వారసత్వం… రాజకీయాల్లో అత్యంత ప్రధానమైన పదం ఇది… మగ వారసులు ఉన్న తండ్రులకు పర్లేదు… ఎంత చదువుకున్నా, ఎక్కడ కొలువులు చేస్తున్నా పట్టుకొచ్చి రాజకీయాల్లోకి ప్రవేశపెట్టి, పదును పెడతారు తండ్రులు… మరి రాజకీయాల్లో ఉన్నంత ఆస్తి, పెత్తనం, వైభోగం, బలగం, బలం మరే రంగంలోనూ దక్కవు కదా… పైగా కావల్సినంత సంపాదించుకునే చాన్స్… ఎంత తవ్వుకుంటే అంత…
అందుకే కుటుంబ పార్టీల్లో ఎక్కువగా మగ వారసత్వమే అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది… శరద్ పవార్ అజిత్ పవార్‌ను అంతగా నమ్మలేదు, బిడ్డ సుప్రియా సూలే మీదే కాన్సంట్రేట్ చేశాడు, ఆ దెబ్బకు పార్టీయే అజిత్ పవార్ చేతుల్లోకి వెళ్లిపోయింది… అలా ఉంటయ్, సరైన వారసుల్ని తయారు చేసుకోలేకపోతే తగిలే దెబ్బలు…
సరే, స్టాలిన్‌కు ఉదయనిధి ఉన్నాడు, అప్పుడే మనువాదం దాకా వెళ్లిపోయాడు, మంత్రి, రాజకీయాల్లో రాటుదేలుతున్నాడు… కేసీయార్ వారసుడు కేటీయార్, డౌట్ లేదు, మొన్నటిదాకా యాక్టింగ్ సీఎం తను, జైలుపాలైన కవితకు ఇక ఏ ఆశలూ లేనట్టే… జగన్‌కు ఇప్పుడప్పుడే అక్కర్లేదు… చంద్రబాబుకు లోకేషుడు ఉండనే ఉన్నాడు… బాగానే తయారవుతున్నాడు… అంతెందుకు..? తెల్లారిలేస్తే లక్ష నీతులు చెప్పే సీపీఎంలోనూ ఈ పోకడలున్నయ్ కదా… పినరై విజయన్ అల్లుడు రెడీ… ఆల్రెడీ మంత్రి…
Ads
పార్టీని, కుటుంబాన్ని ఎంత భ్రష్టుపట్టించినా సరే రేవణ్నకు ప్రజ్వలుడున్నాడు… దేవెగౌడకు కుమారస్వామి ఉన్నాడు… యడ్యూరప్పకూ కొడుకు యాక్టివ్ అయిపోయాడు… లాలూకు తేజస్వి యాదవ్ రెడీ అయిపోయాడు… ములాయం వారసుడిగా అఖిలేషుడు స్టాండయిపోయాడు… ఉద్దవ్ ఠాక్రేకు ఆదిత్య ఠాక్రే రెడీ… ఇలా ఎన్నెన్నో ఉదాహరణలు, అటు కాశ్మీర్ దాకా… ఐతే ఎటొచ్చీ సరైన వారసుడిని ఎంపిక చేసుకోలేని వాళ్లదే చింత…
బీహార్ నితిశ్ తన రాజకీయ వారసుడిగా ఫాఫం ప్రశాంత్ కిశోర్‌ను ఎంపిక చేసుకున్నాడు… కానీ ఎక్కడో బెడిసికొట్టింది, ఎదురుతన్నింది… ఈరోజుకూ ఆ ఖాళీ అలాగే ఉండిపోయింది… నవీన్ పట్నాయక్ ఎక్కడో పుట్టిన ఆ తమిళ పాండ్యన్‌ను తన వారసుడిగా ఎంచుకున్నాడు… నితిశ్, నవీన్‌ల కథలు వేరు… మమతకు ఎవరూ లేరు, సో, మేనల్లుడిని తయారు చేసుకుంది, పేరు అభిషేక్ బెనర్జీ… 36 ఏళ్లకే ముదిరిపోయాడు… మమతకే పాఠాలు చెబుతాడు ఇప్పుడు… టీఎంసీ రౌడీ రాజకీయాల్ని ఆర్గనైజ్ చేసేది తనేనట…
ఫాఫం, జయలలిత సరైన వారసుడిని తయారు చేసుకోలేక దిక్కులేని చావుకు గురి కావడమే కాదు, వేల కోట్ల రూపాయలు ఎవడి పాలయ్యాయో కూడా ఎవరికీ సరిగ్గా తెలియదు ఇప్పుడు… ఎంత నియంతగా ఎదిగినా, వెలిగినా చివరకు ఓ తలకుమాసిన చరిత్రతో ముగిసిపోయింది… మోడీ, యోగిలకు అసలు అలాంటి బాధే లేదు…
ఇప్పుడు తాజాగా ఏమిటంటే..? మాయావతి తన వారసుడిపై వేటు వేసింది… తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను వారసుడిగా ఎంపిక చేసుకుంది… పార్టీకి నేషనల్ కోఆర్డినేటర్‌గా చేసుకుంది… పదును పెట్టింది…
కానీ సరైన రీతిలో ఇంకా తయారవలేదు… మొన్నామధ్య ఎక్కడో అఫ్ఘనిస్థాన్ తాలిబన్ ప్రభుత్వానికీ మోడీ ప్రభుత్వానికీ తేడా లేదని ప్రసంగించి, ఎన్నికల కమిషన్‌తో చీవాట్లు తిన్నట్టు గుర్తు… మాయావతి ఇప్పుడు తనను పార్టీ పదవుల నుంచి తొలగించింది… అంటే తన వారసత్వం నుంచి తప్పించింది… నీకు పొలిటికల్ మెచ్యూరిటీ వచ్చేవరకు అంతేపో అనేసింది… 29 ఏళ్లకే ఆకాశ్‌కు తత్వం బోధపడింది… ప్చ్, బీజేపీని తూలనాడితే వారసత్వాలే గల్లంతవుతున్నాయి… ఇంట్రస్టింగ్..!!
Share this Article