Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డొల్ల వాదన… శుష్క ప్రచారం… జియ్యర్‌పై దాడి వెనుక మర్మమేంటో…!!

June 10, 2023 by M S R

ఆంధ్రజ్యోతి మరీ ఇలా దిగజారిపోయిందేమిటి హఠాత్తుగా… రెండు స్టోరీలు చూశాక అనిపించింది ఇదే… చినజియ్యర్ మేనల్లుడు విష్ణు లీలలు అని ఆంధ్రజ్యోతిలో బొంబాట్ చేశారు ఒక స్టోరీ… ఏబీఎన్‌లో అదే స్టోరీ… తరువాత ఎవరో మహిళను హతమార్చిన పూజారినీ ఈ జియ్యర్ మేనల్లుడినీ కలిపేసి ‘స్వాముల’పై ఏబీఎన్‌లో ఓ డిబేట్… ఈ జియ్యర్ స్టోరీ పక్కా ప్లాంటెడ్ అనిపిస్తోంది… ఆంధ్రజ్యోతి పరిశోధన అని గొప్పగా రాసుకున్నారు గానీ మరీ నాసిరకం స్టోరీ…

ఎవరో పనిగట్టుకుని, ఏదో మార్మిక ఉద్దేశంతో ఫోటోలు తీసి మరీ ఆంధ్రజ్యోతికి నిప్పందించారు… ఈ ప్రచార ధూంధాం వెనుక ఆర్థిక, రాజకీయ మర్మాలు ఏవో ఉన్నాయి… బహుశా అదే మీడియా ఓనర్ రాధాకృష్ణ మాత్రమే చెప్పగలడు ఈ కారణాలేమిటో… కాకపోతే ఈ స్టోరీలు ఉద్దేశపూర్వకం అనేది పక్కా… ఇక్కడ విష్ణు గానీ, చినజియ్యర్ గానీ శుద్ధపూసలు అని చెప్పడం లేదు… విష్ణును ముందుపెట్టి జియ్యర్ మీద కాల్పులు ఎవరు, ఎందుకు స్టార్ట్ చేశారనేది అంతుపట్టదు…

ఉన్నాయి… చినజియ్యర్ కట్టిన రామానుజ ప్రాంగణం వెనుక ఆర్థిక కోణాలు, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కోణాలున్నట్టు ప్రచారాలు ఉన్నాయి… మైహోం రామేశ్వరరావుతో విభేదాలూ ఉన్నాయి… మైహోంకూ కేసీయార్‌కూ పొసగడం లేదు… వైసీపీకి కూడా శారదాపీఠంతో ఎలా సత్సంబంధాలు ఉన్నాయో చినజియ్యర్ పీఠంతోనూ అంతే బలమైన సంబంధాలున్నాయి… బీజేపీ అనుకూలుడిగా పేరుంది… మరి ఎవరి ప్రయోజనాల కోసం ఈ స్టోరీలు రాయబడ్డాయో, చూపబడ్డాయో అంత తేలికగా అర్థమయ్యేది మాత్రం కాదు…

Ads

ఇంతకీ ఆంధ్రజ్యోతి బాధేమిటంటే… 1) ఒక పీఠాధిపతి మేనల్లుడు అంటే ఎంత పద్ధతిగా ఉండాలి..? 2) పొద్దున యోగి, రాత్రయితే భోగి.. 3) పగలు స్వామి- రాత్రికి రాక్‌స్టార్… 4) ఖరీదైన కార్లలో షికార్లు… 5) ఉత్తరాధికారిగా ప్రచారం… 6) ఆశ్రమ యువరాజు విలాసాలు… ఇలా ఏదేదో మాఫియా లీడర్‌ను వర్ణించినట్టుగా రాసిపారేశారు… ఇక్కడ ప్రశ్న ఏమిటంటే… ఈ విష్ణును ముందుపెట్టి ఏ ప్రయోజనాల కోసం రాధాకృష్ణ ఈ స్టోరీలకు పూనుకున్నాడు..?

aj

సదరు విష్ణుస్వామిని ఇక్కడ వెనకేసుకురావడం లేదు… కానీ ఆంధ్రజ్యోతి నాసిరకం పరిశోధన గురించి మాట్లాడుకుంటున్నాం… విష్ణుస్వామి ఆశ్రమానికి యవరాజు ఏమీ కాదు… పగలు యోగి కూడా కాదు… అడ్మినిస్ట్రేషన్ వర్క్ చూస్తాడు తప్ప ఆశ్రమంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయన పాత్ర ఏమీ ఉండదు… కాకపోతే జియ్యర్ మేనల్లుడు కాబట్టి చినస్వామి అని పిలుస్తారు… పైగా అతను ఉత్తరాధికారి కూడా కాదు… తన వారసుడిగా చినజియ్యర్ ఎప్పుడూ విష్ణును చూపించలేదు… ఆల్‌రెడీ ఇద్దరు ఉత్తరాధికారుల నియామకం జరిగిపోయింది… శిక్షణ పొందుతున్నారు… 

చాలామంది ఉద్యోగుల్లాగే తను కూడా ఓ ఉద్యోగి మాత్రమే అక్కడ… తనేమీ కాషాయం కట్టడు… పబ్లిక్ లైఫ్‌లో లేడు.,. కోట్లాది మంది జనంలో తను ఒకడు… అలాంటిది జియ్యర్‌పై కావాలని సాగిస్తున్న ఓ వ్యతిరేక ప్రచారంలో విష్ణుస్వామిని ఎందుకు ముందుకుపెట్టి కథలు రాస్తున్నారు..? తను ఓ మామూలు మనిషి… బీఎండబ్ల్యూ 5 సీరిస్ పాత కారులో రాత్రి పబ్బులు గట్రా తిరుగుతూ ఉంటాడు… అది నిజం… అమ్మాయిల పిచ్చి ఉందనేదీ నిజమే… కానీ పబ్బులు ఏమైనా నిషిద్ధ సంస్థలా హైదరాబాదులో..? లక్షల మంది రోజూ వెళ్తున్నారు కదా… విష్ణు అక్కడికి వెళ్తే నేరమేంటి..? తన వ్యక్తిగత అభిరుచులను చినజియ్యర్‌కూ, పీఠానికి ముడిపెట్టడం ఏమిటి..? (పీఠాధిపతి గాకమునుపు జియ్యరుడు కూడా ఓ మామూలు మనిషే కదా…)

రాత్రయితే డ్రెస్సు మారిపోతుంది, మద్యమాంసాదులు వద్దని జియ్యర్ చెబుతాడు, మేనల్లుడే పాటించడు అనేది డొల్ల వాదన… తల్లిదండ్రులు చెబితే పిల్లలే మాట వినడం లేదు… ఐనా మేనల్లుడి బుద్ధులను బట్టి మేనమామ శీలంపై దాడి చేయాలా..? పబ్బులకు జీన్స్, టీషర్టులతో, బూట్లతో వెళ్లడం అసాధారణమా..? అలా వెళ్లకపోతే ఏ పబ్బులోకి కూడా రానివ్వరు… కాషాయం కట్టుకుని వెళ్లాలా..? అందుకే నాసిరకం, శుష్క పరిశోధన అంటున్నది…  రియల్టర్లతో ఆర్థిక బంధాలున్నయ్, వాటితోనే పక్కదారి పట్టాడు అని రాసుకొచ్చారు… సోకుకు తుపాకి పట్టుకున్న ఫోటో తప్ప తను మందు తాగుతున్నట్టో, అమ్మాయిలతో కలిసి డాన్సులు చేస్తున్నట్టో ఫోటోలు, ఇతర ఆధారాలున్నాయా..? అవీ లేవు… ఒకవేళ భ్రష్టుడని తేల్చినా సరే, దానికీ పీఠానికీ ఎందుకు లంకె పెట్టడం..?

ఎవడో సాయికృష్ణ అనే పూజారి, ఓ మహిళతో సంబంధాలు… ఎక్కడ తేడా కొట్టిందో, కొట్టాడు, ఆమె హరీమంది… ఎస్, వాడు చేసింది తప్పే… హత్యే… ఏకిపారేయండి… శిక్షించండి, బజారులో నిలబెట్టి బదనాం చేయండి… కానీ పూజారులందరూ అలాంటివాళ్లే అన్నట్టుగా విష్ణును, ఈ యువ పూజారినీ కలిపేసి డిబేట్లు ఏమిటి..? ఇద్దరూ వేర్వేరు వ్యక్తులు… కానీ ఇద్దరూ యోగులు కాదు, స్వాములు కాదు… ఎందుకీ పనిమాలిన డిబేట్..? నిజంగానే ఆంధ్రజ్యోతిది దిక్కుమాలిన పాత్రికేయం ఈ డిబేట్‌లో… ఈ ఉద్దేశపూర్వక కథనాల్లో… కానీ ఏమాటకామాట..? ‘గుడి ఎనక నా సామి’ అనే సినీగీత పల్లవిని భలే వాడుకున్నారు తమ స్టోరీకి పంచ్ లైన్‌గా…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions