.
ఇంటింటి రామాయణమే కావచ్చుగాక… అత్యంత కోపిష్టిగా కనిపించే మోహన్‌బాబు కుటుంబంలో తగాదాలు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశం…
ఎందుకంటే… తను హీరో, వెటరన్ హీరో… ఇద్దరు కొడుకులు హీరోలు… బిడ్డ హీరోయిన్… చిత్రవిచిత్రమైన స్టేట్‌మెంట్లకు ప్రసిద్ధులు… వాళ్లలోవాళ్లు తన్నుకుంటున్నారు కాబట్టే వార్తల్లోకి ఎక్కారు… పరువు పోతోంది…
Ads
అబ్బే, ఏం లేదు, ఏమీ లేదు, అని వాళ్ల పీఆర్ ఏజెన్సీలు ప్రకటనలు చేస్తుంటాయి కానీ… మీడియా కళ్లు కప్పలేరు… మనోజ్ బ్యాండేజీలు, హాస్పిటల్ రిపోర్టులు దాచలేరు… వెంట భార్య మౌనిక కూడా ఉంది… మోహన్‌బాబు ముఖ్య అనుచరుడు ఎవరో బౌన్సర్లతో ఏకంగా మోహన్‌బాబు కొడుకు మీదే దాడి చేయించడం ఓ విభ్రాంతి…
ఇదే మోహన్‌బాబు సమాజానికి నీతులు చెబుతాడు… మరోవైపు తన కొడుకు విష్ణు ఏకంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు… ఇక దాచీ దాచీ లాభం లేదని ఎప్పుడైతే తన కొడుకు తన మీదే పోలీసులకు ఫిర్యాదు చేశాడో, తన కుటుంబానికి తన తండ్రితోనే ప్రాణాపాయం ఉందని చెప్పాడో ఇక మోహన్‌బాబూ అదే పనిచేశాడు…
తనకెే ప్రాణహాని ఉందని ఉల్టా రిపోర్ట్ చేశాడు… ఇంటి దగ్గర బౌన్సర్లు… విష్ణు, లక్ష్మి ఏం చేస్తున్నారో, ఏం స్పందించారో తెలియదు… కానీ కుటుంబం బజారున పడింది… అది నిజం… ఈ వార్తను ఖండించలేరు… ఐతే..?
ఇదంతా దేనికి..? ఆస్తులు, పంపకాల గొడవ… నలుగురు పెద్ద మనుషుల నడుమ తేల్చేసుకుని, ఎవరి బతుకులు వాళ్లు బతకాల్సిన కథ… కానీ వాళ్లలో ఎవరూ పెద్ద మనుషులు చెబితే బాపతు కాదు కదా… అందుకే ఇలా బజారున పడ్డారు… సెలబ్రిటీలు కాబట్టి మీడియాలో పడ్డారు… ఇజ్జత్ పజీత అయిపోయింది…
ఏముంటాయి..? పోలీసులకు ఫిర్యాదు చేస్తే చిల్లర దాడి కేసులు… వాటితో ఒరిగేదీ లేదు, పోయేదీ లేదు… ఆస్తి పంపకాల తగాదాలనూ పోలీసులు పరిష్కరించలేరు… కావాలంటే పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తాం, మరీ గాయాలయ్యేలా తన్నుకుంటే కేసులు పెడతాం, మీరూ మీరూ కోర్టులో తేల్చుకొండి అంటారు…
సివిల్ కేసులు వేరు, క్రిమినల్ కేసులు వేరు… ఎందుకైనా మంచిదని మనోజ్, మోహన్‌బాబు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు… మనోజ్‌కు కలిసొచ్చిన ఆస్తి ఎంత..? విష్ణుకు అత్తింటి నుంచి కలిసొచ్చిన ఆస్తి ఎంత..? లక్ష్మికి ఏమిస్తున్నారు..? అసలు మోహన్‌బాబు సొంతంగా సంపాదించింది ఎంత..? ఈ నిజాలు ఏమీ బయటకు రావు…
కానీ పోయేది మాత్రం కుటుంబ పరువు… గతంలో తమ కుటుంబంపై ఏదైనా రాస్తే, వీడియోలు చేస్తే విష్ణు, మోహన్‌బాబు లీగల్ నోటీసులు పంపించేవాళ్లు… యూట్యూబ్‌కు ఫిర్యాదులు చేసి ఆయా చానెళ్లను ఆపు చేయించేవాళ్లు… కానీ మీరే బజారున పడి కొట్టుకుంటున్నారు కదా, ఇప్పుడు జనంలో పరువు మొత్తం పోయాక ఇక ఎవరిని కంట్రోల్ చేస్తారు మోహన్‌బాబు గారూ… ఇంత బతుకు బతికీ చివరకు…!!
Share this Article