జాన్ దూంగా, దేశ్ నహీ… అంటూ వెండి తెరమీదకు వచ్చేశాడు మేజర్ అడవి శేషు..! సినిమాల్లో ఓ సాధారణ వాణిజ్యసూత్రం ఏమిటంటే..? ఎవరికీ తెలియని కొత్త కథను చెప్పు… లేదా తెలిసిన కథనే కొత్తగా చెప్పు…! మేజర్ సినిమా కథ అందరికీ తెలిసిందే… ముంబై ఉగ్రవాద దాడి సమయంలో ధీరోదాత్తంగా పోరాడి, తన కర్తవ్యనిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన ఒక అశోకచక్రుడు… అంతేకాదు, తన మీద ఏవో వెబ్ సీరీస్, సినిమాలు కూడా వచ్చాయి…
మరి అడవి శేషు అందరికీ తెలిసిన ఈ కథనే ఎందుకు ఎంచుకున్నాడో తెలియదు గానీ… అందరిలాగా ఆ ఉగ్రవాద దాడి మీదే కాన్సంట్రేట్ చేయకుండా సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలోకి వెళ్లిపోయాడు… చిన్నప్పటి సందీప్ దగ్గర నుంచి మరణం దాకా… తను ఎలా బతికాడో చూపించాం అన్నాడు శేషు పలు ప్రెస్‌మీట్లలో… కానీ నిజానికి సందీప్ నిజజీవిత కథలో పెద్దగా ఎమోషన్స్ ఏమీ ఉండవు… ఉగ్రవాద దాడి దాకా తనది ఓ మామూలు కథే…
మలయాళీ కుటుంబం… తండ్రి ఇస్రో సైంటిస్టు… తల్లిదండ్రులు (ప్రకాష్‌రాజ్, రేవతి) ఇతర పేరెంట్స్‌లాగే కొడుకు ఇంజనీర్ లేదా డాక్టర్ కావాలనుకుంటారు… కొడుక్కేమో నేవీలో చేరాలని కోరిక… అందులో ఫెయిల్… ఆర్మీలో జాయిన్ అవుతాడు… ప్రేమించిన అమ్మాయినే (సాయి మంజ్రేకర్) పెళ్లి చేసుకుంటాడు… నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ డ్యూటీలో ఉన్నప్పుడు ముంబైపై పాకిస్థానీ ఉగ్రవాదుల దాడి జరగడం, ఆ పోరాటంలో సందీప్ ప్రాణాలు కోల్పోవడం కథ…
Ads
అందుకే సినిమా మొదట్లో తన చదువు, నేవీ వరకు ప్రయత్నాలు, ఆర్మీలో జాయిన్ కావడం, ప్రేమపెళ్లి వరకు పెద్దగా ప్రేక్షకుడిని కనెక్ట్ కావు… చాలా స్లోగా సాగుతుంది కథ… శేషు తనే కథ, స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు… (ఈమధ్య ఇదొక ట్రెండ్… హీరోలు కథారచయితలు, దర్శకులను వదిలి తమ కథలు తామే రాసుకుంటున్నారు… కేజీఎఫ్2లో తన పార్ట్ కథ, డైలాగ్స్ తనే రాసుకున్నాడు యశ్… డీజే టిల్లు సినిమా కూడా అంతే… మొత్తం హీరో సిద్ధూ చూసుకున్నాడు…)
శేషు కథ ఫస్టాఫ్‌లో పెద్ద ఇన్‌స్పయిరింగ్ ఏమీ లేదు… కాకపోతే సెకండాఫ్‌లో కథ, టేకింగ్, కథనం, బ్యాక్ గ్రౌండ్, చిత్రీకరణ, ఎడిటింగ్ అన్ని సరైన పాళ్లలో సమకూరి, థియేటర్ దడదడలాడిపోతుంది… చివరలో మంచి డైలాగ్స్ పడ్డాయి… ప్రేక్షకుడు బరువైన గుండెతో బయటికి వస్తాడు… స్థూలంగా సినిమా బాగుంది… ఓ మేజర్ బయోపిక్ కాబట్టి సినిమా సహజంగానే ఆ పాత్ర పోషించిన శేషు చుట్టే తిరుగుతుంది… శేషు కూడా ఆ పాత్రలోకి పరకాయప్రవేశం చేశాడు…
హీరోయిన్ సాయి మంజ్రేకర్ బాగుంది… ప్రకాష్ రాజ్ నెరేషన్ సినిమా బలం… రేవతి గురించి చెప్పక్కర్లేదు కదా… ప్రమోద అనే పాత్రలో నటించిన శోభిత మనమ్మాయే… ఇదే శేషు సినిమా గూఢచారిలో కూడా చేసింది… హీరో మహేశ్ బాబు నిర్మాత, సోనీ కూడా పార్టనర్… సో, ఎక్కడా నిర్మాణ విలువలపై రాజీపడలేదు… ఎటొచ్చీ పాటలు గుర్తుండవు పెద్దగా… బీజీఎం వోకే…
సినిమాకే సంబంధించిన ఇతర విశేషాల్లోకి వెళ్తే… సాధారణంగా నిర్మాతలు, హీరోలు, దర్శకులకు రివ్యూయర్లు అంటే చిరాకు… కోపం… ఏవగింపు… తిట్టిపోస్తారు… సోషల్ మీడియాలో సినిమా గురించి రాసేవాళ్లన్నా వాళ్లకు చిరాకే… తామేదో కళను ఉద్దరించడానికి కష్టపడిపోతుంటే వీళ్లంతా అడ్డుపడుతున్నట్టు ఫీలవుతారు… శేషు Delhi, Lucknow, Jaipur, Ahmedabad, Mumbai, Pune, Hyderabad, Vishakapatnam, Bangalore, Kochi నగరాల్లో కొద్దిరోజులుగా ఈ సినిమా ప్రీమియర్ షోలు వేస్తున్నాడు…
కొన్ని వందల మందికి చూపించాడు… వారిలో జర్నలిస్టులు, రివ్యూయర్లు కూడా ఉన్నారు… అందరికీ ఎంబార్గో… అంటే, ఫలానా తేదీ వరకు ఏమీ రాయకండి అని..! ఈరోజు వరకూ ఎవరూ ఒక్క ముక్క రాయలేదు… రివ్యూయర్ల మీద పడి ఏడిచే బాపతు కేరక్టర్లు తెలుసుకోవాల్సిన సత్యం ఇది… తన సినిమా మీద తనకు నమ్మకం ఉంది కాబట్టే ఈతరహా లిమిటెడ్ రిలీజ్‌కు సిద్ధపడ్డాడు శేషు… ఎక్కడా నెగెటివ్ మౌత్ పబ్లిసిటీ కూడా జరగలేదు… అంటే ప్రేక్షకుల యాక్సెప్టెన్సీ లభించినట్టే ఒకరకంగా… ఇక వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి…
నిజానికి పెద్ద హీరోల సినిమాల విషయానికొస్తే… అడ్వాన్స్ బుకింగులు, హైపులతో తొలిరోజు వీలైనంతగా డబ్బులు కుమ్మేసుకోవడం ఇప్పటి ట్రెండ్… సినిమా బాగా లేకపోతే రెండో రోజు నుంచే సినిమా ఢమాల్… కానీ ఈ మేజర్ సినిమాకు సంబంధించి, దానికి భిన్నంగా వెళ్లారు… ప్రమోషన్స్ చేసుకుంటూనే నిజాయితీగా, సాహసంతో బోలెడు ప్రీమియర్ షోల లిమిటెడ్ రిలీజ్‌కు రెడీ అయ్యారు… ప్రజల ముందు పెట్టేశారు…
చివరగా… ప్రస్తుతం దేశభక్తి మంచి మార్కెటబుల్ కమాడిటీ… బయోపిక్స్ అనేది ట్రెండ్… ప్రొవైడెడ్ అవి ప్రేక్షకుడిని బలంగా కనెక్టవుతేనే…! ఉదాహరణకు అజయ్ దేవగణ్ రీసెంటుగానే తీసి వదిలిన రన్‌వే-34 కూడా మంచి సబ్జెక్టే… కానీ బాక్సాఫీస్ దగ్గర చతికిలపడిపోయింది…! ట్రిపుల్ఆర్ వంటి వక్రబాష్యాల చరిత్ర సినిమాలకు బదులు ఇదుగో, ఇలాంటి మేజర్లకు ప్రేక్షకాదరణ దక్కితే, అది సినిమా ఇండస్ట్రీకే మేలు…!!
.
Share this Article