.
సాధారణంగా ఒక స్టార్ హీరో అంటే వందల మందిని కొట్టాలి, రొమాన్స్ చేయాలి, భారీ డైలాగులు చెప్పాలి… ఎలివేషన్లు… ఓ మానవాతీత వ్యక్తిలా, శక్తిలా వేషాలు… కానీ మమ్ముట్టిని నిజంగా అభినందించాలి… ఫార్ములా చట్రంలో బిగుసుకుపోకుండా… అన్నీ దాటేసి ‘నటుడికి వయసుతో సంబంధం లేదు.. కేవలం పాత్రతోనే పని’ అని నిరూపిస్తున్నాడు…
మమ్ముట్టి గత కొన్నేళ్లుగా ఎంచుకుంటున్న పాత్రలు గమనిస్తే ఆయన మీద గౌరవం పెరుగుతుంది…
Ads
-
భ్రమయుగంలో ఆ వికృతమైన నవ్వుతో భయపెట్టిన కొడుమొన్ పొట్టిగా…
-
కాతల్ – ది కోర్ సినిమాలో సమాజం ఏమనుకుంటుందో అని భయపడే ఒక సున్నితమైన గే (Gay) పాత్రలో…
-
ఇప్పుడు కలాం కావల్ లో ఎటువంటి ఎమోషన్ లేని, అత్యంత క్రూరమైన సైకో కిల్లర్‌గా…

ఒక్కో పాత్ర ఒక్కో రకం. ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన చూపుల్లో ఉండే ఆ ‘శూన్యం’ (Vagueness), గొంతులో ఉండే ఆ గంభీరత్వం మనిషిని వెన్నులో వణుకు పుట్టిస్తాయి… ఒక సీరియల్ కిల్లర్‌కి ఉండాల్సిన ఆ వికృతానందాన్ని ఆయన తన కళ్లతోనే పండించారు… 70 ఏళ్ల వయస్సులోనూ తనలోని నటుడిని తృప్తిపరుచుకుంటున్న… ఓ నిజమైన నటుడు…
కథా నేపథ్యం…. కేరళలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో.. విలన్ ఎవరో ముందే తెలిసిపోతుంది… కానీ, ఆ కిల్లర్ మైండ్ ఎలా పనిచేస్తుంది..? అతడిని పట్టుకోవడానికి ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ (వినాయకన్) చేసే ప్రయత్నం ఏంటి…? అనేదే అసలు కథ… మలయాళ దర్శకులు క్రైమ్, ఇన్వెస్టిగేషన్ స్టోరీలు ఎలా తీస్తారో తెలుసు కదా… ఎక్కడా తీసిపోదు సినిమా…
ప్లస్ పాయింట్స్…
-
మమ్ముట్టి పర్ఫార్మెన్స్…: సినిమా మొత్తానికి ఆయనే వెన్నెముక… ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, ఒక రకమైన ఇంటెన్సిటీ క్రియేట్ అవుతుంది…
-
వినాయకన్ నటన…: ‘జైలర్’లో విలన్‌గా అలరించిన వినాయకన్, ఇందులో పోలీస్ పాత్రలో మమ్ముట్టికి గట్టి పోటీ ఇచ్చాడు…
-
మేకింగ్, మ్యూజిక్: సినిమా మూడ్ ని సెట్ చేయడంలో టెక్నికల్ టీమ్ సక్సెస్ అయింది… బిజీఎం (BGM) ప్రతి సీన్‌ని ఎలివేట్ చేసింది…
మైనస్ పాయింట్స్…
-
నెమ్మదైన కథనం…: ఇది అందరికీ నచ్చే మసాలా సినిమా కాదు… స్లో-బర్న్ థ్రిల్లర్ కావడం వల్ల కొంతమందికి లెంగ్త్ ఎక్కువ అనిపించవచ్చు…
-
నిడివి…: సెకండాఫ్‌లో కొన్ని సీన్లు ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది….
ముగింపు…. మమ్ముట్టి తనలోని నటుడిని తృప్తి పరుచుకోవడానికి పడుతున్న తపన చూస్తుంటే ముచ్చటేస్తుంది…. రొటీన్ ఫార్ములా సినిమాలు బోర్ కొట్టిన వారికి, ఒక డార్క్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి ‘కలాం కావల్’ ఒక మంచి ఛాయిస్…
మమ్ముట్టి నటన కోసం మాత్రమే కాదు, ఒక క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉండాలో తెలుసుకోవడానికి కూడా ఈ సినిమా చూడొచ్చు.... 80 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు సహా పలుభాషల్లో సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగులో ఉంది..!
Share this Article