ పిచ్చి… ఇటీవలి కాలంలో వచ్చింది . మన ఇమ్మ్యూనిటీకి అనాదిగా ఉంది.
వైరస్ అంటే శత్రువు కదా . శత్రువును చంపుతున్నప్పుడు అది సెల్ఫీ తీసుకొని భద్ర పర్చుకుంటుంది .
సెల్ఫీ అంటే సెల్ఫీ కాదు లెండి .
సైన్స్ విషయాలు మీకు ఆసక్తికరంగా సులభంగా అర్థం అయ్యేందుకు ఆలా చెప్పాను.
ఇమ్మ్యూనిటికి ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉంటుంది . ఇమ్మ్యూనిటిలోని మెమరీ – బి సెల్స్ , మెమరీ- టి సెల్స్ వైరస్ ను గుర్తు పెట్టుకొంటాయి .
దీన్నే … టి సెల్స్ రక్షణ… అని అని నేను కరోనా కాలంలో పుంఖానుపుంఖాలుగా రాసాను .
ఒక్కసారి వైరస్/ బాక్టీరియా సోకితే టి సెల్స్ రక్షణ వచ్చేస్తుంది .
టి సెల్స్ ఆ రోగకారక జీవిని గుర్తుపెట్టుకొని ఇంకోసారి సోకితే టక్కున చంపేస్తాయి .
అంటే వైరస్, బాక్టీరియా లాంటి రోగకారక జీవులకు ఒకే ఒక ఛాన్స్. అప్పుడే దాని బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ .
సీక్వెల్ తీసి రెండోసారి మూడోసారి సోకితే ప్లాప్ అయ్యే అవకాశం ఎక్కువ
అందుకే పాండెమిక్ దశ దాటితే వచ్చేది ఎండెమిక్ దశ .
పాండెమిక్ లో ఒకటా? రెండా?
ఎన్ని వేవ్ లు ?
అనేది మొదటి దశలో వ్యాధి ఎంత మందికి సోకింది? అనే దాని పై ఆధారపడుతుంది . కరోనా మొదటి వేవ్ లో పెద్దగా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల … పాకిస్థాన్ … హైదరాబాద్ పాతబస్తీ లాంటి చోట్ల ఎక్కువ మందికి సోకడం .. హెర్డ్ ఇమ్మ్యూనిటి రావడం జరిగిపోయింది . ఇక్కడ తొలి దశలోనే ఎక్కువ నష్టం జరిగింది .
రెండో దశ ఇక్కడ పెద్దగా ప్రభావం చూపలేదు . అదే ఎక్కువ జాగ్రత్తలు తీసుకొన్న చోట్ల హెర్డ్ ఇమ్మ్యూనిటీ రాక రెండో దశ అరివీర భయంకరం అయ్యింది .
ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే ముందుగా పాండెమిక్ దశ .
అటుపై ఎండెమిక్ దశ .
ఎండెమిక్ దశ అంటే వైరస్ పోదు .
వైరస్ పోతుంది అనుకోవడం మన అమాయకత్వం .
పండెమిక్ దశ తరువాత అది మన మధ్య స్థిరపడిపోతుంది .
మన శరీరాల్లో అప్పటికే దానికి సంబంధించిన సహజ ఇమ్మ్యూనిటి ఉంటుంది .
అదేనండి టి సెల్స్ రక్షణ .
దానితో వైరస్ తోక ముడుస్తుంది .
మరీ బలహీనమయిన ఇమ్మ్యూనిటి వ్యవస్థ వున్నవారిని తప్పించి అది సీక్వెల్ లో ఎవరినీ ఏమీ చేయలేదు ..
అంటే వారి ఇమ్మ్యూనిటీ ఇటీవల బాగా బలహీనం అయి ఉంటే టి సెల్స్ రక్షణ కూడా ఏమీ చేయలేదు . అలాంటి వారే ఎండెమిక్ దశలో కూడా చనిపోతారు .
HMPV – దీన్ని గుర్తించింది 2001 . దానికి కనీసం యాభై ఏళ్ళ ముందు నుంచి ఇది ఉందని శాస్త్రవేత్తల అంచనా.
ఇది గాలి ద్వారా సోకే వైరస్ .
మన దేశంలో జనాభా, జనసాంద్రత ఎక్కువ .
ఇన్నాళ్లు ఇది చాప వేసుకొని పడుకొని ఉంటుందా ?
అప్పట్లో సరిగా రికార్డు చేయలేదు కానీ ఇది ఏనాడో … అంటే మన తాత గారి కాలంలోనే పాండెమిక్ దశ దాటి ఎండెమిక్ అయిపోయుంటుంది ?
2 తరువాత… 1 ఎలా వస్తుంది పుష్పా?
HMPV ఇప్పుడు పండెమిక్ కాబోతుంది అని ప్రచారం .
ఎండెమిక్ అయ్యింది… పండెమిక్ ఎలా అవుతుంది ?
ఇది మనందరికీ ఏనాడో సోకి ఉంటుంది .
ఒకటి కాదు… అనేక సార్లు సోకి ఉంటుంది .
దీనికి సంబంధించిన టి సెల్స్ రక్షణ మనకు ఉంది .
ఇంకో మాట .
హీరో గారు పిల్లి గడ్డం పెట్టుకొని వస్తే… విలన్ గుర్తించలేడు… . ఇది సినిమాల్లో .
కానీ ఇది నిజజీవితం . ఇక్కడ ఉన్నది బాహుబలి ఇమ్మ్యూనిటి హీరో .
వైరస్ ఎన్ని వేషాలు వేసినా.. అంటే ఎన్ని మ్యుటేషన్లు పొందినా బి సెల్స్, టి సెల్స్ టక్కున పట్టేస్తాయి .
ఇది ఖాయం .
కాబట్టి HMPV పండెమిక్ కాబోదు .
టెస్ట్ లు చేస్తే కేవలం నాలుగు నగరాల్లో కాదు. ఊరువాడా దీని ఆనవాళ్లు కనిపిస్తాయి .
ఇప్పుడు .. ఆ మాటకొస్తే ఎప్పుడూ… కావలసింది బలమైన ఇమ్మ్యూనిటి వ్యవస్థ .
అదే శ్రీరామ రక్ష.
1 . భయానికి … స్ట్రెస్ కు దూరంగా ఉండండి.
ఇవి ఇమ్మ్యూనిటిని చంపేస్తాయి .
టీవీ గొట్టాలముందు కూర్చుని” కరోనా చంపేస్తుంది” అని భయపడిన వారిలో చాలా మంది నేడు మన మధ్య లేరు .
అదే తప్పు చెయ్యొద్దు .
2 . డి విటమిన్ కీలకం . కనీసం అరగంట ఎండలో నడవండి . సాయంకాలం లేదా పొద్దున్న వాకింగ్ .
వీలు కాకపోతే డి విటమిన్ టాబ్లెట్ .
3 . వ్యాయామం తప్పనిసరి . జిం లేదా యోగ . కనీసం నడక . సెల్ ఫోన్ లో మాట్లాడుతూ కాదు . వేగంగా నుదుట చెమట పట్టేలా నడవాలి . లేదా కనీసం ఇంటి పని.. వంటపని చెయ్యండి .
4 . సి విటమిన్ కోసం .. నిమ్మ నారింజ . జింక్ కోసం మూడు నాలుగు ఎండు ద్రాక్ష లేదా గుమ్మడి విత్తనాలు . ప్రోటీన్ కోసం చికెన్, ఎగ్… శాఖాహారులు పన్నీర్ , పుట్టగొడుగులు . పురుషులు నాలుగు.. స్రీలు మూడు లీటర్ల నీరు .
5 . కనీసం ఏడు గంటల నిద్ర .
6 తెల్లన్నం తగ్గించండి . మైదా వద్దు . రాగులు జొన్నలు దంపుడు బియ్యం . ఆదీ పరిమితంగా . ఆకుకూరలు కాయగూరలు సమృద్ధిగా .
ముక్కు దిబ్బడ , ముక్కునుంచి చీమిడి కారడం , దగ్గు , గొంతు నొప్పి 102 డిగ్రీల దాక జ్వరం , తలనొప్పి నీరసం . ఇవి HMPV మైల్డ్ లక్షణాలు .
దగ్గు బాగా పెరిగి ఊపిరి తీసుకోవడం కష్టం అయినప్పుడు… 102 దాటిన జ్వరం… కండరాల నొప్పలు… పెదాలు, వేళ్ళు నీలంగా మారడం… వాంతి … పైకి లేవలేనంత నీరసం .. ఇవి వ్యాధి బాగా ముదురుతోంది అని చెప్పే లక్షణాలు .
ఇలాంటి స్థితి లో డాక్టర్ ను సంప్రదించడం అవసరం .
ఈ అవసరం బహుశా వెయ్యిలో ఒకరికి ఏర్పడొచ్చు …..
Share this Article