.
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది, ఆగిపోలేదు, అయిపోలేదు అని మంత్రి రాజనాథ్ సింగ్ చెప్పాడు… ఇది ఓ ఇంపార్టెంట్ పాయింట్…
.
Ads
నిన్న రాత్రి దాడుల్లో మోస్ట్ నొటోరియస్ ఉగ్రవాద నేత మసూద్ అజహర్ తమ్ముడు అబ్దుల్ రవూఫ్ అజహర్ ప్రాణాలు కోల్పోయినట్లు ఒక సమాచారం వస్తోంది…. ధోవల్ టార్గెట్ లిస్ట్ లో ఉన్న మొదటి తీవ్రవాది అతను… అంటే ఆ ఉగ్రవాద సంస్థను నడిపిస్తున్నదే తను…
ఎవరో కూస్తున్నారు, ఉగ్రవాదుల బదులు ఇంట్లో ఉన్నకుటుంబ సభ్యులను, పిల్లలను పొట్టన పెట్టుకోవడం ఏమిటని..? మూర్ఖులు… ఉగ్రవాదుల శిక్షణ, రిక్రూట్‌మెంట్ అడ్డాలో కుటుంబాన్ని, పిల్లలను పెట్టుకోవడం ఏమిటో వాడిని కదా అడగాల్సింది…
సరే, వీటి మాటెలా ఉన్నా… మరో ముఖ్య విషయం… చైనా పాకిస్థాన్‌కు అమ్మిన మిసైల్ నిరోధక వ్యవస్థ పూర్తిగా నాసిరకం అనీ, అంటే, చైనా సరుకేననీ, చైనా పాకిస్థాన్ చెవుల్లో పూలు పెట్టిందనీ, అందుకే ఆ వ్యవస్థ ఇండియన్ మిసైళ్లను అడ్డుకోలేకపోయాయనీ ఓ వార్త… అదే నిజమైతే పాకిస్థాన్ అంతటి బకరా ప్రపంచంలో మరో దేశం లేనట్టు లెక్క…
నిజంగానే చైనా ఏది ఎవరికి అమ్మినా అది నాసిరకమే… అందుతున్న వార్తల ప్రకారం… లాహోర్ లోని వాల్టన్ రోడ్ లోని వాయుసేన ప్రాంతం మీద గుర్తు తెలియని సోర్సెస్ నుండి ప్రయోగించిన డ్రోన్లు దాడి చేశాయి. ఈ దాడుల్లో HQ16 అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రాడర్లు, బ్యాటరీలు దెబ్బ తిన్నాయి. HQ16 అనేది చైనా తయారు చేసిన క్షిపణి నిరోధక వ్యవస్థ…
ఈ దాడుల ముఖ్య ఉద్దేశం HQ16 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను నిర్వీర్యం చేయడమే కాకుండా డ్రోన్ లేదా క్షిపణి దాడి సమయంలో ఈ సిస్టం ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడం… బహుశా ఇప్పుడు లభించిన డేటా ఆధారంగా మరిన్ని బలమైన దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి…
ఇక్కడే పాక్ కి మరొక చిక్కు వచ్చి పడింది. చైనా నుండి దిగుమతి చేసుకున్న మరింత ఆధునిక క్షిపణి నిరోధక వ్యవస్థ HQ9 ను యాక్టివేట్ చేయాలా వద్దా అనేది… ఒకవేళ దీనిని యాక్టివేట్ చేస్తే దీని ఫ్రీక్వెన్సీ ట్రాక్ చేసి నేరుగా దానిపైనే డ్రోన్ దాడి జరిగే అవకాశం ఉంది… ఒకవేళ యాక్టివేట్ చేయకపోతే మిలియన్ల డాలర్లు వెచ్చించి కొన్న క్షిపణి నిరోధక వ్యవస్థ వ్యర్థం అవుతుంది…
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత్ 24 క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లు ప్రయోగించగా వీటిలో ఒక్క దానిని కూడా పాక్ అడ్డుకోలేక పోయింది. దీంతో చైనా నుండి దిగుమతి చేసుకున్న క్షిపణి నిరోధక వ్యవస్థ డొల్లతనం బయటపడింది…
ఇప్పుడు ఏకంగా పాక్ క్షిపణి నిరోధక వ్యవస్థ మీదే దాడులు చేస్తూ దాన్ని మొత్తం ధ్వంసం చేయాలని ఇండియన్ ఆర్మీ ప్రయత్నిస్తోంది, ప్రయోగాలు- దాడులు చేస్తోందని మరో వార్త…
ఎస్, ఇవన్నీ రకరకాల వార్తలు… మళ్లీ ఏ సోఫియా ఖురేషీయో మీడియా బ్రీఫింగులో వాస్తవాలేమిటో చెప్పాల్సిందే… నిజానికి ఆర్మీ చాలా వరకు రహస్యాలను దాచిపెడుతుంది, టైమ్ బీయింగ్… అవసరమే… ఒకవేళ క్షిపణి నిరోధక వ్యవస్థ ఫెయిల్యూర్ నిజమే అయితే… అటు బెలూచిస్థాన్ పైచేయి సాధించి గ్వాదర్ పోర్టును చేజిక్కించుకోబోతున్నదనే వార్తలూ నిజమే అయితే… పాకిస్థాన్ ఖేల్ ఖతం… ఆశిద్దాం, అదే కోరుకుందాం… (ఇన్‌పుట్స్ :: నాగరాజు మున్నూరు)
నిన్నటి నుంచీ పాకిస్థాన్ ఇండియాలోని 15 నగరాల్లోని కీలక రక్షణ మౌలిక సౌకర్యాలపై దాడులు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది… ఇండియా తిప్పికొడుతోంది… సరిహద్దుల్లో కాల్పులు పెంచి ఆల్రెడీ 16 మందిని బలిగొన్నది… అందులో ముగ్గురు మహిళలు, అయిదుగురు పిల్లలు…
దీంతో ఇండియా పాకిస్థాన్ నిఘా, నిరోధక వ్యవస్థకు చెందిన రాడార్లు, ఇతర కమ్యూనికేషన్ల ధ్వంసానికి పూనుకుంది… ఇది రక్షణ శాఖ అధికారిక ప్రకటన…
పాక్ మిలిటరీకి చెందిన అన్నిరకాల వ్యవస్థల్ని ధ్వంసం చేయాలనే లక్ష్యంతో ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది… అదీ రియాలిటీ… భారత జాతి కోరుకుంటున్నదీ అదే…
Share this Article