నిజమే… నటి, గాయని మమత మోహన్ దాస్ అన్నది నిజమే… కేన్సర్ చికిత్స తీసుకుంటూ, కీమెథెరపీతో జుట్టు రాలిపోతున్నప్పుడు కూడా నాగార్జున పర్లేదు అని షూటింగులో పార్టిసిపేట్ చేశాడని చెబుతోంది… నాగార్జునలో ఆ మానవీయ కోణం ఉంది… అయితే హీరోయిన్ల పట్ల మాత్రమేనా..? అందరితోనూ అలాగే ఉంటాడా మాత్రం తెలియదు…
ఖచ్చితంగా ప్రతి హీరోయిన్ నాగార్జున దగ్గర కంఫర్ట్ ఫీలవుతారు… తనను ఓ మంచి దోస్త్‌గా భావిస్తారు… చాలామంది తారలు చెబుతుంటారు ఇలా… విషయంలోకి వెళ్తే… మమత మోహన్‌దాస్ మొదట మంచి గాయని… తరువాత ఈమెలో మంచి నటి ఉంది, హీరోయిన్‌గా కూడా పనికొస్తుంది అని గమనించి యమదొంగలో ఓ పాత్ర ఇచ్చాడు… నిజం చెప్పాలంటే హీరోయిన్ ప్రియమణిని మమత డామినేట్ చేసింది… ప్రత్యేకించి జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రతిగా యముడి ప్రాంక్ వేషంలో ఇరగేసింది…
దాంతోనే ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది… ఈ కేరళ కుట్టి పాడిన పాటల్లో ‘రాఖీ రాఖీ’ ‘ఆకలేస్తే అన్నం పెడతా’ ‘ఓలమ్మీ తిక్కరేగిందా’ వంటి పాటలు పాపులరయ్యాయి.. యమదొంగ సక్సెస్ తరువాత ఆమెకు కృష్ణార్జున, విక్టరీ, హోమం, చింతకాయల రవి, కింగ్, కేడీ వంటి పెద్ద ప్రాజెక్టుల్లో పాత్రలు వచ్చాయి… ఆమె తనను నటిగా ప్రూవ్ చేసుకుంది… అయితే కింగ్ విషయంలో తనకు ఓ కథ చెప్పి, భిన్నంగా సినిమా తీశారని, శ్రీను వైట్ల పట్ల ఆమె అసహనాన్ని కూడా వ్యక్తం చేసింది… ఆమెను అనుష్క ప్లేసులో అరుంధతి కోసం అడిగారు మొదట్లో… అది చేసి ఉంటే ఆమె రేంజ్ ఇంకోరకంగా ఉండేది… తన మేనేజర్ మాటలు నమ్మి ఆ సినిమా చేయలేదు ఆమె…
Ads
గ్లామర్, నటనలో మెరిట్, డెడికేషన్ గట్రా చూసి నాగార్జున కేడీ సినిమాలో ఫుల్ లెంత్ రోల్ ఇచ్చాడు… ఆమె ఒక్కసారిగా ఎంత ఎదిగిందో ఒక్కసారిగా ఆమె అంతగా డీలాపడిపోయింది… కేన్సర్ బారిన పడింది… హాడ్‌కిన్స్ లింఫోమా అనే ఆ కేన్సర్ నయమయ్యేదే, కానీ చికిత్స పెయిన్ ఫుల్… మొహం రూపురేఖలు మారిపోతాయి, జుట్టు రాలిపోతుంది, నీరసం, బరువు తగ్గిపోవడం సహజం…
ఇదేమో గ్లామర్ ఫీల్డ్… అందుకే సినిమా చేయలేనని నాగార్జునకు చెబితే… ఈ సమయంలోనే ఫైనాన్షియల్, మోరల్ సపోర్టు అవసరమని చెప్పి, ఆమెను అలాగే సినిమాలో కంటిన్యూ చేశాడు నాగార్జున… మిగతా 99 శాతం మనకు నచ్చని అవలక్షణాలున్నా సరే, ఈ ఒక్క శాతం మానవీయ కోణం నాగార్జున డిఫరెంట్ హీరో అని నిరూపిస్తుంది…
నిజానికి సాధారణంగా ఈ స్థితిలో ఏం జరుగుతుంది..? ఆడవాళ్లను సరుకుగా భావించే ఇండస్ట్రీ కదా… నీ సేవలు చాలులేమ్మా అని చెప్పి, నిర్దాక్షిణ్యంగా పంపించేస్తారు… వేరే కొత్త మొహాన్ని తెచ్చిపెట్టుకుంటారు… చికిత్స జరిగే రోజుల్లో కనీసం వెళ్లి సపోర్ట్ ఇచ్చేవాళ్లు కూడా కరువే ఇండస్ట్రీలో… డబ్బు, భజన, ఫేమ్ ఇండస్ట్రీని పాలిస్తుంటాయి కదా… కానీ నాగార్జున ఆ విషమ సమయంలో ఆమెకు సపోర్టుగా నిలబడ్డాడు… ఆమెకు రెండుసార్లు క్యాన్సర్, ఇప్పుడు విటిలిగో అనే మరో సమస్య… బ్యాడ్ లక్…. ‘‘ఆ టైంలో నాకు ఆయన దేవుడిలా కనిపించారు’’ అని ఎమోషనల్ అయిపోయింది ఆమథ్య ఏదో ఇంటర్వ్యూలో… ఆమె మాటలో తప్పులేదు… నాగార్జున మెప్పు కోసం చెబుతున్న కృత్రిమ కృతజ్ఞతలూ కావు… మనసు లోపల నుంచి వచ్చిన ధన్యవాద భావన…!!
Share this Article