స్కేటింగ్ నేపధ్యంలో తీయబడిన మొదటి తెలుగు సినిమా కావచ్చు 1974 లో వచ్చిన ఈ మంచి మనుషులు సినిమా . ఈ సినిమా కోసం శోభన్ బాబు , మంజుల స్కేటింగ్ నేర్చుకుని ఉంటారు . జగపతి బేనర్లో వి బి రాజేంద్రప్రసాద్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మ్యూజికల్ & విజ్యువల్ హిట్ .
సినిమా సగంపైన సిమ్లా , మనాలీల్లో షూట్ చేయబడింది . సినిమా కూడా చాలా posh గా ఉంటుంది . నాగభూషణం బంగళా సెట్టింగ్ అదిరిపోతుంది . సిమ్లాలో పాటలు తెలుగు సాధారణ ప్రేక్షకులకు కనువిందు చేసాయి . పాటల్లో శోభన్ బాబు వేసుకున్న పూల పూల చొక్కాల వంటివి నేనూ కుట్టించుకున్నా .
సినిమా విజయానికి కధ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం ఎలా అయితే కారణమో , ఈ సినిమాకు కె వి మహదేవన్ సంగీతం అంతే కారణం . పడకు పడకు వెంటపడకు , విను నా మాట విన్నావంటే జీవితమంతా పూవుల బాట , హరిలో రంగ హరీ , నేను లేక నీవు లేవు , నిన్ను మరచిపోవాలని , పెళ్ళయిందీ ప్రేమ విందుకు వేళయింది పాటలు బాగా హిట్టయ్యాయి . ఆరుద్ర వ్రాసిన విను నా మాట పాట తప్ప మిగిలిన పాటలన్నీ ఆత్రేయే వ్రాసారు . సుశీలమ్మ , బాల సుబ్రహ్మణ్యంలు పాడారు .
Ads
జగ్గయ్య , అంజలీదేవి , నాగభూషణం , ముక్కామల , రావు గోపాలరావు , కె వి చలం , రాజబాబు ప్రభృతులు నటించారు . హిందీలో వచ్చిన ఆగలే లగజా సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . హిందీలో శశికపూర్ , శతృఘ్నసిన్హా , షర్మిలా టాగోర్ నటించారు . మాస్టర్ టిటూ రెండు భాషల్లోనూ నటించాడు .
హైదరాబాద్ సుదర్శన్లో షిఫ్టులు లేకుండా 175 రోజులు ఆడింది . హైదరాబాదులో 25 వారాలు ఆడిన శోభన్ బాబు మొదటి సినిమా ఇది . శోభన్ బాబు , మంజుల జోడీ బాగా క్లిక్ అయింది . సినిమా యూట్యూబులో ఉంది . చూడనివారు తప్పక చూడవచ్చు . An entertaining , emotional , musical and feel good movie ……… ( By డోగిపర్తి సుబ్రహ్మణ్యం )
Share this Article