.
Ashok Pothraj ….. “మ్యాక్స్”… కన్నడ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన చిత్రం. కిచ్చ సుదీప్ కి కన్నడంలో స్టార్ హీరోగా క్రేజ్ ఉంది. తన పాత్రకి ప్రాధాన్యత ఉంటే, ఇతర భాషలలో నటించడానికి కూడా అత్యంత ఉత్సాహాన్ని చూపుతూ ఉంటాడు. కాబట్టే ఇతర భాషల్లోనూ తనకు మంచి గుర్తింపు ఉంది.
ఈ సినిమా కథ విషయానికొస్తే… ఒక సిటీలో ఇద్దరు మంత్రులు రాజకీయంగా చక్రం తిప్పుతూ బలమైన అనుచరులను పెంచి పోషిస్తూ, వీరి ద్వారా ప్రజలు, ఇతరులు భయపడేలా వ్యవహరిస్తుంటారు. వాళ్లకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేవారు గానీ, ఒకవేళ చెప్పినా కేస్ ఫైల్ చేసే పోలీస్ ఆఫీసర్స్ గాని ప్రాణాలతో ఉండరు.
Ads
అందువలన ఆ ప్రాంతానికి న్యూజాయినింగ్ తో రావడానికి పోలీస్ ఆఫీసర్స్ భయపడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆ సిటీకి సిఐగా సుదీప్ వస్తాడు. ఈ మంత్రుల కొడుకులైన మైఖేల్, వీరా ఇద్దరూ స్నేహితులు. తండ్రుల అధికారం చూసుకుని, తమ ఇష్టానుసారంగా నడచుకుంటూ ఉంటారు.
ఒక రాత్రి వీళ్లు తాగి కారులో గొడవ పడీ రోడ్డు మీద యాక్సిడెంట్ చేస్తారు. అది చూసి ప్రశ్నించిన పోలీసులపై చేయిచేసుకోవడంతో, సుదీప్ వాళ్లను తీసుకెళ్లి సెల్లో వేసి ఇంటికి వెళ్లిపోతాడు. ఉన్నట్టుండి ఆ రాత్రి అనుమానాస్పద స్థితిలో వాళ్లిద్దరు సెల్లోనే చనిపోతారు. అది ఎలా జరిగిందనేది ఎవరికీ తెలియక అయోమయానికి లోనవుతారు. ఈ విషయం ఆ మినిస్టర్స్ కి తెలిస్తే తమని చంపేస్తారని అటు పోలీసులు, ఇటు రౌడీ గ్యాంగ్ భయపడుతూ ఉంటారు. ఒక్క హీరో తప్ప…
ఆ ఇద్దరి శవాలను స్టేషన్ నుంచి ఎవరూ చూడకుండా తరలించే ప్రయత్నం చేస్తుండగానే, వారి అనుచరులు పోలీస్ స్టేషన్ ను చుట్టుముడతారు. అప్పుడు హీరో ఏం చేస్తాడు? ఆ స్థితిలో ఉన్న పోలీసులకు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? ఈ ఇద్దరి మరణానికి కారణం ఏమై ఉంటుంది? అనేదే కథ.
ఊరవతల బ్రిటిష్ కాలం నాటి ఒక పాత పోలీస్ స్టేషన్, ఇంకా ఆ స్టేషన్లో ఛార్జ్ తీసుకుని హీరో అక్కడ అడుగుపెట్టడంతోనే ఈ కథ మొదలవుతుంది. హీరో ముక్కుసూటి మనిషి, ఎవరికీ భయపడడు. కానీ స్టేషన్లో జరిగిన హత్యల బారి నుంచి పోలీసులను కాపాడే బాధ్యతను తీసుకుంటాడు.
అలా ఒక డిఫరెంట్ యాంగిల్ లో ఆ పాత్రను డిజైన్ చేసిన విధానం బాగుంది. అదే సమయంలో క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ ‘రూప’గా వరలక్ష్మి శరత్ కుమార్ ను రంగంలోకి దింపడంతో కథ మరింత వేడెక్కుతుంది.
ఇదే ఇంట్రెస్టింగ్ కథనంతో చూసే ఆడియన్స్ లో మరింత ఉత్కంఠను రేపుతుంది. పోలీస్ స్టేషన్లో మంత్రుల పిల్లల బాడీలు, బయట రౌడీ గ్యాంగ్ అనుచరులు, వాళ్లకి అనుకూలంగా నడుచుకునే లేడీ పోలీస్ క్రైం ఆఫీసర్, ఇలా మూడు వైపుల నుంచి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని సుదీప్ ఎలా మేనేజ్ చేశాడనే అంశమే సినిమా చూస్తున్న ప్రేక్షకులలో ఈ సస్పెన్స్ ని ఎంగేజ్ చేస్తుంది.
సుదీప్, వరలక్ష్మి శరత్ కుమార్ నటన ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ. మినిష్టర్స్ శరత్ లోహితస్య, ఆడుకాలం నరేన్, గ్యాంగ్ స్టర్స్ సునీల్, కాలకేయ ప్రభాకర్ కీలకమైన పాత్రలను పోషించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే చేయడంలో మరింత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. ఒకే ఓవర్ నైట్ లో నడిచే పూర్తి సినిమా ఇది…
కాబట్టి నైట్ టేకింగ్ విజువల్స్ తో ఫోటోగ్రఫీ హైలెవల్ గా ఉంది. సుదీప్ ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకూ వన్ మ్యాన్ షో చేసాడు. ఫైర్ ఎలివెషన్స్, జాతరలో డ్యాన్స్ చేస్తూ ఫైట్స్, స్లో మోషన్ హైలెవల్ ఎలివెషన్ సీన్స్ రచ్చ రచ్చే.
అయితే ఈ సినిమా మొత్తం ఒక రాత్రిలో తీయడం వల్ల కొన్ని చోట్ల సీన్స్ “కార్తీ ఖైదీ” సినిమాను గుర్తుకు తెస్తాయి. అందులో ఉన్న పోలీస్ ఆఫీసరే ఇందులో ఉంటాడు, అదీ రాత్రే ఇదీ రాత్రే..! బహుశా సేమ్ క్యారెక్టర్ కాబట్టి నాకలా అనిపించిందేమో.?
హీరోయిజం ఓవర్ డోస్ అయింది. తను ఉన్న ప్రదేశం నుంచి మరొక ప్రదేశంలోకి సీన్ బై సీన్ లో ఎలా వస్తాడో అర్థం కాదు. గబ్బర్ సింగ్ సినిమా తరహా సుదీప్ ఓన్ అట్టిట్యూడ్ మెయిన్ మైనస్ పాయింట్. హీరో పేరే “మ్యాక్స్”. ఈ సినిమా మోరల్ స్టోరీ బాగుంది కానీ..? స్క్రీన్ ప్లే& ఎడిటింగ్ దెబ్బేసింది. మాస్ మసాలా లవర్స్ కి కనెక్ట్ అవుతుంది, పర్వాలేదు చూడండి, జీ5లో తెలుగులో ఉంది…
Share this Article