మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ శౌర్యాన్ని, సాహసాన్ని, త్యాగాన్ని ప్రస్తుతిస్తూ అడివి శేషు హీరోగా నిర్మించబడిన మేజర్ సినిమా మరీ బంపర్ హిట్ కాకపోయినా సరే, ఫ్లాప్ మాత్రం కాదు… దేశంలోని చాలా ప్రముఖ నగరాల్లో ప్రదర్శించబడిన రియల్ పాన్ ఇండియా మూవీ… అంటే, అన్ని ప్రాంతాల వాళ్లనూ కనెక్టయ్యేది…
పైగా ఓ రియల్ కథను కాస్త సినిమాటిక్ లిబర్టీతో ఆకర్షణీయమైన సినిమాగా మలిచారు… రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి… ప్రకాష్ రాజ్ ఓవరాక్షన్ యథావిధిగా చికాకు పెట్టినా సరే… శోభిత ధూళిపాళ్ల, రేవతి, మురళి శర్మ తదితరులది ప్లజెంట్ యాక్షన్… కాకపోతే మ్యూజిక్ బాగాలేకపోవడంతో సినిమాకు ప్లస్ పాయింట్ లేకుండా పోయింది…
ఓవరాల్‌గా సినిమా చూడబుల్… థియేటర్ ప్రేక్షకుల తీర్పు కూడా అదే… అన్నింటికీ మించి శేషు ఆ పాత్రలోకి జీవించాడు సహజంగానే, అలవాటుగానే… అనేక ప్రముఖ నగరాల్లో ప్రమోషన్ చేశారు… ఇలాంటి సినిమాను సైతం టీవీ ప్రేక్షకులు తిరస్కరించారు… అదీ ఘోరంగా… నిజానికి ఈ తిరస్కృతి ఆశ్చర్యమేమీ అనిపించలేదు… పెద్ద పెద్ద స్టార్ల, హిట్ సినిమాలు సైతం ఈమధ్య టీవీల్లో ఢమాల్ అంటున్నాయి…
Ads
మేజర్ సినిమాను మే 14 ఆదివారం నాడు జెమిని టీవీలో ప్రీమియర్ గా ప్రసారం చేశారు… అసలు ఈ సినిమాను జెమిని టీవీ కొనుగోలు చేసింది అనే వార్త చదివినప్పుడే అర్థమైపోయింది దీనికి ఏ రేంజ్ రేటింగులు వస్తాయో… అనుకున్నట్టుగానే ఘోరంగా ఫ్లాపయింది టీవీలో… మరీ దారుణంగా 1.70 రేటింగ్స్ వచ్చాయి… ఓ పాత సినిమాను మళ్లీ మళ్లీ ప్రసారం చేస్తున్నా సరే ఈ రేటింగ్స్ వస్తుంటాయి… అలాంటిది తొలిసారి మేజర్ ప్రసారం చేస్తే మరీ ఈ నాసిరకం రేటింగ్స్ రావడం శేషు ఇమేజీకి డ్యామేజీయే…
నిజానికి ఓటీటీ విజృంభణ తరువాత ఆ ప్లాట్ ఫామ్స్ పైనే ప్రేక్షకులు సినిమాల్ని, సీరియళ్లను, వెబ్ సీరిస్‌ను తెగచూసేస్తున్నారు… మేజర్ సినిమాను కూడా నెట్‌ఫ్లిక్స్‌లో వేశారు… ఇక టీవీ ముందు కూర్చుని ఎవరు చూస్తారు..? టీవీ ముందు కట్టేసినట్టుగా కూర్చుని సినిమా చూడటాన్ని ప్రేక్షకుడు ఇష్టపడటం లేదు… అదీ మేజర్ పూర్ రేటింగ్స్‌కు మరో కారణం… మనం గతంలోనే చెప్పుకున్నట్టు రాబోయే రోజుల్లో సినిమాలకు శాటిలైట్ రైట్స్ రేట్లు ఇకపై పెద్ద ఆకర్షణీయంగా ఉండబోవడం లేదు… ఇదుగో మేజర్ పూర్ రేటింగ్స్ వంటివే కారణం… ఎవరి తప్పూ లేదు ఇందులో… కాలం మారింది… ఇంకా మారుతోంది… టీవీ, థియేటర్ కాదు… రాబోయేది ఇంకా బలమైన ఓటీటీల శకం… మేజర్ మీదొట్టు…!!
అప్పట్లో మేజర్ సినిమా మీద ముచ్చట రివ్యూ ఇది…
Share this Article