Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ ఇద్దరు నిజవియ్యంకులూ నటించిన బాపు మార్క్ సినిమా…

April 28, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …. చిరంజీవి తండ్రి వెంకటరావు గారు కూడా నటించిన  సినిమా ఈ మంత్రి గారి వియ్యంకుడు . అదీ మంత్రి గారి పాత్రలోనే . అయితే తండ్రీకొడుకులకు కలిసిన సీనేదీ లేదు . అల్లు రామలింగయ్యకు వెంకటరావు గారికి మాత్రమే ఉంటుంది ఆ సీన్ . విశేషం ఏమిటంటే నిజ జీవితంలోనూ వీరిద్దరూ వియ్యంకులు కావడం .

చిరంజీవి జైత్రయాత్రలో మరో మైలురాయి 1983 నవంబరులో వచ్చిన ఈ క్లాసిక్ మసాలా సినిమా . బాపుతో చిరంజీవికి ఇది రెండో సినిమా . ఆయన నటించిన 63 వ సినిమా . మళయాళంలో సక్సెస్ అయిన ఓ సినిమా రైట్స్ నలభై వేల రూపాయలకు కొని 22 లక్షల బడ్జెటుతో నలభై రోజుల్లో తీసారు .

Ads

తరచూ ఏదో ఒక చానల్లో వస్తూనే ఉండే ఈ బాపు- రమణల మార్క్ క్లాస్ మసాలా ఫస్ట్ రిలీజులో ఖైదీ సినిమా బాధిత.. . ఖైదీ విడుదలయిన వారం రోజులకే రావడం వలన వంద రోజులు ఆడలేకపోయింది . ఆరు కేంద్రాలలో యాభై రోజులు ఆడింది . డబ్బులు బాగానే వచ్చాయట .

ఒక సినిమా విజయానికి డబ్బులు కొలబద్ద అయినా ప్రేక్షకుల మనసుల్లో ఎలాంటి స్థానం పొందింది అనేదీ ముఖ్యమే . ఈరోజుకీ ప్రేక్షకులను అలరించే సినిమా ఇది . హీరోయిన్ మైనస్ పాయింటేమో అని అనిపిస్తుంది . తమిళ, మలయాళాల్లో పెద్ద హీరోయిన్ పూర్ణిమ భాగ్యరాజ్ . (భాగ్యరాజా భార్య)…

ఆమె నిర్మాత చాయిస్ అంటారు . తెలుగులో హీరోయినుగా ఆమె ఈ ఒక్క సినిమాలోనే నటించింది . (ఒకటీరెండు డబ్బింగ్ మూవీస్ తెలుగులో వచ్చినట్టున్నయ్)… ఈమధ్య 2019 లో తల్లి పాత్రలో నిను వీడని నీడను నేనే సినిమాలో నటించింది . Of course . హీరోయిన్ ఎవరయినా ఖైదీ దెబ్బకు నిలబడటం కొంచెం కష్టమే అనుకోండి .

చిరంజీవి ఉన్నాడు కాబట్టి ఆయన్నే హీరో అనక తప్పదు . వాస్తవానికి ఈ సినిమాలో హీరో అల్లు రామలింగయ్యే . అల్లు తల్లి లేని పిల్లలతో రావి కొండలరావు- నిర్మలమ్మల దగ్గర పనిచేస్తూ ఉంటాడు . కాలక్రమంలో అదృష్టం కలిసొచ్చి డబ్బు చేస్తుంది .

డబ్బుతో పాటు అహం , పటాటోపం , వగైరాలు వస్తాయి . ఇంట్లో ఓ సర్కిల్ , ఓ లాయరూ అల్లుళ్ళుగా ఉంటారు . పెళ్ళి కాని డాక్టర్ కొడుకు శుభలేఖ సుధాకర్ నర్సమ్మ తులసిని ప్రేమిస్తాడు .

కూతురు పూర్ణిమను కాలేజీలో కొబ్బరి పదార్ధాలతో టీజ్ చేసే హీరో చిరంజీవితో ఫైటింగులు చేసీ చేసీ అలిసి లవ్వులో పడిపోతుంది . అల్లు కూతురు కొడుకు రావి కొండలరావు- నిర్మలమ్మల కొడుకు కూతుళ్ళను ప్రేమిస్తారు . సంబంధం మాట్లాడుకోవటానికి రమ్మని అవమానిస్తాడు అల్లు .

అన్నపూర్ణమ్మ పాత్రలో నిర్మలమ్మకు , కుటుంబ సభ్యులకు తిక్క రేగుతుంది . ఇంతలో ఎన్నికలు వస్తాయి . నిర్మలమ్మ MLA గా గెలిచి క్లైమాక్సులో ధనామని మంత్రి అయిపోతుంది . అల్లు మంత్రి గారి వియ్యంకుడు అయిపోయి తన జీవిత కాల కోరికయిన మంత్రి గారి వియ్యంకుడు కోరికను తీర్చుకుంటాడు .

చిరంజీవి కాలేజి కుర్రోడిగా చాలా హుషారుగా , చలాకీగా , అల్లరిగా , రొమాంటిగ్గా బాగా నటించాడు . ఈ సినిమాలో ప్రధానంగా మెచ్చుకోవలసింది అల్లు రామలింగయ్య , నిర్మలమ్మలనే . పోటాపోటీగా నటించారు . సత్యనారాయణ రాజకీయ విలనాసురుడిగా బాగా నటించాడు .

స్క్రీన్ ప్లేని బిర్రుగా తయారు చేసుకున్న ముళ్ళపూడి ప్రతీ పాత్రకు ప్రాధాన్యతను కల్పించారు . రాళ్ళపల్లి , నూతన్ ప్రసాద్ , రావి కొండలరావు , తులసి , శ్రీలక్ష్మి ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు . సినిమాలో క్లైమాక్స్ సీన్ చాలా ఆర్ద్రంగా , ఇంటెన్సివుగా ఉంటుంది . అల్లు రామలింగయ్య , నిర్మలమ్మలు తినేసారు .

ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వేటూరి వారి పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాయి . టీజింగ్ పాటలు , డ్యూయెట్లు కుర్రకారుకు బాగా నచ్చాయి . ఛీ ఛీ పో పాపా ఒప్పుల కుప్పా , ఏమని నీ చెలి పాడెదనూ , సలసలా నను కవ్వించనేల , కోకోనట్ మనకు దోస్తీ , మనసా శిరసా నీ నామమే పాడెద ఈ వేళ పాటలు బాగుంటాయి .

అమ్మ కాదె బుజ్జి కాదె నాపై కోపమా దానికదే దీనికదే అంటే నేరమా అంటూ చిరంజీవిని పూర్ణిమ టీజ్ చేసే పాట చాలా బాగుంటుంది . చిరంజీవి బుంగ మూతితో అందంగా కనిపిస్తాడు . ఎలక్షన్ల సమయంలో కొలువైనాడే ఊరికి కొలువైనాడే మా కొబ్బరికాయల సుబ్బారాయుడు పాట కాలేజి కుర్రాళ్ళతో హుషారుగా ఉంటుంది .

ఎక్కడా బోరించకుండా సాగే ఈ సినిమా చిరంజీవికి మంచి పేరే తీసుకొని వచ్చింది . యూట్యూబులో ఉంది . చిరంజీవి అభిమానులు కానివారు కూడా చూడతగ్గ సినిమా . A feel good , romantic , classic , masala movie .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యాక్టింగ్ సీఎం మీనాక్షి పట్ల పొంగులేటి డోన్ట్ కేర్ యాటిట్యూడ్..!!
  • ఫిష్ వెంకట్‌కు హీరో ప్రభాస్ సాయం..? నిజమా..? అబద్ధమా..?
  • కడుపు పండించిన AI … కృత్రిమ గర్భధారణలో కృత్రిమ మేధస్సు..!!
  • వనతి శ్రీనివాసన్… జేపీ నడ్డా ప్లేసులో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు..?!
  • ఆకుపచ్చని సూరీడు అల్లూరికి బెంగాలీ అరవింద్ ఘోష్ శిక్షణ..?!
  • జనాదరణలో దుమ్మురేపుతున్న మన యువ గాయకుడు…
  • పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ ఔట్… ఒక్కొక్కటీ బయటపడుతున్నయ్…
  • నా వెనకాల ఎందుకు నిలబడ్డారు? – ప్రవచనకర్త చాగంటి క్లాస్ …
  • హరిహరా… ఓ వీరమల్లూ… నీ కథెప్పటిది..? ఆ చార్మినార్ ఎప్పటిది..?!
  • ఒకే గది… ఒకే రోజు… కథ అక్కడక్కడే తిరిగే ‘షో టైమ్’… రక్తికట్టింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions