మాళవిక మోహనన్ అని ఓ హీరోయిన్ ఉంది తమిళనాడులో… సెకండ్, థర్డ్ లేయర్ హీరోయిన్… అనగా పెద్ద పేరున్న నటి కాదని అర్థం… 9 సినిమాల వయస్సు ఆమెది… పదేళ్ల తన్లాట… తెలుగులో ఏమీ చేయలేదు… మనకు పరిచయం లేదు… గతంలోలాగా కాదు కదా ఇప్పుడు… సీనియర్లను గెలకాలి, ఏదోలాగా వార్తల్లో ఉండాలి… ఎప్పుడూ జనం నోళ్లలో నానుతూ ఉండాలి… దాంతో ఫాయిదా ఏమిటని అడక్కండి… ఒక్కొక్కరి తత్వం ఒక్కో తీరు…
ఆమధ్య ఓసారి నయనతారను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు విసిరింది… నయనతార తమిళంలో నెంబర్ వన్ హీరోయిన్… దాంట్లో డిస్ప్యూట్ లేదు… అదేదో రాజు-రాణి అనబడే సినిమాలో ఆమె మేకప్ వేసుకుని హాస్పిటల్ బెడ్ మీద కనిపిస్తుంది… దాన్ని ప్రస్తావిస్తూ, నయనతార పేరు ఎత్తకుండానే… కథ ప్రకారం సరిగ్గా కనిపించాలి కదా, మేకప్‌తో రోగిగా కనిపించడం ఏమిటి అసలు..? ఎంత కమర్షియల్ సినిమా అయినా ఇలా నటిస్తారా..? కొంత రియల్ సెన్స్ ఉండాలి అని ఏదో ఇంటర్వ్యూలో చెప్పింది…
నిజానికి నయనతార ఉన్న పొజిషన్‌లో ఈ గోకుడుకు ఉల్టా గోకుడు, వివరణ అక్కర్లేదు… ఒక నటి ఒక సీన్‌లో ఎలా కనిపించాలనేది దర్శకుడి ఇష్టం… మనం ఎన్ని టీవీ సీరియళ్లలో చూడటం లేదు, మేకప్ వేసుకుని, ఫుల్లు నగలు దిగేసుకుని మరీ పడుకుంటారు, మగ నటులు అయితే బూట్లు వేసుకుని, టక్ చేసుకుని పడుకుంటారు… చస్తున్నామా, చూస్తున్నాం కదా… పెద్ద జోక్ ఏమిటంటే ప్రతి సీన్‌లోనూ ఆ సీరియల్ ముఖ్యులు అందరూ వరుసగా నిలబడతారు… సరే, సీరియల్ పైత్యాన్ని వదిలేస్తే… ఫాఫం, నయనతార దర్శకుడు కూడా గతంలో సీరియళ్లు బాగా చూసి ఉంటాడు…
Ads
నయనతార మాళవిక వ్యాఖ్యకు సమాధానమిస్తూ… కమర్షియల్ సినిమాలో ఇవన్నీ పట్టించుకుంటే కుదరదు… ఐనా దర్శకుడి ఇష్టం, మన చిత్తానుసారం నటించలేం కదా అని వివరించింది… అదే అలుసైపోయినట్టుంది మాళవికకు… మళ్లీ ఏదో ఇంటర్వ్యూలో ‘‘అసలు నయనతార సూపర్ స్టార్ కావచ్చుగాక, కానీ లేడీ సూపర్ స్టార్ అనడం దేనికి..? జస్ట్, సూపర్ స్టార్ అంటే చాలు కదా’’ అని కూసింది… నిజానికి సూపర్ స్టార్ అని మగ హీరోలకు వాడుతుంటారు… కానీ నయనతార ఆడ స్టార్ కదా… అందుకని లేడీ సూపర్ స్టార్ ప్రత్యేకంగా అంటుంటారు… ఐనాసరే, అలా పిలవకూడదు అంటుంది మాళవిక…
ఒసేయ్, సీనియర్ ఆర్టిస్టు అనే గౌరవం అయినా లేదా నీకు..? మా అభిమాన నాటిని తూలనాడతావా అంటూ నయనతార ఫ్యాన్స్ ఇక ట్రోలింగుకు దిగారు… ఒరే నాయనలారా..? మిస్ ఎన్ (నయనతార) అంటే నాకూ గౌరవమే, ప్రేమే… కానీ నేను మాట్లాడేది ఆడ తారలపై వివక్ష గురించి… సూపర్ స్టార్ అంటే సూపర్ స్టారే, మళ్లీ లేడీ, జెంట్ అనే తేడా ఏమిటి..? దీపికా పదుకొన్, అలియా భట్, కత్రినా కైఫ్ వంటి వారు కూడా సూపర్‌స్టార్లు… అలాగే, అందర్నీ పిలవవచ్చు అని కవర్ చేసుకొచ్చింది… ఇలా గోక్కోవడం దేనికి..? మళ్లీ దానిపై ఆయింట్‌మెంట్ రాసుకోవడం దేనికి..?
Share this Article