Muchata.com Telugu Latest News

Muchata.com Provided Telugu Latest News, Political News , Political News, Breaking News in Telugu LIVE ముచ్చట

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పగలైతే దొరవేరా..! ఔను మరి… తెలుగుపాటపై దేవులపల్లి దొరతనం..!!

January 4, 2021 by M S R

అసలు సినిమా సాహిత్యం అంటే పల్లీబఠానీ, చాట్ మసాలా… ఏవో నాలుగు పిచ్చి పదాలను ఏదో దిక్కుమాలిన ట్యూన్‌లో ఇరికించి… ఢమఢమ సంగీత పరికరాలను మోగిస్తే చాలు… దానికి తెర మీద హీరోహీరోయిన్లు నాలుగు గెంతులు గెంతి, పిల్లి మొగ్గలు వేసిపోతారు… అంతా అని కాదు… 90 శాతం ఇంతే… అందులో ప్రమాణాలు, విలువలు, ప్రయోగాలు, తొక్కాతోలు చూస్తే… కనిపించేది డొల్ల… అయితే కొందరిలో ఓ దురభిప్రాయం ఉంది… వీలైనంత సంక్లిష్ట, గంభీర, అర్థం కాని పదాలతో పాట రాస్తే తమ ప్రతిభను చాటుకున్నట్టు ఉంటుందని…!

అంతకుమించిన అమాయకత్వం, మూర్ఖత్వం వేరే ఉండవు… సిట్యుయేషన్, దర్శకుడి టేస్ట్, నిర్మాత ఒత్తిడి, సంగీత దర్శకుడి తెలివి… చాలా అంశాలుంటయ్… అంతేతప్ప పాండిత్యప్రకర్ష సినిమా సాహిత్యంలో ఇమడదు… అలా చేయాలని ప్రయత్నిస్తే, భంగపడి… చివరకు సాగరసంగమం సినిమాలో కమల్‌హాసన్‌లాగా ఏడుస్తూ, వినాయకుడి ముందు విషాదనృత్యం అభినయించాల్సిందే…

vanisri

అయినా సరే, కొందరు ఇప్పటికీ, ఈరోజుకూ ఆ ఫీల్ మాత్రం వదలరు… గంభీర పదాలు, సంక్లిష్ట పదబంధాలు వాడితే ఏదో లోతైన భావన, మార్మికార్థం ధ్వనిస్తాయనేది వాళ్ల తలతిక్క భావన… ఒక పాట గుర్తుచేసుకుందాం… రాసింది దేవులపల్లి… ఇక తెలుసుగా… సంగీత దర్శకత్వం ఎస్.రాజేశ్వరరావు… ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం సినిమా… పేరు, బంగారు పంజరం… పగలైతే దొరవేరా అనేది పాట… వాణిశ్రీ, శోభన్‌బాబు అభినయం… పాడింది జానకి…


పగలైతే దొరవేరా
రాతిరి నా రాజువురా
రాతిరి నా రాజువురా…
పక్కనా నువ్వుంటే ప్రతిరాత్రి పున్నమి రా
పక్కనా నువ్వుంటే ప్రతిరాత్రి పున్నమి రా
పగలైతే దొరవేరా
రాతిరి నా రాజువురా
రాతిరి నా రాజువురా…

——-

పగలైతే నాలో నీ సొగసంతా దాగేరా
పగలైతే నాలో నీ సొగసంతా దాగేరా
రేయైతే వెన్నెలగా బయలంత నిండేరా..
రాతిరి నా రాజువురా
రాతిరి నా రాజువురా…

—–

నే కొలిచే దొరవైనా…నను వలచే నా రాజువే
నే కొలిచే దొరవైనా…నను వలచే నా రాజువే
కలకాలం ఈలాగే నిలిచే నీ దాననే
పక్కనా నీవుంటే..ప్రతిరాత్రి పున్నమి రా
ప్రతిరాత్రి..ఈ…ఈ.. పున్నమి రా…
—–
పగలైతే దొరవేరా…
రాతిరి నా రాజువురా…
రాతిరి నా…. రాజువురా…


ఇదీ ఆ పాట… దొర, రాజు, పగలు, రాత్రి, పున్నమి, వెన్నెల… ఈ పదాలతోనే పాటంతా రాసేశాడు… మళ్లీ మధురమైన భావ వ్యక్తీకరణ… పగలు ఎన్నెన్నో బాధ్యతల్లో దొరతనం వెలగబెట్టినా… రాత్రయితే మాత్రం నువ్వు నా రాజువురా అని ప్రేమగా, అధికారంతో హత్తుకుంటుంది కథానాయిక… పక్కన నువ్వుంటే ప్రతి రాత్రీ పున్నమిరా అనీ కవ్విస్తుంది… పగలు నా సొగసు, నా ప్రేమను నేను దాచుకున్నా సరే, రాత్రి కాగానే మొత్తం వెన్నెలలా పరుచుకుంటాయనీ… అందుకే నువ్వు నా రాజువురా అని తమకంతో అల్లుకుపోతుంది… లలితమైన, సరళమైన పదాలతో పాటలు రాయడం ఓ కళ… అందరికీ అది చేతకాదు… అలా రాయించుకోవడం కూడా చేతకాదు చాలామందికి… మరేటి చేస్తం…?!

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • సరికొత్త డ్రామా కంపెనీ… ఈటీవీ షో అంటేనే కామెడీ అయిపోయింది…
  • విజ్జెక్క ఆ సీటుకు ఎలా ఆప్ట్..? ఈ ప్రచారం తెరమీదికి తెస్తున్నదెవరు..?
  • ఓహ్… షర్మిల తిరుగుబాటు వెనుక ఇంత భారీ వ్యూహం దాగుందా..?!
  • తెలంగాణ సీఎం కుర్చీ అంత ఈజీయా..? జగన్-షర్మిల వార్… పార్ట్-2…
  • జగన్- షర్మిల డిష్యూం డిష్యూం..! వైఎస్ కుటుంబంలో చీలిక..! పార్ట్-1…
  • రోజాతో ఢీకి ఓంకార్ సై..! వర్షిణికి భలే చాన్స్..! అసలేం జరుగుతున్నదంటే..?!
  • కాకి బంగారం..! అల్లరిపాలైన నరేష్..! బావురుమన్న బాలయ్య టైటిల్..!!
  • లక్-కీ..! దగ్గుబాటి సురేషుడు లక్కీయేనా..? తొక్క మీద కాలేశాడా కొంపదీసి..!
  • పర్ సపోజ్, ఆమె వేరే పెళ్లిచేసుకుంటే… మాజీ భర్త వీర్యంపై హక్కులేమవుతయ్..?
  • తటస్థ నాగేశ్వరా… బీజేపీని తిట్టాలంటే భద్రాచలం రాముడు కావాలా ఏం..?

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now