సాధారణంగా మన సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్లను ఎలా చూస్తారో అందరికీ తెలిసిందే… క్యాస్టింగ్ కౌచ్ మాత్రమే కాదు, చాలా అంశాల్లో వాళ్లను మనుషుల్లాగే చూడరు… ప్రతి ఒక్కడూ వాళ్లను సొంత ఆస్తిలా చూసేవాడే… ఐతే కాస్త టెంపర్‌మెంట్ ఉన్న లేడీ ఆర్టిస్టులయితే కొన్ని అంశాల్లో హఠాత్తుగా రియాక్టవుతారు, గొడవ అవుతుంది… ప్రత్యేకించి హీరోల ఇగోస్ వల్ల సమస్యలొస్తుంటయ్… ఐతే ఏళ్లు గడిచిపోయినా ఆ లేడీ ఆర్టిస్టులు ఇక వాటి గురించి ఎక్కడా బయటపెట్టరు… కానీ మాళవిక కథ వేరు…
అసలు పేరు శ్వేత కొన్నూరు మేనన్… సినిమా పేరు మాళవిక… ఆమెకు తెలుగు ఇండస్ట్రీలో చేదు అనుభవాలున్నయ్… సర్దుకుపోలేని ఆమె తత్వం కావచ్చు, మనవాళ్ల ‘‘అత్యంత విశాల హృదయాలు’’ కావొచ్చు… ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే..? ఈటీవీలో ఆలీతో సరదాగా అని ఓ షో వస్తుంది కదా… వెటరన్ తారల్ని కూర్చోబెట్టి పాత సంగతులన్నీ తవ్వుతుంటాడు… పర్లేదు… ఓ యూనిక్ షో… మాళవిక వచ్చింది… కొన్ని ప్రశ్నలకు సూటిగా బదులిచ్చింది… తడబాటేమీ లేదు…
Ads
నిజానికి ఈ షోలో ఆమె మేకప్ ఛండాలంగా ఉంది… అసలే మేకప్ ఎలా ఉండకూడదు అనే ఉదాహరణ… 42 ఏళ్లకే ముసలిదానిలా కనిపించింది… దట్టంగా పెయిట్ పూశారు… కానీ ఒకసారి ఆమె ఇన్‌స్టా చూస్తే ఆమె ఫోటోల కథ వేరు… ఊ అంటావా, ఊఊ అంటావా పాటకు అడిగితే డాన్స్ చేసేదాన్ని అంటోంది… సరే, నిర్మాతలు ఆ ధైర్యం చేయరు గానీ… జస్ట్, ఆమె తెలుగులో అయిదే సినిమాలు చేసింది… కానీ తమిళంలో 35 సినిమాలు చేసింది…
తెలుగులో చాలా బాగుంది అనే సినిమాలో రేప్ సీన్ బాగా ఇబ్బంది పెట్టింది అని సూటిగానే చెప్పింది… శ్రీకాంత్‌తో ఓ పాట విషయంలో జరిగిన గొడవనూ గుర్తుచేసింది… మాంచి మసాలా సాంగేమో, చేయడానికి ఇబ్బందిపడితే శ్రీకాంత్‌కు కోపమొచ్చిందట… తరువాత రాజేంద్రప్రసాద్‌తోనూ ఘర్షణ… ఇండస్ట్రీ ఇక ఆమెను దూరం పెట్టేసింది… మగ ఇగోస్ అలా చాలామందిని ఇండస్ట్రీ నుంచి తరిమేశాయి… అదే మగత్వం అనుకునే హీరోలూ ఉన్నార్లెండి… హిందీలో ‘సీయూఎట్‌నైన్’ అనే సినిమా ఎందుకు చేశానురా దేవుడా అని బాధపడిందట… (అబ్బో, అది మరీ ఏ ట్రిపుల్ ప్లస్ కేటగిరీ)…
ముఖ్యంగా మాళవిక అనగానే అప్పట్లో రాజేంద్రప్రసాద్‌తో జరిగిన గొడవ గుర్తొస్తుంది… ఏదో సీన్ లేదా సాంగ్‌లో మీద పడి కొరికేశాడని గాయి గాయి చేసింది… కంప్లయింట్ చేస్తానని రెడీ అయితే అందరూ వద్దన్నారు, తరువాత తరిమేశారు… (రాజేంద్రప్రసాద్ బిహేవియర్ మీద ఆమధ్య శ్రీరెడ్డి చాలా విషయాలు చెప్పినట్టుంది… ఆ మధ్య ‘ఓ బేబీ’ అనే సినిమా సెట్టులో తాగి గొడవ చేశాడనే విమర్శలు కూడా వచ్చినయ్…) ఆలీ దాన్ని మరోసారి కెలకడానికి ప్రయత్నించాడు గానీ, ఆమె నవ్వుతూ దీనిపై ఏమీ చెప్పడానికి ఇష్టపడలేదు… దాటవేసింది… అసహ్యం కావచ్చు కూడా…
నిజానికి ఒకవేళ అప్పుడు జరిగింది యథాతథంగా చెప్పినా సరే, దాన్ని అలాగే ప్రసారం చేయగలదా ఈటీవీ..? ఆలీ దాన్ని అలాగే ఉంచేస్తాడా..? నెవ్వర్… అంత సీన్ లేదు, లేనప్పుడు కెలకడం దేనికీ అంటారా..? ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుందనో, లేక ప్రసారానికి ఇబ్బంది లేకుండా చెబుతుందనో అనుకుని ఉంటాడు ఆలీ..!!
Share this Article