‘‘ఒక పేద బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది… చివరకు ప్రాణాలు వదిలింది… నిందితులు అధికార పార్టీ టీఎంసీకు చెందినవారు……’’ సపోజ్, ఇది వార్త అనుకొండి… మామూలుగా ఇలాగే రాస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు భ్రష్టుపట్టిపోయినయ్, పరిపాలన లేదా, అధికార పార్టీ అరాచకాలకు అంతే లేదా, మనుషులు ఇక్కడ బతికేదెట్లా అనే భావనను వ్యాప్తి చేసినట్టవుతుంది… అది బెంగాల్‌కు ఎంత అప్రతిష్ట..? నియంత మమతకు ఎంత నగుబాటు..? సో… అందుకని…
ఇలాంటి నెగెటివ్ వార్తనైనా సరే, పాజిటివ్ వార్తగా మలచాలి… జనంలోకి తీసుకోవాలి… అదే వార్తను ‘‘ఓ పేద బాలికకు చాలామందితో సంబంధాలు ఉండేవి… అవి అదుపు తప్పి, మైండ్‌పై నియంత్రణ కోల్పోయి, కుప్పకూలి మరణించింది… స్థానిక టీఎంసీ శ్రేణులు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చారు…’’ ఇలా రాసుకోవచ్చు, పర్లేదు… నిజానిజాలు ఎవడికి కావాలి..?
ఛిఛీ, ఇదే జర్నలిజం..? ఇంత నీచంగా ఉంటుందా, ఇలా రాస్తారా ఎవడైనా..? అనిపిస్తోందా…? ఏమో మరి… మమత చెబుతున్నది దాదాపు ఇలాగే ఉంది… నెగెటివ్ వార్తల్ని కూడా పాజిటివ్ వార్తలుగా మలిచి రాయాలట… ‘‘గ్రామీణ జర్నలిస్టులకు నా అప్పీల్ ఇది… నెగెటివ్ స్టోరీలను పాజిటివ్ స్టోరీలుగా మల్చండి… పాజిటివిటీపైనే ఫోకస్ చేయండి… ఖచ్చితంగా మీకు ప్రభుత్వ యాడ్స్ వస్తాయి…’’ అని చెబుతోంది ఆమె… ఇంకా చాలా ఉన్నయ్ ఆమె నీతులు… జస్ట్, ఆమె మనస్తత్వం ఏమిటో, మీడియా మీద ఎంత అసహనంగా ఉందో, పక్కాగా అర్థమవుతుంది మనకు… సోమవారం కోల్‌కతాలో మిలన్ మేళా సందర్భంగా చెప్పింది…
Ads
‘‘నెగెటివ్ స్టోరీలతో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర సాగుతోంది…
ఎక్కడ చిన్న తోక పటాకు పేలినా సరే అది టీఎంసీ పనే అని రాసేస్తారు… ప్రసారం చేస్తారు… ఇలాంటి విద్యలో ఆనందబజార్‌ను మించిన పత్రిక లేదు…
అలాంటి పత్రికలు కూడా ప్రభుత్వ యాడ్స్ పొందుతున్నాయి… ఇక నా ఓపికకూ హద్దులుంటయ్… ప్రభుత్వమే కాదు, ఇలాంటి పత్రికలకు యాడ్స్ ఇచ్చే కంపెనీల మీద కూడా ఓ దృష్టి పెడతాను…
మీ చానెళ్లలో ఇంధన ధరల మీద ఎన్ని డిబేట్లు పెట్టారో చెప్పండి…
ప్రజలు కూడా ఎంచక్కా టీవీ సీరియళ్లు చూడటం బెటర్, ఈ పిచ్చి వార్తా చానెళ్లను చూడకండి… స్టార్ జల్సా, జీటీవీ సీరియళ్లు చూసేయండి… న్యూస్ చానెళ్లు చూస్తే మెంటల్ పొల్యూషన్ గ్యారంటీ…
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో మానవత్వం మరణించింది, రక్తపాతం, మరోవైపు శ్రీలంక కొలాప్స్ అయిపోయింది, ఎంతమంది వీటిపై కథనాలు రాశారు..?
మీరు ఎక్కడో అగ్గి అంటిస్తారు, కానీ అది చాలా ఇళ్లను కాల్చేస్తుంది… మీ ఇంటిని కూడా…
విశ్వసనీయ సమాచారం మేరకు అని రాసే కథనాలు చట్టవిరుద్ధం అని గుర్తుంచుకొండి…
నేను సహిస్తున్నాను కదాని ఇలాగే పరిస్థితులు ఉంటే, మీ పరిమితులు దాటితే ఊరుకోను… ప్రభుత్వ వ్యతిరేక మీడియాకు యాడ్స్ ఇచ్చే కంపెనీలు కూడా గుర్తుంచుకోవాలి ఇది…
కలెక్టర్లకు చెబుతా… పాజిటివ్ స్టోరీస్ రాసే మీడియాకు మాత్రమే గవర్నమెంట్ యాడ్స్ ఇస్తాం… ఎవరు ఎలాంటి వార్తలు రాస్తున్నారో పోలీసులు, కలెక్టర్లు సమీక్షిస్తుంటారు…’’
Share this Article