.
విష్వక్సేన్ నిజానికి మంచి నటుడు… తనలో ప్రయోగాలు, సాహసాలు చేయగల టెంటర్‌మెంట్ కూడా ఉంది… ఆమధ్య వచ్చిన గామి కూడా ఓ భిన్నమైన కథాంశం… డిఫరెంట్ లుక్…
చాలామందికి నచ్చింది… సెకండ్ లేయర్ హీరోల్లో మంచి కెరీర్ ఉన్నవాడనే గుర్తింపు కూడా పొందాడు… కానీ హఠాత్తుగా ఏమైందో ఈ మెకానిక్ రాకీ సినిమా అంగీకరించాడు…
Ads
ఇదొక ట్రయాంగల్ లవ్ స్టోరీ కాదు… కామెడీ స్టోరీ కాదు… థ్రిల్లర్ కాదు… స్కామ్ రిలేటెడ్ సీరియస్ సినిమా కాదు… అవన్నీ ఉన్నట్టుగా… అప్పుడే లేనట్టుగా… ఓ కలగాపులగం కథ… కాదు, కన్‌ఫ్యూజింగ్ లైన్…
అబ్బే, అది ఆ దర్శకుడు క్రియేట్ చేసిన గందరగోళం, విష్వక్సేన్ తప్పేముంది అనలేం… వర్తమానంలో సాదాసీదా రొటీన్ సినిమాలు చేస్తే కుదరదు… స్టార్ హీరోల కథలు వేరు… వాళ్లకు సినిమాల్లో కథలే అక్కర్లేదు… అదొక మాయా ప్రపంచం… కానీ విష్వక్సేన్ వంటి హీరోలు వైవిధ్యాన్ని చూపించాల్సిందే ప్రేక్షకులకు…
మెకానిక్ రాకీ నిజానికి ఓ భిన్నమైన ప్లాట్… ఆర్గానిక్‌గా అదే కథను ఇంకాస్త సీరియస్ టోన్‌లో రాసుకుని, అలాగే ప్రజెంట్ చేస్తే బాగుండేదేమో… కానీ ఏం జరిగింది..?
తీసుకున్న ఆ బేసిక్ ప్లాట్ సినిమా చివరలో… అంటే మరీ అరగంట, ముప్పావుగంటే… మరి మిగతాది… ఉత్తదే సోది… ఫస్టాఫ్ అయితే ఎందుకొచ్చాంరా సినిమాకు అన్నట్టుగా తెగ విసిగిస్తుంది… అంత నిస్సారం…
పాటలు బాగాలేవు… బీజీఎం జస్ట్ వోకే… కామెడీ అస్సలు వర్కవుట్ కాలేదు… లవ్వు గివ్వు కథా పెద్దగా రక్తికట్టలేదు… ఇద్దరు వీరోయిన్లు… లక్కీ భాస్కర్‌తో బాగా వెలుగులోకి వచ్చిన మీనాక్షి చౌదరి తరువాత మట్కా సూపర్ ఫ్లాప్‌తో దిగాలుపడింది… ఇక ఈ మెకానిక్ రాకీతో మరింత నిరాశ… అసలు ఆమె పాత్రకు ప్రాధాన్యం ఏముంది..? ఆమె చేయగలిగింది ఏముంది..?
కాస్తోకూస్తో శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర బెటర్… విష్వక్సేన్ పాత్ర కేరక్టరైజేషన్ మాటెలా ఉన్నా సరే, తనకు అప్పగించిన ఆ పాత్రకు న్యాయం చేశాడు, చేయగలడు… కానీ అదొక్కటే సరిపోదు కదా… కేవలం తన కోసం మాత్రమే థియేటర్ దాకా రాడు కదా ప్రేక్షకుడు…
మొన్నామధ్య బిగ్‌బాస్ హౌజుకు వచ్చాడు… ఆ సినిమాకు సంబంధించే అవినాష్, రోహిణిలతో ఓ చిన్న స్కిట్ చేయించారు ప్రమోషన్ కోసం… తను కూడా ఉన్నాడు… అది చూస్తేనే ఏదో తేడా కొట్టింది అని సినిమా సరుకు మీద డౌట్ కొట్టింది… చివరకు అదే జరిగింది…
కాస్త కామెడీ, కాస్త లవ్వు, కాస్త ఎమోషన్, కాస్త యాక్షన్, కాస్త థ్రిల్లర్ పాయింట్, కాస్త సోషల్ కాన్సెప్టు… ఇన్ని కలిపి అలా ప్రేక్షకుల్లోకి వదిలితే చాలు, వర్కవుట్ అవుతుంది అనే పాత తరహా రోజులు కావు ఇవి… అది ఈ నిర్మాత, హీరో, దర్శకులకు అర్థం కాలేదు..!!
Share this Article