మనం దక్షిణ కుంభమేళాగా చెప్పుకుంటాం… మహావనం మహాజనంగా కనిపిస్తుంది మూణ్నాలుగు రోజులపాటు… కిలోమీటర్ల పరిధిలో జనం, గుడారాలు, వంటలు, పూజలు, మొక్కులు, స్నానాలు కనిపిస్తాయి… పిల్లాజెల్లా అందరూ తరలివస్తారు… అదొక ఆదివాసీ మహోత్సవం… సమ్మక్క- సారలమ్మలపై వాళ్ల భక్తికి తిరుగులేదు…
మెచ్చుకోదగిన విషయం ఏమిటంటే… సోకాల్డ్ సంప్రదాయ ఆగమశాస్త్ర పూజావిధానాలను అక్కడ పూజారులు రానివ్వరు… తమ సొంత అర్చన రీతులను మాత్రమే పాటిస్తారు… విగ్రహాలు, అభిషేకాలు, ఆర్జితపూజలు గట్రా అస్సలు అనుమతించరు… అసలు తమ పూజల్లోకి అన్యులను అస్సలు ఎంటర్ కానివ్వరు… తమ సొంత విశిష్ట అర్చన రీతిని అలా కాపాడుకుంటున్నారు… అంతెందుకు..? గుళ్లు, మంటపాలు కూడా ఉండవు…
అనేక గుళ్లల్లో సంప్రదాయ, స్థానిక పూజారీతులను తోసేసి ఆగమీకరించారు… కానీ సమ్మక్క-సారలమ్మ గద్దెల విశిష్టత అలా కాపాడబడుతోంది… 1.35 కోట్ల మంది భక్తులు ఈసారి దర్శించుకున్నట్టు ఓ అంచనా… ఓ వార్త చదివితే కాస్త ఇంట్రస్టింగ్ అనిపించింది… దేవాదాయ శాఖ ఈ భక్తుల నుంచి కానుకలు దండుకోవడానికి ఏకంగా 540 హుండీలు పెట్టింది… 350 మంది సిబ్బంది అయిదారు రోజులపాటు లెక్కించారు…
Ads
మొత్తం వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా..? 13.25 కోట్లు… గతంకన్నా అధికమే… కానీ సగటున ఒక భక్తుడు పది రూపాయలు హుండీలో వేశాడన్నమాట… (తిరుమలలో ఇది రెండు రోజుల హుండీ ఆదాయం… సరే, దాంతో పోలిక అనవసరం) ( జాతర అయిపోయాక అక్కడ నిర్వహించాల్సిన పారిశుధ్య కార్యక్రమాలకు గట్రా ఈ ఆదాయం సరిపోతుంది… ఎందుకు..?
అక్కడికి వచ్చే భక్తులు ఎక్కువగా పేదవర్గాలు… లేదా దిగువ మధ్యతరగతి… పైగా ఈ భక్తుల విశ్వాసం గద్దెల మీదకు బంగారంగా పిలవబడే బెల్లాన్ని సమర్పించడమే దేవతలకు సమర్పించే కానుకలు… ప్లస్ కొబ్బరికాయలు… అంతేతప్ప హుండీల్లో నగదు వేయడాన్ని పెద్దగా ఇష్టపడరు… నిజం చెప్పాలంటే ఆ హుండీల ఉనికే చికాకు… కాకపోతే కొందరు గద్దెల మీదకే నోట్లు విసిరేస్తుంటారు… అవి లెక్కల్లోకి రావు… (779 గ్రాముల బంగారం, 55 కిలోల వెండి కూడా వచ్చింది…)
సరే, అక్కడ ఎంత బెల్లం అమ్ముడుబోయిందనే లెక్కలు సరిగ్గా తెలియవు కానీ… ఆదివాసీ జాతర అంటే కోళ్లను, మేకలను కోసేయడం, మద్యం… దర్శనాలు… గ్రామాల్లో శక్తిరూపాలు, గ్రామదేవతల పూజల్లాగే..! అంతేతప్ప ఇతర గుళ్లల్లో వేసినట్టు హుండీల్లో కానుకలు వేసి మొక్కుకోవడం చాలా తక్కువ.,. సో, సగటున ప్రతి భక్తుడిచ్చిన ఆ పదిరూపాయలు కూడా ఆ దేవతలకు ఇచ్చినవి కావు, అవి ప్రభుత్వానికి ఇచ్చినవి..!! అసలు కానుకల పరిమాణం తేలాలంటే ఎన్ని టన్నుల బంగారం, అంటే బెల్లం అమ్ముడైందో తెలియాలి..!!
Share this Article