Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమ్మాయిని పందెంలో ఓడిపోతే… అది ‘మంచి రోజులు వచ్చాయి’ అట..!

June 4, 2024 by M S R

Subramanyam Dogiparthi…. కాస్త ఎర్ర సినిమా . ఇదోరకం క్లాస్ వార్ సినిమా . పేదలకు పెత్తందార్లకు మధ్య జరిగే సినిమా . 1971 లో తమిళంలో వచ్చిన సవాలే సమాలి సినిమాకు రీమేక్ మన మంచిరోజులు వచ్చాయి సినిమా . తమిళంలో వంద రోజులు ఆడి కమర్షియల్ గా కూడా బాగా సక్సెస్ అయిన సినిమా . మన తెలుగులోకే కాదు ; కన్నడ , మళయాళ , హిందీ భాషల్లోకి కూడా రీమేక్ అయింది .

1972 మే 12 న రిలీజయిన మన తెలుగు సినిమా ఎందుకనో తమిళ సినిమా అంత సక్సెస్ కాలేదు . ఈ సినిమా బాగా గుర్తు ఉండటానికి కారణం దేవులపల్లి వారు వ్రాసిన నేలతో నీడ అన్నది నను తాకరాదని పగటితో రేయి అన్నది పాట . టి చలపతిరావు సంగీత దర్శకత్వంలో పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాయి . ఈనాటి సంక్రాంతి అసలైన పండగ , ఎగిరే గువ్వ ఏమంది విసిరే గాలి ఏముంది , సిరిపల్లె చిన్నది చిందులు వేస్తున్నది పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . హిట్టయ్యాయి కూడా .

ఓ పేదవాడు , ఓ పెత్తందారు పంతాలకు పోయి పందెం వేసుకుంటారు . పెత్తందారు ఓడిపోతే తన గారాల కూతురిని పేదవాడికిచ్చి పెళ్లి చేయాలి . పెత్తందారు ఓడిపోతాడు . ఊళ్ళో ఓ పేదవాడితో పెళ్ళి జరిపిస్తారు . ఈ సినిమాలో నాకెందుకో ఈ పందెం అస్సలు నచ్చలేదు . ఇరవయ్యో శతాబ్దంలో కూడా ఆడవాళ్ళని పందెం వస్తువుగా చూపడం నాకు నచ్చకపోవటమే కాదు , కోపం కూడా వచ్చింది . Of course . సినిమాయే అనుకోండి . పైగా వాళ్ళ డబ్బులు , వాళ్ళిష్టం . (ఒక అమ్మాయి ఆమెతో ఏ ప్రమేయం లేకుండా ఓ పేదోడికి, అదీ ఏదో బెట్టింగ్ కారణంగా పెళ్లి చేయాల్సి వస్తే… అది సోషలిజం స్థాపనా..? మంచి రోజులు వచ్చాయనే టైటిలా..?)

Ads

ANR , కాంచన , కృష్ణంరాజు , నాగభూషణం , గుమ్మడి , ధూళిపాళ , అంజలీదేవి , గీతాంజలి ప్రభృతులు నటించారు . తమిళంలో శివాజీ , జయలలిత , నంబియార్ , యస్ వరలక్ష్మి నటించారు . మన తెలుగు సినిమాకు వి మధుసూధనరావు దర్శకుడు . ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి ఈ సినిమాకు అసోసియేట్ దర్శకుడు .

ఈ సినిమాను చిలకలూరిపేటకు సైకిళ్ళు వేసుకొని వెళ్లి మరీ చూసాం . ఆరోజుల్లో మా నరసరావుపేటకు ఫస్ట్ రిలీజులు ఉండేవి కావు . సినిమా వీడియో కానీ , పాటల వీడియోలు కానీ ఎందుకనో యూట్యూబులో లేవు . తమిళ సినిమా ఉంది . జయలలిత అభిమానులు చూడవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

May be an image of 3 people and text

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎహె పో… నేను అసలే ఆడను… అదసలు బౌలింగే కాదు…
  • అసలు ప్రమాదం సీమైన్స్..! మీ చావు మీరు చావండి అంటున్నయ్..!!
  • అందరూ శుద్ధపూసలే..! రోత, బూతు వ్యాప్తిలో అందరూ ప్రసిద్ధులే..!!
  • క్రిస్టినా కోచ్… మంచు ధ్రువాలు, విశ్వాంతరాలే ఆమెకు ఇష్టమైన సవాళ్లు…
  • వివాదాస్పద సింగర్ మంగ్లిపై అక్రమ వసూళ్ల కేసు నమోదు..!!
  • అల్గా‘రిథమ్’ కాదు, స్కోర్ల ఈక్వేషన్ కాదు… లైఫ్ అంటేనే ఎమోషన్..!!
  • బీఆర్ఎస్‌లో హరీష్‌రావు ఒంటరి అయిపోతున్నాడా..? ఏమవుతోంది..?
  • మావిగన్ ప్రతిపాదన కాదు, సూచన కాదు, వెటకారం కాదు… అదొక హెచ్చరిక…
  • చర్చల దారి చర్చలదే… మరో అమెరికన్ నిఘా డ్రోన్ కూల్చివేత…
  • మీడియా రాజ్యాధికారాన్ని శాసించదు… శాసించగలమనే భ్రమల్లో ఉంటుంది…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions